హీరోయిన్ ని మోసం చేసి పరార్..!

0
857

హీరోయిన్ ని మోసం చేసి పరార్ అవ్వడంతో సదరు మోసపోయిన హీరోయిన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్ హీరోయిన్ రిమీ సేన్‌. ఈ హీరోయిన్ తెలుగు లో కూడా నటించింది. మెగా స్టార్ చిరంజీవి చిత్రం ‘అందరివాడు’ లో ఆమె హీరోయిన్ గా నటించింది. దాదాపు నాలు కోట్లకు పైగా ఆమె మోసపోయింది. ఘోరే గావ్ కి చెందిన ఓ వ్యాపార వేత్త పెట్టుబడి పెట్టి బాగా డబ్బులు సంపాదించి ఇస్తానని చెప్పి నమ్మబలికి మోసం చేసాడు. దీనితో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

జిమ్ లో పరిచయం అయ్యాడట

మూడేళ్ళ క్రితం అతడు జిమ్ లో పరిచయం అయ్యాడని చెప్పింది. ఆ తరువాత తాము స్నేహితులం అయ్యామని తెలిపింది. తాను ఓ కొత్త వెంచర్ వేస్తున్నాని చెప్పాడని.. అందులో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని చెప్పి నమ్మ బలికాడని వెల్లడించింది. డబ్బులు ఇచ్చాక అదిగో.. ఇదిగో అంటూ కాలక్షపం చేసాడని చెప్పింది. మూడేళ్లు అవడంతో నిలదీస్తే అసలు కంపెనీ నే మొదలు పెట్టలేదని తెలిసింది. ఆ వ్యక్తి పేరు రౌనక్‌ జతిన్‌ వ్యాస్‌ అని చెప్పింది. దీనితో అతడిపై పోలీసులు పలు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు.

పారారీలో మోసగాడు

అయితే ఇప్పుడు అతడు పారారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా రెమీ సేన్ హిందీ, బెంగాలీ, తెలుగు చిత్రాలలో నటించింది. బాలీవుడ్ లో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో అభిషేక్ బచ్చన్ ధూమ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అంతే కాక గరం మసాలా, క్యూన్‌ కి, గోల్‌మాల్‌, హంగామా, ఫిర్ హేరా ఫేరీ వంటి మంచి సినిమాలలో నటించింది. తెలుగు లో చిరంజీవి సరసన అందరివాడు చిత్రంలో నెగిటివ్ రోల్ చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంది.