ఇండస్ర్టీకి దూరంగా బాలయ్య కుటుంబం ఎందుకుంది?

0
266

టాలీవుడ్ ప్రపంచంలో వారసులకు కొదువే లేదు. తాతల పేర్లు, తండ్రుల పేర్లు చెప్పుకుంటూ ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చి ఏలుతున్న వారు ఇప్పుడు చాలా మందే ఉన్నారు. ఇందులో హీరోయిన్లుగా కూడా కొందరు ఇండస్ర్టీలోకి వచ్చారు. వారి పిల్లలలను కూడా చైల్డ్ ఆర్టిస్టులుగా పరిచయం చేస్తూ తండ్రులకు, తాతలకు మంచి గుర్తింపునే తెస్తున్నారు. కానీ సీనియర్ స్టార్లు అయిన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర్ రావు, మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీల నుంచి వారసుల స్థానంలో హీరోలుగా కొందరు హీరోయిన్లుగా మరికొందరు వెండి తెరకు వచ్చారు.

హీరోయిన్లుగా ఎవరూ రాలేదు

కానీ ఒక్క నందమూరి ఫ్యామిలీ నుంచి మాత్రమే హీరోలుగా రాగా.. హీరోయిన్లుగా ఎవరూ రాలేదు. దీనిపై ఇటీవల సోషల్ మీడియాలో ఒక చర్చ తెగ వైరల్ అవుతోంది. ‘నందమూరి కుటుంబం నుంచి ఇప్పటి వరకూ ఒక్క లేడీ కూడా హీరోయిన్ గా కానీ, కో ఆర్టిస్టుగా కానీ రాలేదు ఎందుకు..?’ అంటూ చర్చ మొదలైంది. ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

వారసులతో నిండిన ఇండస్ర్టీ

మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి హీరోగా రాం చరణ్ వస్తే, ఆయన సోదరి కొణిదెల నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్ గా వచ్చింది. చాలా సినిమాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఒక సినిమాను కూడా ప్రొడ్యూస్ చేసి నిర్మాతగా మారింది. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి అక్కినేని నాగార్జున మేన కోడలు కూడా ఒక సినిమాలో నటిచింది. కానీ ఇప్పటి వరకూ నందమూరి వంశం నుంచి ఆడవారు సినిమాల్లో కనిపించలేదు. దీంతో ఎందుకా అంటూ పలు చర్చలు కొనసాగుతున్నాయి.

బాలయ్య కూతుళ్లు అందుకే ఇండస్ర్టీకి రాలేదు

బాలయ్య బాబుకు ఇద్దరు కూతుళ్లు ఒకరు బ్రాహ్మిణి, కాగా మరొకరు తేజస్విని. సహజంగా నట వారసత్వంలో పెరిగిన వీరు ఇండస్ర్టీలో కనిపించలేదు. కనీసం బుల్లితెరపై కూడా ఎక్కడా వీరి ప్రస్తావన లేదు. దీంతో కొన్ని గాసిప్ లు కూడా బయల్దేదారాయి. ఇదే ప్రశ్నను ఒకసారి ఎదుర్కొన్న బాలయ్య బాబు సమాధానం ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడంట. ‘వాళ్లు వస్తానంటే తమకేం అభ్యంతరం లేదని.. వారిపై ఎలంటి ఆంక్షలు లేవని, వారి లైఫ్ వారి ఇష్టం’ అన్నట్లుగా చెప్పుకచ్చారు బాలయ్య.

చిన్న కూతురు తేజస్విని

బాలకృష్ణ పెద్ద కూతురు నారా బ్రాహ్మిణికి సహజంగానే ఇండస్ర్టీ అంటే నచ్చేది కాదట. ఆమెకు ఎక్కువగా బిజినెస్ అంటే ఇంట్రస్ట్ చూపిస్తుందట. ఇక చిన్న కూతురు తేజస్విని విషయానికి వస్తే ఆమె తెర ముందుకంటే తెర వెనుక ఉండడంపైనే ఉత్సాహం చూపుతుందట. ఇలా వారు ఇద్దరూ కూడా ఇండస్ర్టీకి దూరంగా ఉన్నారు. పెంపకంలోనూ బాలయ్య బాబు గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.