పవన్ కళ్యాణ్ సినిమా రీమేక్ కాదు.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్టోరీతో ఫ్యాన్స్ లో పూనకాలే

0
301

పవన్ కళ్యాణ్ కు బయట అభిమానులే కాదు. ఇండస్ర్టీలో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. టాప్ డైరెక్టర్ల నుంచి టాప్ ప్రొడ్యూసర్ల వరకూ.. ఇక హీరో, హీరోయిన్ల గురించి చెప్పక్కర్లేదు. ఆయన సినిమా అంటేనే తీవ్ర ఎగ్జైట్ మెంట్ ఉంటుంది. ఇండస్ర్టీ మొత్తం ఆయన సినిమా విడుదల కోసం చూస్తుంది. అట్లుందని పవన్ అంటే మరి. పవన్ అభిమానుల్లో ఒక టాప్ డైరెక్టర్ ఉన్నారు.

ఇతను గతంలో పవన్ కళ్యాణ్ తో కలిసి చేసిన సినిమాలు బాక్సాఫీస్ హిట్లుగా నిలిచాయి. అయితే వీరి కాంబోలో మరో చిత్రం వెండితెరకెక్కబోతోంది. దానికి సంబంధించిన పోస్టర్ కూడా ఆదివారం (డిసెంబర్11)న విడుదల చేశారు.

గ్రేట్ కాంబోలో మరో సినిమా

డైరెక్టర్ హరీశ్ శంకర్-హీరో పవన్ కళ్యాణ్ వీరి కింబో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ర్టీ హిట్ కాంబో ఇది. ఆ కాంబోకు సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉందంటే అతిశయోక్తి కాదు. వీరిద్దరూ కలిసి మూవీ తీస్తున్నారంటే సెలబ్రెటీస్ కూడా ఆతృతగా ఎదురు చూడాల్సిందే. ఇంతటి కాంబో గురించి ఏ నెగెటివ్ న్యూస్ బయటకు వచ్చినా ఫ్యాన్ తట్టుకోలేరు. అయితే గతంలో వీరి కాంబోలో ఒక సినిమా రాబోతుందని దాని పేరు ‘భవదీయుడు భగత్ సింగ్’ అంటూ అనౌన్స్ కూడా చేశారు.

దీనికి తర్వాత ఎలాంటి న్యూస్ బయటకు రాలేదు. తర్వాత ఈ కాంబోలోనే తమిళ చిత్రం ‘తేరి’ రీమేక్ వస్తుందని వార్తలు రావడంతో ఫ్యాన్స్ గగ్గోలు పెట్టారు. ఈ ప్రాజెక్టు పవన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుందని మండిపడ్డారు. ఒక లేడీ ఫ్యాన్ అయితే ఏకంగా సూసైడ్ లెటర్ రాసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఇండస్ర్టీ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

తేరి రీమేక్ లేనట్లే

వరుస ఘటనల నేపథ్యంలో హరీశ్ శంకర్ పవన్ కళ్యాణ్ తో రీమేక్ లాంటివి ఏమీ లేదని చెప్పకనే చెప్పారు. అయితే స్ర్టైట్ చిత్రం ఒకటి రాబోతోందని దాని పేరు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అని చెప్పారు. పూజా కార్యక్రమాలను కూడా ప్రారంభించింది చిత్ర యూనిట్. మూడేళ్ల క్రితం ప్రకటించిన ‘భవదీయుడు భగత్ సింగ్’ స్టోరీని మార్చి ‘ఉస్తాద్ భగత్ సింగ్’గా తీసుకువస్తున్నట్లు ప్రకటించారు హరీశ్ శంకర్.

స్క్రిప్ట్ పై తర్జన భర్జన

ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలను కూడా చెప్పింది చిత్ర యూనిట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పవన్ కళ్యాణ్ రెండు భిన్నమైన గెటప్స్ తో అలరించనున్నారట. షూటింగ్ చాలా వరకూ ఢిల్లీ నగరంలో కొనసాగుతుందట. జనవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతున్నట్లు చెప్పారు. 2023 దసరా వరకు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కూడా చెప్పారు.

అయితే గతంలో ప్రకటించిన ‘భవదీయుడు భగత్ సింగ్’ స్క్రిప్ట్ ఫస్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ కు నచ్చినా సెకండ్ ఆఫ్ మాత్రం బాగాలేదని చెప్పారు. దీంతో కొన్ని మార్పులు చేశాం. అవి కూడా ఆయనకు నచ్చలేదు. దీంతో స్ర్కిప్ట్ పై చాలా రోజులుగా కసరత్తు చేశాం. చివరికి పవన్ ఒకే అనడంతో ఆ స్క్రిప్ట్ కు తగ్గ పేరు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాగుంటుందని ఆ పేరునే సినిమాకు కూడా ప్రకటించాం అని చెప్పారు హరీశ్ శంకర్.

పోస్టర్ లో ఏముందంటే

‘ఉస్తాద్ భగత్ సింగ్’ పోస్టర్ ను చిత్ర యూనిట్ ఆదివారం విడుదల చేసింది. ఈ చిత్రం చాలా డిఫరెంట్ ఎంటర్ టైనర్ ఉంటుందని చెప్పారు హరీశ్ శంకర్. పోస్టర్ లోనే చాలా విషయాలు వెళ్లడించారు ఆయన. ఒక చేతితో హార్లీ డేవిడ్ సన్ బైక్ పట్టుకొని మరో చేతిలో టీ గ్లాస్ తో పవర్ ఫుట్ లుక్ లో కనిపించారు పవన్ కళ్యణ్. బ్యాగ్రౌండ్ లో కరెంట్ తీగలు, స్టేషన్ కనిపిస్తున్నాయి.

ఆకాశంలో మెరుపుల మధ్యన టైటిల్ ఉంచడం ఇవన్నీ డిఫరెంట్ గానే ఉన్నాయి. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండబోతున్నారు. ఆదివారం ఉదయమే ఈ పోస్టర్ రావడంతో ఫ్యాన్ ఆనందానికి అవధులు లేవంటూ కామెంట్లు కూడా కురిపిస్తున్నారు.