వరుస ఫ్లాపులతో నయన్ ఉక్కిరి.. బిక్కిరి

0
323

లేడీ ఓరియంటెడ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది నయనతార. ఆమె బెంగుళూరులో పుట్టింది. డయానా మరియం కురియన్ గా ఉన్న స్ర్కీన్ పేరు నయనతారగా మార్చుకుంది. చూడచక్కని రూపం ఆమెది. ఇక ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెపనవరం లేదు. సినిమాల్లోకి రాక ముందు మోడల్ గా గుర్తింపు తెచ్చుకుంది నయనతార. మళయాల చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నయనతార మొదటి చిత్రం ‘మనసునక్కరే’ ఇది భారీగా వసూళ్లను రాబట్టింది. దీంతో ఆమె గ్రాఫ్ ఘననీయంగా పెరింగింది. వెంట వెంటనే చిత్రాల్లో నటిస్తూ మంచి స్టార్ డమ్ దక్కించుకొని కిరీర్ ను బిల్డ్ చేసుకుంది నయనతార.

చంద్రముఖితో టాలీవుడ్ ఎంట్రీ

తెలుగులో వాసు డైరెక్షన్ లో వచ్చిన ‘చంద్రముఖి’తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తరువాత టాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లతో స్టార్ హీరోలతో పని చేసింది. మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్, కింగ్ నాగార్జునతో కలిసి చాలా చిత్రాల్లో నటించి మెప్పించింది కూడా. దాదాపు చాలా ఇండస్ట్రీలతో ఆమెకు అనుబంధం కొనసాగింది. ఇండియాలోనే సూపర్ స్టార్ ఇమేజ్ ను దక్కించుకున్న కొద్ది మందిలో నయనతార ఒకరనే చెప్పాలి. కేవలం ఆమె పేరుతోనే థియేటర్లకు వచ్చే వారు ఇప్పటికీ లేకపోలేదు. కానీ కథల ఎంపికలో కొంచెం తడబడిన ఆమె కెరీర్ ఇప్పుడు సందిగ్ధంలో పడిందనే చెప్పాలి.

వరుస ఫ్లాపులతో ఉక్కిరి బిక్కిరి

స్టార్ల పక్కన కమర్షియల్ మూవీస్ లో నటించే అవకాశాలు తగ్గిపోవడంతో ఆమె కెరీర్ లో మళ్లీ వెనకకు వెళ్తుంది. దాదాపు రెండు సంవత్సరాలుగా నయనతార నటించిన సినిమాలకు బాగా హైప్ వస్తున్నా అవేవీ ఆడడం లేదు. గత సంవత్సరం నయనతార లేడీ ఓరియంటెడ్ గా ‘నేత్రికన్’ వచ్చింది. కరోనా పరస్థితుల నేపథ్యంలో ఓటీటీలో విడుదలైన ఈ సినిమా బోల్తా పడింది. ఈ సంవత్సరం విజయ్ సేతుపతితో మరో హీరోయిన్ సమంతతో స్క్రీన్ ను పంచుకున్న ఆమె సినిమా ఫ్లాప్ అయ్యింది. తెలుగులో మెగాస్టార్ చెల్లెలిగా ‘గాడ్ ఫాదర్’లో నటించినా ఆమెకు సరైన గుర్తింపు దక్కలేదనే చెప్పాలి. ఆమె పాత్ర నిడివి, యాక్టింగ్ చూసి ఆమె అభిమానులు నిరాశకు గురైనట్లు టాక్ వినిపించింది.

కలిసి రాని డిసెంబర్

డిసెంబర్ నెల ఆమెకు కలిసిరాలేదనే చెప్పాలి. వరుస షాక్ లను ఎదుర్కొంది నయనతార. మళయాలం మూవీ ‘గోల్డ్’లో నటించగా ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక తాజాగా ఆమె నిర్మాణంలో చేసిన మూవీ ‘కనెక్ట్’ ఇటీవల విడుదలైంది. ఇది కూడా ఆమెను తీవ్ర నిరాశకు గురి చేసింది. తమిళంతో పాటు తెలుగులో రిలీజైన కనెక్ట్ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. వరుస దెబ్బలతో నయన్ మార్కెట్ పై ప్రతి కూల ప్రభావం పడుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు వయసు కూడా పెరగడం, ఆమె లుక్స్ లో తేడా రావడంతో ఆమె కెరీర్ చరమదశలో ఉన్నట్లు లీకులు వినిపిస్తున్నాయి.