పెళ్లి తరువాత రోజే నయనతారకి షాక్.. శింబు, ప్రభుదేవా లతో

0
3238

ప్రముఖ కోలీవుడ్ హీరోయిన్ నయనతార పెళ్లి ఎంతో ఘనంగా జరింగింది. దర్శకుడు విఘ్నేష్ తో నయనతార పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. మహాబలిపురంలోని షేర్టన్ గార్డెన్ లో గురువారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో విఘ్నేష్ శివన్ నయనతార మెడలో తాళి కట్టారు. పెళ్ళికి అనేక మంది సినీ ప్రముఖులు తరలి వచ్చారు. ఎట్టకేలకు ఎన్నో వివాదాలు, అవమానాలు తరువాత నయనతార పెళ్లి చేసుకోవడం అభిమానులను సంతోషానికి గురి చేస్తుంది. కాగా వీరి పెళ్లి ప్రసార హక్కులను నెట్ ఫ్లిక్ సంస్థ 25 కోట్లకి కొనుగోలు చేయడం విశేషం.

ఆ దేవుడికి కృతజ్ఞతలు

ఈ వేడుకకి 5 రోజుల ముందే ఏర్పాటు ఘనంగా చేస్తూ వచ్చారు. ఈ ఏర్పాట్ల కోసం ఢిల్లీ, ముంబయిల నుంచి టెక్నీషియన్ లను పిలిపించారు. ఇక ఈ పెళ్లి కోసం 50 మంది బౌన్సర్లు.. ప్రైవేటు రక్షకులను పెట్టుకున్నారు. జనాలు అందరు లోపలికి రాకుండా పెళ్లికి ఆహావం అందిన వారికే అనుమతి ఇచ్చారు. ఈ మేరకు పెళ్లికి కొన్ని గంటలకి ముందు దర్శకుడు విఘ్నేష్ శివన్ “ఆ దేవుడికి ధన్యవాదాలు. ఇకపై నా జీవితాన్ని నయనతారకి పూర్తిగా సమర్పించబోతున్నాను. నా బంగారంతో మరి కొద్ది గంటల్లో ఇద్దరం ఒకటి కాబోతున్నాం అన్న భావనే ఆనందాన్ని ఇస్తుంది” అని ట్విట్ చేసాడు.

పెళ్లి సమయానికి మరో సారి తెరపైకి

కాగా.. పెళ్లి అయిన తరువాత రోజే నయనతారకి షాక్ ఎదురైంది. తమిళ నాడు ఈ పెళ్లి పై విపరీతమైన ట్రోల్ల్స్ వేస్తున్నారు. నయనతారకి ఇప్పటికే రెండు లవ్ లు ఫెయిల్ అయ్యాయని తెలిసిందే. అప్పట్లో శింబు, ప్రభుదేవా లతో నయన ప్రేమలో పడిన ఆ తరువాత విడిపోయారు. అయితే తాజాగా ఈ పెళ్లి సందర్భంగా వాళ్లిద్దరూ పార్టీ చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ట్రోల్ల్స్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోల్ల్స్ ఎప్పటి నుండో జరుగుతున్నవి అయినా.. పెళ్లి సమయానికి మరో సారి తెరపైకి రావడం విశేషం.