వైశ్రాయ్‌ తరహా డ్రామాకు తెర తీసిన జ్యోతి

0
592
viceroy hotel ntr

భారతదేశ రాజకీయాలకు అందులోనూ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఓ చీకటి రోజులాంటిది 1995లో జరిగిన ‘వైశ్రాయ్‌’ ఎపిసోడ్‌. నాడు తెలుగుదేశం పార్టీలో రేగిన అంతర్గత గొడవలు కారుచిచ్చులా మారి పార్టీ చీలికకు దారి తీశాయి.

ఆ సందర్భంగా హైదరాబాద్‌ లోయర్‌ ట్యాంక్‌ బండ్‌లోని వైశ్రాయ్‌ హోటల్‌లో తన వర్గం ఎమ్మెల్యేలను ఉంచి రాజకీయం నడిపారు చంద్రబాబు. ఆ ఎపిసోడ్‌తో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబు చేతిలోకి వచ్చింది.

నాడు వైశ్రాయ్‌ ఎపిసోడ్‌లో మొదట చంద్రబాబు వైపు ఎమ్మెల్యేలు పెద్దగా లేకపోయినప్పటికీ నాటి లీడిరగ్‌ మీడియా అయిన ఈనాడు పేపరు అదిగో అంతమంది చేరిపోయారు. ఇదిగో ఇంతమంది చేరిపోయారు అంటూ టీడీపీ ఎమ్మెల్యేలలో గందర గోళం సృష్టించి బాబు వైపు అందరూ పరుగులు తీసేలా చేసిందని ఇప్పటికీ కథలు, కథలుగా చెప్పుకుంటారు.

viceroy hotel ntr

తాజాగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో రేగిన టిక్కెట్‌ల లొల్లి, అసంతృప్తుల తిరుగుబాటు తదితర అంశాల నేపథ్యంలో వీరిలో కొందరు చంద్రబాబుకు, మరికొందరు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు టచ్‌లోకి వెళ్లిన సంగతి చూస్తూనే ఉన్నాం.

ఈ ఎపిసోడ్‌ను బేస్‌ చేసుకుని ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్‌ ఛానల్‌ ఓ కథనాన్ని ప్రచురించింది.. ప్రసారం చేసింది.

అందులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు దాదాపు 12 మంది చంద్రబాబుకు టచ్‌లోకి వచ్చారని, వీరు చంద్రబాబును కలవటానికి హైదరాబాద్‌లోనే మకాం వేశారని, అందులో 8 మంది కీలక ఎమ్మెల్యేలు ఉన్నారని, చంద్రబాబు టైం ఇస్తే వీరితో పాటు మరికొందరు కూడా వైసీపీకి గుడ్‌బై చెప్పటానికి సిద్ధంగా ఉన్నారని రాసుకొచ్చింది జ్యోతి.

తద్వారా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు చేరుకున్నారని, చంద్రబాబు దగ్గర టిక్కెట్‌లపై హామీలు పొందబోతున్నారు కాబట్టి మనమూ ముందుగానే ఆయన్ను కలిస్తే బెటర్‌ అన్న భావన వారిలో కలిగించడం జ్యోతి ఉద్దేశం అయి ఉండవచ్చు. మొత్తానికి నాడు ఈనాడు నిర్వహించిన కర్తవ్యాన్ని నేడు ఆంధ్రజ్యోతి భుజానికెత్తుకుందన్నమాట.