ఉప్పెన డైరెక్టర్ తో రాంచరణ్ న్యూ ప్రాజెక్టు

0
268

త్రిపుల్ ఆర్ విజయాన్ని దక్కించుకున్న తర్వాత రాం చరణ్ వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు. దిల్ రాజు ప్రొడక్షన్ లో తమిళ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి ఓ చిత్రం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీలోని ఒక పాటను చిత్రీకరించేందుకు యూనిట్ న్యూజిలాంట్ వెళ్లింది. ఇందులో రాం చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. దీన్ని పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయాలని దర్శకుడు, నిర్మాత భావిస్తున్నారు. కాగా ఈ సినిమాకు టైటిల్ ను అధికారికంగా ఇంకా ఖరారు కాలేదు. కానీ ‘విశ్వంభర’ అని లేదంటే ‘అధికారి’ అని పెడుతారని వార్తలు లీక్ అవుతున్నాయి.

RC16 గురించి వివరించిన రాం చరణ్

తన తర్వాతి ప్రాజెక్టును (RC16)ను యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి చేస్తున్నట్లు రాంచరణ్ సోషల్ మీడియా వేదికగా స్వయంగా ప్రకటించారు. దీన్ని కూడా పాన్ ఇండియా స్థాయిలో తీయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. దీని కోసం స్క్రిప్ట్ ను కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారంట ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు. ఈ మూవీని ‘మైత్రీ మూవీ మేకర్స్’ సమర్పణలో ‘వృద్ధి సినిమాస్ వెంకట సతీశ్, ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని చూస్తున్నారు. చిత్రం క్రూ గురించి ఇంకా ప్రకటించలేదు.

ఇక RC15 గురించి చూస్తే

శంకర్ డైరెక్షన్ లో మెగా బడ్జెట్ (రూ. 200 కోట్లు)తో వస్తున్న ఈ చిత్రం వైపు ఇప్పుడు ఇండస్ర్టీ చూపు సారిస్తోంది. ముందుగా సంక్రాంతికి విడుదల చేయాలని భావించినా చిత్రం షూటింగ్ కోసమే మరో మూడు నెలల సమయం పడుతుందని, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసమే మరో రెండు నెలల వరకూ పట్టవచ్చని యూనిట్ చెప్తుంది. ఇదంతా కలుపుకొని దాదాపు తర్వాతి ఏడాదిలో రిలీజ్ కాబోతుందని లీక్ లు వెలువడుతున్నాయి. శంకర్ చిత్రం అంటేనే భారీ బడ్జెట్ ఉంటుంది. తన పోస్టర్ కోసమే దాదాపు రూ. 2 కోట్లకు పైగా వెచ్చించే శంకర్ ఈ పోస్టర్ కోసం రూ. 5 కోట్ల వరకూ వెచ్చించవచ్చని ఇండస్ర్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

టైటిల్ రిజస్ర్టేషన్

రాంచరణ్ శంకర్ కాంబో మూవీకి సంబంధించి అధికారికంగా టైటిల్ ను ఖరారు చేయాలేదు. కానీ ఫిల్మ్ ఛాంబర్ లో మాత్రం టైటిల్ ను రిజిస్ర్టర్ చేయించినట్లు తెలుస్తోంది. దేశంలోని చెట్టాలు, కార్పొరేట్ కు అవి ఎలా సహకరిస్తాయి..? అనే కోణంలో సినిమా ఉండబోతున్నట్లు లీక్ వచ్చింది. ఇందులో ఐఏఎస్ గా రాం చరణ్ కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ ఎవరూ సృషించని పలు కోణాల్లో ఈ మూవీ ఉండబోతోందని సమాచారం. ఈ మూవీని అర్జున్ తో వచ్చిన ‘ఒకే ఒక్కడు’ సీక్వెల్ గా కూడా గాసిప్స్ వెలువడుతున్నాయి. ఇందులో ఎస్ జే సూర్య ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. కుష్భు మరో ముఖ్య పాత్రలో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రాకపోవచ్చని అనుమానాలు వెలువడుతున్నాయి.