నేను సునీతమ్మలా న్యాయ పోరాటం చేయను

0
311
ys vivekananda reddy

తన భర్తకు ఏదైనా ప్రాణహాని జరిగితే నేను సునీతమ్మ లాగా న్యాయపోరాటం చేయను. వారిని చంపి, నేను కూడా చచ్చిపోతా అన్నారు వివేకానందరెడ్డి కేసులో నిందితుడు, అప్రూవర్‌ దస్తగిరి భార్య షబానా. గురువారం ఏబీఎన్‌ ఛానల్‌ నిర్వహించిన డిబేట్‌లో ఆమె మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ‘‘నేను నిజం చెపితే బయట ఉంటాను. నా పెళ్లాం పిల్లలకు అన్నం పెట్టుకునే అవకాశం ఉంటుందనే మా ఆయన అప్రూవర్‌గా మారారు. పులివెందుల, కాళహస్తి, కోడూరు ఇతర ప్రాంతాల్లో మా ఆయనపై కేసులు పెట్టారు.

నా భర్త గవర్నమెంట్‌కు చెందిన పోలీసులు, గన్‌మెన్‌ల రక్షణలో ఉన్నారు. ఆయన ఎలా నేరం చేయటానికి అవకాశం ఉంటుందో చెప్పాలి. మీరు ప్రోత్సహిస్తేనే మీతో వివేకాను హత్య చేయటానికి వచ్చాడు. అది తప్పుకాదు అని నేను అనటం లేదు. నా భర్త చేసింది తప్పే.

ys vivekananda reddy

కానీ పెద్ద రెడ్డిలందరూ తప్పించుకుని నా భర్తవంటి సామాన్యులను ఇరికించారు. వివేకాను చంపింది ఎవరో పులివెందుల్లోని అందరికీ తెలుసు. దీని వెనుక అవినాష్‌రెడ్డి ఉన్నాడని చెట్టూ, పుట్టకు కూడా తెలుసు. నన్ను చంపుతారేమోనని మా ఆయన భయపడుతున్నారు.

ఏం చేయగలరు ఏ లారీతోనో గుద్ది చంపుతారు అంతేగా. నాకు కూడా మా ఆయన్ను జైల్లో చంపేస్తారనే అనుమానం చాలా బలంగా ఉంది. జగన్‌ సీఎం అయినప్పటి నుంచీ మమ్మల్ని పెట్టిన టార్చర్‌తో మేం రాటుదేలిపోయాం. అందుకే మా ప్రాణాలు పోతాయని ఫిక్స్‌ అయిపోయాం.

మా ఆయనకు రవ్వంత హాని జరిగితే నేనే ఊరుకోను.. సునీతలా న్యాయ పోరాటం చేయను. వారిని చంపి, నేను నా భర్తకు దగ్గరకు పోతాను. సునీతమ్మ తండ్రిని చంపుకునేంత కఠినాత్మురాలు కాదు. ఆమె భర్తే వివేకానంద సార్‌ను హత్య చేసి ఉంటే, ఆమె న్యాయం కోసం సీబీఐ దాకా ఎందుకు వెళుతుంది.

ఈ మాత్రం బుద్ధి, జ్ఞానం లేకుండా ఉన్నారు. పులివెందులలో అవినాష్‌రెడ్డిదే కుటుంబం కాదు. మాకు కూడా కుటుంబం ఉంటుంది కదా?. ఈ కేసులో ఇంత జరుగుతున్నా జగన్‌ ఇన్ని సంవత్సరాల్లో మాట్లాడకపోవడంతోనే ఈ విషయం జగన్‌కు సంబంధం ఉందని అనుకోవచ్చు. ఈ కేసు తేలకుండా కేంద్రంలోని బీజేపీ కూడా జగన్‌కు సహకరిస్తోంది అని విమర్శించారు.