ఉచితంగా ప్రభాస్ ‘సలార్’ టిక్కెట్లు

0
232
prabhas salaar tickets

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటంచిన లేటెస్ట్ చిత్రం ‘సలార్’ మరో 5 రోజుల్లో అన్నీ ప్రాంతీయ భాషల్లో ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కేజీఎఫ్ సిరీస్ తర్వాత ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన రోజు నుండే అంచనాలు తార స్థాయిలో ఉండేవి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ అభిమానులను అద్భుతంగా ఆకట్టుకున్నాయి.

కానీ రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ కి మాత్రం ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి ఆశించిన స్థాయి రెస్పాన్స్ రాలేదు. అనుకున్న స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు లేకపోవడం, అలాగే ప్రభాస్ ట్రైలర్ లో తక్కువ సేపు కనిపించడం వల్ల అభిమానులు నిరుత్సాహానికి గురి అయ్యారు. కానీ ఇటీవలే విడుదలైన ‘సూరీడు’ లిరికల్ వీడియో సాంగ్ కి మాత్రం సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.

prabhas salaar tickets

‘గుంటూరు కారం’ లో పాటలొద్దు అంటూ రచ్చ

సినిమా మీద అంచనాలు పదింతలు అయ్యేలా చేసింది. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే కర్ణాటక ప్రాంతం లో మొదలైంది. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించిన నిమిషాల వ్యవధిలోనే టికెట్స్ హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోయాయి. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ కి సంబంధించిన బుకింగ్స్ రేపటి లోపు ప్రారంభం అవ్వొచ్చు. నిర్మాతలు టికెట్ రేట్స్ మరియు స్పెషల్ షోస్ కోసం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు దరఖాస్తు చేసుకున్నారు.

ప్రభుత్వాల నుండి ఇంకా ఎలాంటి అనుమతి రాకపోవడంతో అడ్వాన్స్ బుకింగ్స్ మన రాష్ట్రాల్లో ఇంకా ప్రారంభించలేదు. ఇదంతా పక్కన పెడితే తెలంగాణ ప్రాంతం లో బెన్ఫిట్ షోస్ వేసుకునేందుకు మాత్రం ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది అని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 20 బెన్ఫిట్ షోస్ ని ప్లాన్ చేసారని. అందులో హైదరాబాద్ సిటీ నుండి దాదాపుగా 11 షోస్ పడుతాయని అంటున్నారు.

ప్రముఖ యంగ్ హీరో నిఖిల్ ని ప్రభాస్ ఫ్యాన్స్ సరదాగా టికెట్స్ ఇప్పించు అన్నయ్య అంటూ ట్యాగ్ చేసి అడుగుతారు. నిఖిల్ దానిని సీరియస్ గానే తీసుకొని శ్రీరాములు థియేటర్ లో 100 కి పైగా టికెట్స్ ఇప్పిస్తానని మాట ఇచ్చాడు. గతం లో నేను మిర్చి సినిమాని ఇదే థియేటర్ లో బెన్ఫిట్ షో చూశానని, ఆ చిత్రం పెద్ద హిట్ అయ్యిందని, ఇప్పుడు ‘సలార్’ కూడా ఆ మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.