ఇన్నాళ్లూ బతిమిలాడా.. ఇక ‘తగ్గేదేలే’ అంటున్న అనసూయ

0
1348

స్టార్ యాంకర్, సినీ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్ధస్త్ స్టేజీ అయినా.. ఈవెంట్ అయినా, షో అయినా ఒక్క చేతిపై నడిపిస్తూ సత్తా చాటుతుంది. దీంతో పాటు ఇప్పుడు అమ్మడు సినిమాల్లో కూడా బిజీగా ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో ఆమెపై విపరీతంగా నెగెటివ్ కామెంట్లు పెడుతున్న వ్యక్తి విషయంలో ఆమె తీవ్రంగా కలత చెందిందట. అతన్ని చట్ట పరంగా శిక్షించాలంటూ పోలీసులను కూడా ఆశ్రయించింది అనసూయ.

ట్రోల్స్ లోనూ ఆమె క్రేజ్

బుల్లి తెర నుంచి వెండితెరకు వచ్చిన అనసూయ పర్ఫార్మెన్స్ పీక్ లో ఉంటుంది. ఆమె కోసమే జబర్ధస్త్ షో చూసేవాళ్లు కూడా ఉన్నారంటే సందేహం లేదు. అయితే అంతే స్థాయిలో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కునేది కూడా ఆమెనే కావడం విశేషం. ఆమెపై చాలా రోజుల నుంచి ఒక వ్యక్తి నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నాడు. చాలా సార్లు హెచ్చరించినా సదరు వ్యక్తి తన చేష్టలు మానుకోలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన అనసూయ సైబర్ పోలీసులను ఆశ్రయించింది. తన ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి శునకానందం పొందుతున్న సదరు వ్యక్తిని పట్టుకోవాలని కోరింది. ఆయన చేస్తున్న ట్రోల్స్ తో తనతో పాటు చాలా మంది బాధపడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది.

పట్టుకున్న పోలీసులు

నటి అనసూయ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసులు ఏపీకి చెందిన ఓ వ్యక్తిని రెండు వారాల కింద అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై అనసూయ తన అభిమానులతో చిట్.. చాట్.. చేసింది. నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. రెమ్యునరేషన్ విషయంలో తగ్గడం లేదని టాక్ వస్తుంది అని నెటిజన్ ప్రశ్నించగా డబ్బులు అవసరం కాబట్టి అడుగుతున్నాను. ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటున్నాను. అన్ని సార్లు తీసుకోను. పాత్రలను బట్టి కొన్ని సార్లు మంచి స్కోప్ ఉన్న పాత్రలు చేయాల్సి వస్తే తక్కువ కూడా తీసుకున్నాను అతని చెప్పింది.

కేసు విషయంలో అనసూయ ఏమందంటే

తనపై నెగెటివ్ ట్రోల్స్ పెడుతున్న వ్యక్తి అరెస్ట్ కావడంతో ఓ నెటిజన్ ఆమెను ‘కేసు ఏమైంది’ అంటూ ప్రశ్నించాడు. నేను పెట్టిన కేసుతో తుంటరి పనులు చేసే వారు మానకపోవచ్చు కానీ కొందరిలో భయం పడుతుందని మాత్రం చెప్పగలను. నటీ, నటులు అందరినీ ఎంటర్ టైన్ చేయాలని అనుకుంటారు. మేం(నటీ, నటులు) వేసే పాత్రలు కథకు అనుసంధానంగా సాగుతాయి. వాటిలో నెగెటివ్ కోణం ఉంటే సూచనలిస్తే మార్చుకుంటాం. కానీ ఇలా సోషల్ మీడియాలో మార్ఫింగ్ పిక్స్ అప్ లోడ్ చేసి మా పరువుకు భంగం కలిగించడం సరికాదు. ఇలాంటి వారిని శిక్షిస్తేనే ఇలాంటి పనులు చేయాలనుకునే వారి ఆలోచనల్లో మార్పు వస్తుంది. అందుకే దీన్ని సీరియస్ గా తీసుకున్నా అంటూ సమాధానం చెప్పింది అనసూయ.

ప్రాజెక్టులతో బిజీ

చాలా రోజుల నుంచి ఓపికతో అతనికి నచ్చజెప్పాను. అయినా వినలేదు. ఇప్పుడు శిక్ష అనుభవించక తప్పదు. కేసుల విషయంలో వెనక్కు తగ్గేది లేదు. ప్రస్తుతం అనసూయ చేతిలో చాలానే ప్రాజెక్టులు ఉన్నాయి. సినిమాలతో పాటు వెబ్ సిరీజ్ లో కూడా నటిస్తుంది అనసూయ. ‘రంగమార్తాండ, హరిహర వీరమల్లు, చేజ్, మైఖేల్, ఫ్లాష్ బ్యాక్, అరి, సింబా’ సినిమాలతో పాటు గురజాడ అప్పారావు నవల ‘కన్యాశుల్కం’ ఆధారంగా వస్తున్న వెబ్ సిరీస్ లో కూడా ఆమె నటిస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో ఆమె ప్రధాన పాత్ర చేయబోతున్నట్లు అనసూయ తెలిపింది.