హాలీవుడ్ లోను మాన స్టార్ డైరెక్టర్

0
198

బాహుబలి సీక్వెల్ తో హాలీవుడ్ చూపును తన వైపునకు తిప్పుకున్న డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. రీసెంట్ గా త్రిపుల్ ఆర్ (RRR)తో హాలీవుడ్ కూడా రాజమౌళి ప్రతిభను ప్రశంసిస్తోంది. జక్కన్న ఆయన సినిమాలో యూజ్ చేసే టెక్నిక్ హాలివుడ్ ను ఆకట్టుకుంటుంది. టాలీవుడ్ జక్కన్నగా గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి చూపు ఇప్పుడు హాలీవుడ్ పై పడింది. హాలీవుడ్ తో పోలిస్తే టాలీవుడ్ మూవీ మేకింగ్ విషయంలో చాలా వెనుబడే ఉందని చెప్పచ్చు. కానీ దర్శక ధీరుడు రాజమౌళి మాత్రం హాలీవుడ్ కన్నా బాగా తీయగలం అంటూ ప్రూవ్ చేసుకున్నాడు.

ఓటీటీ ద్వారా నెట్ ఫ్లిక్స్ లో

రీసెంట్ గా ఆయన చిత్రం ‘త్రిపుల్ ఆర్ (RRR)’ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని భాషల్లో విడుదలై వరల్డ్ వైడ్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఓటీటీ ద్వారా నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ సినిమాకు తెగ చూసేస్తున్నాట విదేశీయులు. ఇటీవల జపాన్ లో కూడా విడుదలైన త్రిపుల్ ఆర్ రికార్డులను తిరగరాస్తుంది.

రాజమౌళి మైండ్ లో హాలీవుడ్

రాజమౌళి డైరెక్షన్ చేసిన సినిమాలు హాలివుడ్ రేంజ్ లో ఉంటాయి. అందులో వినియోగించే గ్రాఫిక్స్ కు అక్కడి నిర్మాణ సంస్థలు ఫిదా అవుతున్నాయట. టాలీవుడ్ నుంచి ఈ టాప్ డైరెక్టర్ మైండ్ లో ఇప్పుడు హాలీవుడ్ ఆలోచనలు వస్తున్నాయట. ఇటీవల ఆయన యూఎస్ లో ఓ ఫిలిం వేడుకలకు వెళ్లిన సమయంలో తనకు నచ్చిన హాలీవుడ్ సినిమా గురించి చెప్పడంతో పాటు మహేశ్ బాబు ఆ రేంజ్ లో సినిమా చేయాలని స్క్రిప్ట్ కూడా రెడీ చేస్తున్నట్లు చెప్పారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా హాలీవుడ్ ఆఫర్లు తనను వెతుక్కుంటూ వస్తున్నాయని ఆయన చెప్పడం ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చగా మారింది.

ఎంసీయూ (MCU) సంస్థతో రాజమౌళి

మార్వెల్ బాస్ కివిన్ ఫీజ్ ఇటీవల రాజమౌళిని సంప్రదించారని టాలీవుడ్ వర్గాల్లో విపరీతమైన టాక్ నడుస్తోంది. జక్కన్న ప్రస్తుతం తన త్రిపుల్ ఆర్ ప్రమోషన్ కోసం విదేశాల్లో ఉన్నారు. యునైటెడ్ కంట్రీస్ లో BAFTA నామినేషన్ లో ఉన్న ఆయనను అక్కడి మీడియా ‘హాలీవుడ్ చిత్రాల్లో పని చేసేందుకు సిద్ధమా..? ఇటీవల వస్తున్న గాపిప్స్ మార్వెల్ తో సంప్రదింపులు జరిగాయా..? ’ అంటూ ప్రశ్నించింది. కానీ సమాధానం ఆ దిశగా హాలీవుడ్ నుంచి బాగానే ఎంక్ వైరీలు వస్తున్నాయి కానీ తను లెటెస్ట్ సబ్జెక్టు మహేశ్ బాబుతో చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. మహేశ్ బాబుతో సినిమా తీయాలని ఇటీవల కమిట్ అయ్యాం.

హాలీవుడ్ ను చూసి నేర్చుకుంటున్నా

‘హాలీవుడ్ నుంచి చాలా నేర్చుకోవాలి. వారి స్క్రిప్ట్, టెక్నికల్ ఎలిమెంట్, మేకింగ్, తదితరాలపై ఇంకా అధ్యయనం చేయాల్సి ఉంది. వారితో కలిసి పని చేయాలని చూస్తున్నా’ అంటున్నారు రాజమౌళి. వారి పని తీరు చాలా గొప్పగా ఉంటుంది. కలిసిమెలిసి ఎలా పని చేయవచ్చు.. దాన్ని అనుభవంగా ఎలా మలుచుకోవాలి? ప్రస్తుతం ఆలోచిస్తున్నట్లు రాజమౌళి చెప్పారు.

ప్రాచ్యాత్యులను సైతం ఆకట్టుకున్న చిత్రం

‘ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘త్రిపుల్ ఆర్’ వరల్డ్ వైడ్ గా ఉండే భారతీయులను మాత్రమే ఆకట్టుకుంటుంది అనుకున్నా. కానీ ప్రాచ్యాత్యులు సైతం చిత్రానికి అభిమానులుగా మారడం చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీకి ఇంతటి ఆదరణ ను నేను ఊహించలేదు’ అన్నారు దర్శక ధీరుడు. ఇక హాలీవుడ్ లో ‘ప్రిన్స్ ఆఫ్ పర్షియా’ మూవీ అడాప్టేషన్ కు ప్రయత్నం చేస్తానని చెప్పారు. తను మహేశ్ బాబుతో కలిసి తీసే కొత్త ప్రాజెక్టు ‘ఇండియానా జోన్స్’ కథలా ఉంటుందని ఇటీవల ఆయన ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఆయన హాలీవుడ్ బెర్త్ కన్ఫాం చేసుకోబోతున్నారో చూడాలి మరి.