‘సలార్’ పార్ట్ 2 మొదలయ్యేది అప్పుడే..ప్రభాస్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్!

0
274
Salaar part 2 is about to start shocking news for Prabhas fans

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన సలార్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా, ఆ అంచనాలను మొదటి ఆట నుండే అందుకుంది. ఫలితంగా బాక్స్ ఆఫీస్ వసూళ్లు మొదటి నాలుగు రోజులు సునామి ని తలపించాయి.

కానీ వర్కింగ్ డేస్ లో మాత్రం ఈ చిత్రం వసూళ్లు బాగా తగ్గిపోయాయి. కానీ మళ్ళీ న్యూ ఇయర్ రోజు వసూళ్లు పుంజుకున్నాయి.

అందరి అంచనాలను తారుమారు చేస్తే ఏకంగా 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను ఈ చిత్రం న్యూ ఇయర్ రోజు రాబట్టింది. ఇప్పటి వరకు దాదాపుగా 570 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఫుల్ రన్ లో 600 కోట్ల రూపాయిల గ్రాస్ ని టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇకపోతే సలార్ పార్ట్ 2 కచ్చితంగా ఉంటుంది అని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరోసారి ఖరారు చేసాడు. ‘సలార్ : సౌర్యంగా పర్వం’ అనే టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా సలార్ విడుదలైన వెంటనే, అంటే ఈ ఏడాదిలోనే ప్రారంభం అవుతుందని అనుకున్నారు.

Bollywood Khans who cannot stand in front of Prabhas stamina

కానీ అది జరగడం లేదు. కారణం ప్రభాస్ ముందు ఒప్పుకున్న సినిమాలు పూర్తి చెయ్యాల్సి ఉండడమే. ప్రస్తుతం ఆయన ‘కల్కి’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా అయిపోయింది.

ఈ చిత్రం తో పాటుగా మారుతీ తో చేస్తున్న సినిమా షూటింగ్ కూడా 50 శాతం కి పైగా పూర్తి అయ్యింది. ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ వంగ తో ‘స్పిరిట్’ అనే సినిమా చెయ్యాల్సి ఉంది.

దీని తర్వాత ఆయన హను రాఘవపూడి తో ఒక పీరియాడికల్ డ్రామా ని చెయ్యబోతున్నాడు. ఈ సినిమా కూడా పూర్తి అయ్యాకనే సలార్ పార్ట్ 2 కి డేట్స్ ఇస్తాడు ప్రభాస్.

కానీ ఈసారి మాత్రం ఇంకా బాగా కథ రాయాల్సిన బాధ్యత డైరెక్టర్ భుజాలపై ఉంది. ఎందుకంటే పార్ట్ 1 కి మంచి ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి కానీ, లాంగ్ రన్ అనుకున్న రేంజ్ లో మాత్రం రాలేదు.

వెయ్యి కోట్లు కొట్టాల్సిన సినిమా, 600 కోట్లు దగ్గరే ఆగిపోయింది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.