ఎస్వీబీలో ఛాన్స్ కొట్టేసిన తెలంగాణ గాయని.. గౌరవ వేతనం తెలిస్తే షాక్..!

0
345

ప్రాంతాలుగా విడిపోయినా మనుషులుగా కలిసే ఉంటారు ఏపీ, తెలంగాణ ప్రజానీకం. దీనికి మంచి ఉదాహరణే శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ గాయనికి చోటు దక్కడం. తెలంగాణ ప్రముఖ గాయనిని ఏడుకొండలవాడు కనికరించాడు. దీంతో ఆమె శ్రీ వేంకటేశ్వర్ భక్తి ఛానల్ (ఎస్వీబీ)లో ఛాన్స్ కొట్టేసింది. ఏపీ ప్రభుత్వం ఆమెను గౌరవ సలహాదారుగా నియమిస్తూ నాలుగు నెలల కిందనే ఉత్తర్వులు జారీ చేయగా, నాలుగు రోజుల కిందనే ఆమె ఈ బాధ్యతులు తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై తెలంగాణ ప్రజానీకం కూడా హర్షం వ్యక్తం చేసింది.

ఎస్వీబీలో తెలంగాణ జానపద సింగర్ మంగ్లీకి చోటు

తెలంగాణలోని ప్రముఖ జానపద గాయనీగా ‘మంగ్లీ’కి మంచి గుర్తింపు ఉంది. సామాజిక జానపదాలే కాకుండా భక్తిపాటలను కూడా పాడి మెప్పించారు మంగ్లీ. ఆమె కళను గుర్తించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎంపిక చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. కానీ ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీటీడీ రన్ చేస్తున్న భక్తి ఛానల్ సలహాదారుగా మంగ్లీ నియమితురాలైంది. జగన్ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారా చేసింది. రెండేళ్లపాటు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

నెలకు రూ. లక్ష గౌరవ వేతనం

ఇక ఈ పదవిలో నియమితులైన మంగ్లీకి నెలకు గౌరవ వేతనంగా రూ. లక్ష వేతనం అందుకోనుంది. మంగ్లీ గత ఎన్నికల్లో వైసీపీ తరుఫున ఎన్నికల్లో భారీగా ప్రచారం నిర్వహించింది. ఇందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమెను ఈ పదవిలో నియమించి దాదాపు 4 నెలలు కావస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితమే ఆమె బాధ్యతలు కూడా తీసుకుందని సమాచారం. మంగ్లీని ఎస్వీబీలో నియమించడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగు నెలలు గడుస్తున్నా ఇంత గోప్యత ఎందుకంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సింగర్ గా గుర్తింపు

మంగ్లీ లంబాడా తెగకు చెందిన అమ్మాయి. చిన్నతనం నుంచి కష్టించే మనస్తత్వం ఆమెది. తాను ఎంచుకున్న రంగంలో రాణించేందుకు చాలానే కష్టపడింది. ‘వీ6’ న్యూస్ ఛానెల్ లో వస్తున్న ‘తీన్మార్’ న్యూస్ తో తన కెరీర్ ప్రారంభించింది. దేవీ శ్రీప్రసాద్, మణిశర్మ, తదితర స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ల సినిమాల్లో పాటలు పాడి మెప్పించింది. ప్రతీ పండుగకు ఆమె చేసే ప్రైవేట్ ఆల్బం విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటుందంటే ఆమెకు సంగీతం, జానపదగేయాలపై ఉన్న పట్టు ఎంతటిదో అర్థమవుతుంది.

‘తెలంగాణ జానపద గేయని 2020’గా అవార్డు

మంగ్లీ ప్రతిభను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ‘ఉత్తమ జానపద గేయనిగా 2020’కి ఎంపిక చేసి సత్కరించింది. వీటితో పాటు సినిమాల్లో పాడిన పాటలకు ఆమెను చాలా అవర్డులు వరించాయి. ఇటీవల మంగ్లీ చెల్లెలు కూడా ఇండస్ర్టీ వైపునకు వచ్చింది. తనకు తన అక్కే రోల్ మోడల్ అంటూ చెప్తుంది. ఆమె పాడిన ‘ఊ అంటావా మావ.. ఊహు అంటావా మామ’ పాట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.