సింగరేణిపై రేవంత్‌ ప్రత్యేక దృష్టి… 9 ఏళ్లుగ తిష్టవేసిన అధికారికి ఉద్వాసన..!

0
314

సింగరేణి… తెలంగాణకు కొంగుబంగారం ఈ నల్ల బంగారం. ఇటు ఖమ్మం జిల్లా నుంచి అటు ఆదిలాబాద్‌ జిల్లా వరకూ విస్తరించిన ఉన్న బొగ్గుగనులు తెలంగాణకు మణిహారంగా చెప్పుకోవచ్చు.

భారతదేశంలోనే తొలి ప్రభుత్వ రంగ సంస్థగా ఇది ప్రారంభించబడిరది. దశాబ్దాలుగా దేశ సంపదలో తనవంతు పాత్రను పోషిస్తోంది.

అయితే టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత నడిమెట్ల శ్రీధర్‌ను సీఎండీగా కేసీఆర్‌ నియమించారు. అప్పటి నుండి ఆయనపై అనేక ఆరోపణలు, కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ కేసీఆర్‌ శ్రీధర్‌ పదవీకాలం పొడిగిస్తూ వచ్చారు.

రెండుసార్లు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కార్మిక సంస్థే గుర్తింపు పొందిన సంస్థగా ఉన్నప్పటికీ కార్మికులకు సంబంధించిన కనీస కోర్కెలపై హామీని శ్రీధర్‌ నుంచి తీసుకోలేక పోయింది.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే సింగరేణిలో కాంగ్రెస్‌, సీపీఐలకు చెందిన కార్మిక సంఘాలు కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో విజయం సాధించాయి.

టీఆర్‌ఎస్‌ అనుబంధ సంస్థ అసలు పోటీలోనే లేకుండా పోయింది. ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి సింగరేణి విస్తరించి ఉన్న ప్రాంతాలలో పర్యటించినప్పుడు తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా సింగరేణిలో మంచి మార్పులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

అన్నమాటకు కట్టుబడి తాజాగా సీఎండీ శ్రీధర్‌ను సింగరేణి నుంచి బదిలీ చేసి, జీఏడీలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. ఈయన స్థానంలో ఐఆర్‌ఎస్‌ అధికారి బలరాంకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

Vermas strategy backfired

సింగరేణి విషయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి, కార్మికుల సంక్షేమం గురించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించడంతో కార్మికుల్లో తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే ఆశ చిగురిస్తోంది.

కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు రాజ్‌ఠాకూర్‌,

గెడ్డం వివేక్‌ వెంకటస్వామి, టీజేఎస్‌ అధ్యక్షులు కోదండరాంలతో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వారు పలు సూచనలు చేశారని,

తమ దృష్టికి వచ్చిన సంస్థకు సంబంధించిన సమస్యలు, పరిష్కార మార్గాలు కూడా సీఎంతో చెప్పినట్లు తెలిసింది. ఈ సందర్భంగా సింగరేణి విషయంలో కేంద్ర ప్రభుత్వంతో చర్చించి, చిత్తశుద్ధితో పనిచేసి, సంస్థను లాభాల బాటలోకి తీసుకు వద్దామని ముఖ్యమంత్రి అన్నట్టు తెలిసింది.