దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీరే..!

0
5504

టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ లో ఇప్పటికే అనే మంది హీరోయిన్ లు దర్శకులను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా నయనతార దర్శకుడు విగ్నేష్ ని పెళ్లి చేసుకుంది. ఇక ఇప్పటికే హీరోయిన్ లు దర్సకులని పెళ్లి చేయూస్కున్న లిస్ట్ లోకి వెళితే.. హీరోయిన్ రమ్య కృష్ణ డైరెక్టర్ కృష్ణవంశీని పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి 2003 లో జరిగింది. ఇక ఆ తరువాత హీరోయిన్ సుహాసిని స్టార్ డైరెక్టర్ మణిరత్నం ని పెళ్లి చేసుకుంది. అలానే నటి కుష్బూ కూడా డైరెక్టర్ సి. సుందర్ ని ఇష్టపడి పెళ్లి చేసుకుంది.

రహస్యంగా 2001 లో పెళ్లి

ఇంకా వైసిపి ఫైర్ బ్రాండ్, మంత్రి రోజా కూడా ఒకప్పుడు హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. ఆ తరువాత కొన్నాళ్ల పాటు బుల్లితెరపై మెరిసిన ఈ మాజీ హీరోయిన్ అప్పట్లో డైరెక్టర్ సెల్వమణి ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్ళ పెళ్లి 2002 లో జరిగింది. ఇంకా హీరోయిన్ దేవయాని కూడా దర్శకుడు రాజా కుమార్ ని పెళ్లి చేసుకుంది. ఇంట్లో పెద్దలు ఈ పెళ్ళికి ఒప్పుకోకపోయినా రహస్యంగా 2001 లో పెళ్లి చేసుకోవడం విశేషం. ప్రియమైన నీకు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న హీరోయిన్ ప్రీత కు డైరెక్టర్ హరిని పెళ్లి చేసుకుంది.

నటి శరణ్య కూడా దర్శకుడు పొన్వన్నన్ ని

డైరెక్టర్ హరి తీసిన సినిమాలు భరణి, సింగం లతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తరువాత నటి శరణ్య కూడా దర్శకుడు పొన్వన్నన్ ని పెళ్లి చేసుకుంది. ఇంకా హీరోయిన్ రాసి కూడా డైరెక్టర్ నివాస్ ని పెళ్లి చేసుకుంది. ఇక తాజాగా హీరోయిన్ నయనతార డైరెక్టర్ విగ్నేష్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి గత వారం మహాబలిపురం సినీ పెద్దలు, అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.