అనసూయ ఒక్కో షోకు ఎంత తీసుకుంటుందో తెలుసా..!

0
742

బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన అనసూయ భరద్వాజ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. మల్లెమాల ప్రొడక్షన్ లో ఈ టీవీలో వచ్చిన ‘జబర్ధస్త్’కు యాంకర్ గా బుల్లితెరపైకి వచ్చిన అనసూయ క్రమక్రమంగా సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు. జబర్ధస్త్ లో అనసూయను చూసేందుకే కొంత మంది టీవీల ముందు కూర్చునే వారంటే అతిశయోక్తి కాదు. తన అందాలను ఆరబోస్తూ ఆమె చేస్తున్న డ్యాన్స్ లు కూడా కుర్రకారును మత్తెక్కిస్తాయి. జబర్ధస్త్ కు రాకముందు అనసూయ కొన్ని టీవీ సిరియల్స్ లో నటించారు. ఆమె అందం నటనను చూసిన మల్లెమాల ప్రొడక్షన్ టీం జబర్ధస్త్ కు ఆమె వస్తే బాగుంటుందని ఎంపిక చేసిశారట.

జబర్ధస్త్ రేటింగ్ చూసే

జబర్ధస్త్ కు వస్తున్న రేటింగ్ ను చూసి మల్లెమాల మరో షో ‘ఎక్సాట్రా జబర్ధస్త్’ తెచ్చింది. దీంతో జబర్ధస్త్ కు అనసూయ భరద్వాజ్ యాంకర్ గా చేస్తే ‘ఎక్సాట్రా జబర్ధస్త్’కు రష్మీ గౌతమ్ యాంకర్ గా చేశారు. ఈ టీవీ షోతో బాగా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ సినిమాల్లో సైతం రాణిస్తోంది. ఆమె చేసిన సినిమాల్లో పాత్రల విషయంలో చిన్నవే అయినా చాల గుర్తింపు దక్కించుకుంది ఆమె. ‘క్షణం’లో విలన్ గా చేసిన ఆమె పాత్రకు ప్రశంసలు దక్కాయి. ఇంకా ‘రంగస్థలం’లో రాం చరణ్ కు అత్తగా నటించి మెప్పించింది. ఇటు షోలలో కంటిన్యూ అవుతూనే సినిమాల్లో కూడా రాణిస్తుంది అనసూయ. ఇటీవల షోలను తగ్గించుకొని సినిమాలపైనే పెద్దగా దృష్టి పెట్టింది.

దీపం ఉండగానే ఇళ్లు చక్కబెడుతున్న అనసూయ

వీటితో పాటు వెబ్ సిరీస్ లకు కూడా కమిటైంది. ప్రస్తుతం జబర్ధస్త్ లో ఆమె స్థానంలో సౌమ్యారావు యాంకర్ గా వచ్చింది. ‘దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలి’ అనే సామెతను అనసూయ అక్షర సత్యం చేస్తుందనే చెప్పాలి. ఇటు షోలు, అటు మూవీస్ తో తెగ సంపాదిస్తుంది బ్యూటీ. జబర్ధస్త్ నుంచి బయటకు వెళ్లిన అనసూయ సినిమాలు, వెబ్ సిరీస్ లో బిజీగా ఉంది. పుష్పలో సునీల్ కు జోడీగా చేసిన ఆమె పుష్ప 2లో కూడా ఉండబోతోంది. ఇక ఆమె ప్రధాన పాత్రలో ఒక వెబ్ సిరీస్ రూపుదిద్దుకుంటోంది. గురుజాడ అప్పారావు తీసిన ‘కన్యాశుల్కం’ నవలను బేస్ చేసుకొని తీయబోయే ఒక వెబ్ సిరీస్ లో ఆమె మధురవాణి అనే వేశ్య పాత్రలో కనిపించబోతోందని టాక్ వినిపిస్తుంది.

క్రేజ్ నిలబెట్టుకుంటూనే

ఈ సిరీస్ లో ఆమే ప్రధాన పాత్రలో కనిపిస్తుందట. కథ అంతా ఆమె చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. యాంకర్ గా ఆమెకు వచ్చిన క్రేజ్ ను నిలబెట్టుకుంటూనే ఉంటుంది అనసూయ. తనకు సినిమాలు, వెబ్ సిరీస్ లో ఛాన్స్ లు వస్తున్నా.. వీలు దొరికినప్పుడల్లా యాంకర్ గా చేస్తూనే ఉంది. కాళీ సమయాల్లో షోలలో చేసేందుకు కూడా ఇంట్రస్ట్ చూపుతుంది బ్యూటీ. అయితే ఆమె షోలో తీసుకుంటున్న రెమ్యునరేషన్ విషయంలో సదరు షో నిర్వాహకులు బెంబేలెత్తున్నాట. ఇంత ఎక్కువ చెల్లించడం తమతో కాదని అంటూనే అనసూయ షోలో ఉందంటే ఆ కిక్కే వేరు అనుకుంటూ ముట్టజెప్పక తప్పడం లేదంట.

ఎంత తీసుకుంటుందంటే

ఇక అనసూయ ఒక్కో షోకు ఎంత వరకూ తీసుకుంటుంది అన్న వార్తలు ఇప్పుడు చర్చల్లో నిలుస్తుంది. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ పొడుగు సుందరి షోలలో కూడా ఎక్కువగానే తీసుకుంటుందని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక్క షోకు దాదాపు రూ. 2 లక్షల వరకూ తీసుకుంటుందని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే సీనియర్ యాంకర్ సుమ కూడా ఇంత తీసుకోవడం లేదట. అనసూయ ఇంతలా పెంచడం ఏంటని కొందరు ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇంతలా తీసుకుంటుంది కాబట్టే షోలకు ఎవరూ పిలవడం లేదని, అందుకే వెండితెరపై ఎలాంటి పాత్రలైనా పోషించేందుకు వెళ్తుందని టాక్ కూడా వినిపిస్తుంది. ఇక ఆమె వెబ్ సిరీస్ తో పాటు ‘రంగ మార్తాండ’ చిత్రం, పుష్ప2తో పాటు కొన్ని ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి.