అటెన్షన్ క్రియేట్ చేసిన ట్రైలర్

0
287

ఈ మధ్య ఎక్కువగా థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. ఓటీటీ వెబ్ సిరీస్ విపరీతంగా పెరుగుతున్న కారణంగా కావచ్చు, కంటెంట్ అటెన్షన్ గ్రాబ్ చేసేలా ఉందంటూ కావచ్చు. కారణం ఏదైనా ప్రస్తుతం థ్రిల్లర్ సినిమాలకు మొదటి ఓటు వేస్తున్నారు సినీ అభిమానులు. ఇందులో భాగంగానే తెలుగు డైరెక్టర్లు కూడా ఆ మేరకే మంచి కథలను ఎంచుకొని అద్భుతంగా మలిచి ప్రేక్షకులు సీట్లకు అతుక్కునేలా డైరెక్టు చేస్తున్నారు. ఇందులో భాగంగానే వచ్చిన మరో సైకో థ్రిల్లర్ సినిమా ‘హిట్: ది సెకండ్ కేస్’.

అటెన్షన్ పెంచిన ట్రైలర్

విలక్షణమైన యంగ్ హీరో అడవి శేషు. అతని ప్రతీ సినిమా ఒక్కో వేరియేషన్ తో వెళ్తుంది. కర్మ, క్షణం, గూఢచారి, మేజర్, ఎవరు ప్రతి మూవీ కూడా డిఫరెంట్ కథతో వెళ్తుంది. ప్రతీ సినిమాలో కూడా అడవి శేషు ఈ క్యారెక్టర్ కు సరిగ్గా సరిపోయాడు అంటూ విమర్శకులు కూడా ప్రశంసలు గుప్పిస్తూనే ఉంటారు. ఆయన హీరోగా చేసిన మరో సినిమా ‘హిట్: ది సెకండ్ కేస్’ ఈ మూవీ ట్రైలర్ బుధవారం (నవంబర్ 23న) విడుదలైంది. సోషల్ మీడియా ప్లాట్ ఫాంపై ప్రస్తుతం గ్రేట్ వ్యూస్ తో దూసుకెళ్తుంది. సినిమాకు ట్రైలర్ గుండెకాయ వంటిది. ట్రైలరే సినీ ప్రియులను థియేటర్ వరకు తీసుకెళ్తుంది అనడంలో సందేహం లేదు. సైకో థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ మూవీ ట్రైలర్ లో అడవి శేషు ఒక హత్యకు సంబంధించి కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. హిట్-2 ట్రైలర్ ఉత్కంఠతను పెంచిందనే చెప్పాలి.

స్టోరీ ఎలా ఉండబోతోంది

అమ్మాయిలను అతి కిరాతకంగా చంపుతున్న ఓ సైకో కిల్లర్ ను పోలీస్ ఆఫీసరైన మన హీరో ఎలా పట్టుకుంటాడు అన్నది మూవీ ప్లాట్. మంచి కథ, అనుభవం ఉన్న డైరెక్టర్, స్క్రిప్ట్ ఉంటే క్రైమ్ థ్రిలర్లు ప్రేక్షకులను మంచి ఎంటర్ టైన్ చేస్తాయి. నెక్ట్స్ ఏంటి..? అంటూ ప్రేక్షకులే ఆలోచించేలా చేస్తూ సీట్లకు అతుక్కుపోయేలా చేస్తుంది. డైరెక్టర్ శైలేష్ కొలను ఫస్ట్ మూవీ విశ్వక్ సేన్ హీరోగా ‘హిట్’ తీశాడు. అదృశ్యమైన ఒక అమ్మాయిని వెతికే నేపథ్యంలో కథ సాగుతుంది. ఇందులో కిడ్నాప్, క్రైమ్, డ్రామాతో ఆకట్టుకున్నాడు శైలేష్

ఇది శైలేష్ రెండో చిత్రం

యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలనుకు ఇది రెండో చిత్రం మొదటి చిత్రం కూడా ఇదే జానర్ లో తీసి మెప్పించాడు. ఇలాంటి కథనే ఎంచుకొని రెండో చిత్రం తీయాలనుకున్నాడు శైలేష్. మొదటి మూవీ ‘హిట్’లో కిడ్నాప్, మర్డర్, ఇన్వెస్టిగేషన్ పంథాలో ఉండగా, రెండో కథ సైకో కిల్లర్ పట్టుకునే నేపథ్యంలో సాగుతుంది. (ట్రైలర్ ప్రకారం) సంజన్ అనే అమ్మాయి హత్యకు గురవుతుంది. ఆమె మర్డర్ ఇన్వెస్టిగేషన్ లో సంచలన నిజాలు బయటపడతాయి. ఒక్క అమ్మాయి మాత్రమే హత్యకు గురవ్వలేదని మరికొంత మంది కూడా హత్యకు గురైనట్లు తెలుస్తుంది. మైండ్ బ్లాక్ అయిన పోలీసులు సైకోను ఎలా పట్టుకుంటారో చిత్రంలో చూడాలి.

యంగ్ హీరో నాని ప్రొడ్యూసర్ గా

హిట్: ది సెకండ్ కేస్ ను నాని ప్రొడ్యూస్ నిర్మించారు. ‘వాల్ పోస్టర్ ఎంటర్ టైన్ మెంట్’ బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది. డిసెంబర్ 2వ తేదీనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్రకటించింది కూడా. విలక్షణ కథలను ఎంచుకునే అడవి శేషు చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యాయి. ఈ మూవీ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.