కోడికత్తి కేసులో జగన్‌కు హైకోర్ట్‌ షాక్‌

0
168
ys jagan

2019 ఎన్నికలకు ముందు అత్యంత సంచలనం రేపిన ఘటన కోడికత్తి దాడి. అప్పటి ప్రతిపక్ష నాయకుడు వై.యస్‌. జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన ఈ హత్యాయత్నం వైసీపీకి రాజకీయంగా బాగా ఉపయోగపడిరది. అప్పట్లో ఈ దాడికి టీడీపీ వారే కారణమని వైసీపీ ఆరోపించింది.

ఇదే విషయాన్ని ఆ పార్టీ సోషల్‌ మీడియా విపరీతంగా ప్రచారంలో పెట్టింది. ఈ కేసులో అదే రోజు స్పాట్‌లో అనుమానితుడుగా ఉన్న జనుపల్లి శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ys jagan

నాటి నుంచి అంటే దాదాపు 5 సంవత్సరాలుగా శ్రీనివాసరావు జైలులోనే మగ్గుతున్నాడు. ఈ కేసులో సాక్ష్యం చెప్పటానికి జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటి వరకూ కోర్టుకు హాజరుకాక పోవడంతో శ్రీనివాసరావుకు సహజ న్యాయ సూత్రాలను అనుసరించి రావాల్సిన బెయిల్‌ కూడా రాలేదు.

ఈ విషయంలో ఇప్పటికే పలుమార్లు శ్రీనివాస్‌ తల్లి శారదమ్మ, శ్రీనివాస్‌ సోదరుడు రాజు ముఖ్యమంత్రి జగన్‌ అపాయింట్‌మెంట్‌ కోసం ఆయన ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కానీ కనీసం వారిని కలిసే ఆలోచన కూడా జగన్‌ చేయలేదు.

దీంతో రెండు రోజుల క్రితం విశాఖ జైల్లో ఉన్న శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్షను చేపట్టాడు. అలాగే అతని తల్లి, సోదరుడు కూడా విజయవాడలో దీక్షను చేపట్టారు. ఈ దీక్షను పోలీసులు భగ్నం చేయటానికి ప్రయత్నించడం, ప్రజాసంఘాలు అడ్డుకోవడం జరిగింది.

ఈ విషయంలో కోర్టు ద్వారానే న్యాయం పొందుదామని శ్రీను తల్లి, అన్నల చేత దీక్షను విరమింపచేశారు. ఈ విషయమై కొందరు న్యాయవాదులు హైకోర్టులో పిటీషన్‌ వేశారు. ఈమేరకు లీగల్‌ ఇంటర్వ్యూకు హైకోర్టు అనుమతిని ఇచ్చింది.

ఈ సందర్భంగా తోటి ఖైదీలు శ్రీనివాస్‌ను చేతులపై మోసుకు రావడంతో అతని పరిస్థితి ఏంటో కోర్టుకు సైతం అర్ధమైంది. శ్రీను తరుపున న్యాయవాదులు బెయిల్‌పై అత్యవసర విచారణు కోరారు. వెంటనే స్పందించిన హైకోర్టు శ్రీనివాస్‌ కేసును రేపు అత్యవసరంగా విచారించటానికి అనుమతిని ఇచ్చింది.

ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. రేపు హైకోర్టుకు జగన్‌ ఎందుకు రావడంలేదో తప్పని సరిగా ప్రభుత్వం తరపు న్యాయవాది సమాధానం ఇవ్వాల్సి ఉంది. అతని సమాధానంతో సంతృప్తి చెందకపోతే.. కోర్టే జగన్‌ను తమ ముందు హాజరవ్వాలని ఆదేశించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే గనుకు జరిగితే జగన్‌కు ముందు నుయ్యి.. వెనక గొయ్యిగా మారుతుంది.