ఓటీటీలోకి ‘యశోద’.. డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

0
269

సమంత లీడ్ లో నటించిన చిత్రం ‘యశోద’. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంది. సమంత వయోసైటిస్ తో బాధపడుతూనే సినిమాకు ప్రాణం పోశారనే చెప్పాలి. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూనే ఆమె డబ్బింగ్ ను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సినిమా ఆమె కెరీర్ లో పెద్ద మలుపు అంటే సందేహం లేదు. లేడీ ఓరియంటెడ్ మూవీల్లో తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది సామ్. ఈ మూవీ కోసం ఆమె చాలానే కష్టపడ్డారట. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ రీలీజై బాక్సాఫీస్ కలెక్షన్లకు కురిపించింది.

థియేటర్లలో రూ. 30 కోట్లు వసూలు

నవంబర్ 11వ తేదీన థియేటర్ లలో రిలీజైన ఈ మూవీ మంచి వసూళ్లనే సాధించింది. వారం వారం కలెక్షన్లు పెంచుకుంటూ పోయింది. మంచి రికార్డులను సైతం దక్కించుకుంది. ఈ మూవీలో సమంత పర్ఫార్మెన్స్ కు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. థియేటర్లలో ‘యశోద’ రూ. 30 కోట్లకు పైగా వసూళ్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాను ఇటీవల ఓటీటీలో రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ చెప్పగా.. కోర్టు జోక్యంతో నిలిచిపోయింది.

ఓటీటీ రిలీజ్‌కు బ్రేక్

యశోద ఓటీటీ రిలీజ్ కు చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిన ప్రతి సారి వెనక్కు తగ్గాల్సి వచ్చింది. మొటి సారి రిలీజ్ సమయంలో ప్రొడ్యూసర్ మండలి హెచ్చరించింది. దీంతో డేట్ ఫిక్స్ చేసుకున్నాక నిలిపివేయాల్సి వచ్చింది. రీసెంట్ గా అనౌన్స్ చేయగా ఒక హాస్పిటల్ యాజమాన్యం కేసు వేయడంతో కోర్టు రిలీజ్ ఆపాలని ఆదేశించింది. దీంతో మళ్లీ ఓటీటీ రిలీజ్ నిలిచిపోయింది. సదరు హాస్పిటల్ యాజమన్యం ‘ఈవా’ పేరు తమ హాస్పిటల్ కు చెందిందని, అనుమతులు లేకుండా చిత్రంలో వాడుకున్నారని పేర్కొంది. పైగా నెగెటివ్ కోణంలో పేరును వాడుకొని తమ సంస్థ పరువుకు భంగం కలిగేలా చిత్రీకరించారని కోర్టులో దావా వేసింది.

డిసెంబర్ 9న ప్రైమ్ లో

పరిశీలించిన కోర్టు ‘యశోద’ ఓటీటీ రిలీజ్ ను నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో మళ్లీ బ్రేక్ పడింది. కోర్టు జోక్యంతో నిలిచిపోయిన ‘యశోద’ ఓటీటీ రిలీజ్ ను తిరిగి ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించింది. కోర్టును ఆశ్రయించిన యాజమాన్యాన్ని కన్విన్స్ చేసిన దర్శకుడు, నిర్మాత ఓటీటీకి లైన్ క్లియర్ అయ్యిందని డిసెంబర్ 9న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మూవీ ఓటీటీలో ‘అమెజాన్ ప్రైమ్’ ప్లాట్ ఫారంపై అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో సమంత ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు డిసెంబర్ 9న అమేజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ‘యశోద’.

సమంత చేతిలో ఉన్న ప్రాజెక్టు

ప్రస్తుతం సమంత చేతిలో ఉన్న ప్రాజెక్టు ముందుకు కదలడం లేదు. ఆమె రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ చిత్రంలో నటించబోతున్నారు. సామ్ ఆరోగ్యం దృష్ట్యా ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజులు నిలిచిపోయింది. తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయాన్ని చిత్ర యూనిట్ ఇంకా పేర్కనలేదు. ఆమె అనారోగ్యం నుంచి కోలుకున్నాక ప్రారంభిస్తామని చిత్రయూనిట్ తెలిపింది.