బస్ కండెక్టర్ టూ తలైవా వరకు.. రజనీకాంత్ అప్రతిహథ ప్రయాణం

0
226

ఒక గొప్ప వ్యక్తి ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ముందు తరాలకు దారి చూపుతూ ఆదర్శ జీవనం గడుపుతున్న వారి గురించి ఎంత చెప్పినా తక్కువే అలాంటి వ్యక్తి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్లు ఆయన చిత్ర సీమలో అడుగుపెట్టి తమిళ ఇండస్ర్టీలో ఎన్నో సూపర్, డూపర్, బాక్సాఫీస్ హిట్లు ఇస్తూ తనదైన ముద్ర వేసుకున్నాడు. ఆయన ప్రస్థానం అజరామరం. ఆయనలాంటి నటుడు.

గతంలో ఎంతో మంది ఉన్నా ఆయన స్టయిల్ వేరు. పెద్దలంటే గౌరవం, చిత్ర సీమపై ఉన్న ప్రేమ ఆయనను ముందు తరాలకు ఆదర్శంగా తీర్చిదిద్దింది. ఎంతో మంది స్టార్ యంగ్ హీరో, హీరోయిన్లకు ఆయన స్ఫూర్తి. ఎంతో మంది డైరెక్టర్లను, ప్రొడ్యూసర్లను, హీరోలను ఆయన చిత్ర సీమకు కూడా పరిచయం చేస్తూ కళామతల్లి రుణం తీర్చుకుంటూ తన ప్రస్థానాన్ని కొనసాగించారు. ఆయన ఎవరో మనకు తెలిసే ఉంటుంది. ఆయనే సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన జీవన ప్రస్థానంలోని కొన్ని ఘటనలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

జీవితం తొలి దశలో కష్టాలు

రజనీకాంత్ 12 డిసెంబర్, 1950లో బెంగుళూరులో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు రాణోజీరావు-రాంబాయి. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఆయన పేరు శివారజీరావు గైక్వాడ్. మధ్య తరగతికి ఉండే సాధారణ కష్టాలే ఆయనకూ ఉన్నాయి. వాటితో ఆయన పోరాడుతూ పెరిగాడు. పుట్టిన ఆరేళ్లకే తల్లిని పోగొట్టుకున్నాడు. ఇంటిలో ఉన్న చిన్న చిన్న గొడవల మధ్య పెరిగుతూ దుర్వెసనాలను మెల్లమెల్లగా అలవాటవడం మొదలు పెట్టాడు.

వీటన్నింటింతో పారాడిన ఆయనలో రామకృష్ణ మఠం మార్పును తీసుకువచ్చింది. అక్కడ ఆయన నడవడికి బీజాలు పడ్డాయి. ఈ క్రమంలో ఎస్ఎస్ఎల్ సీ పూర్తి చేసుకున్నారు. ఆ పట్టాతోనే కేఎస్ ఆర్టీసీలో ఉద్యోగం సంపాదించుకోగలిగారు. ఆ ఉద్యోగమే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది.

ఆ కండక్టర్ ఉద్యోగం మార్చింది

కేఎస్ ఆర్టీసీలో బస్ కండెక్టర్ ఉద్యోగంలో చేరారు రజనీకాంత్. ఆయన గమ్యం అదికాదని కాలం ఎప్పుడో నిర్ణయించింది. అందుకే ఒక వ్యక్తిని పరిచయం చేసేందుకు అక్కడికి తీసుకెళ్లింది. ఆయనే రజనీకాంత్ నిత్యం పనిచేసే బస్ డ్రైవర్ రాజ్ బహదూర్. బస్ కండెక్టర్ గా విధి నిర్వహణలో రజనీ కాంత్ స్టయిల్ వేరుగా ఉండేది. ఆయన ‘రైట్ రైట్’ అంటూ విజిల్ వేయడం, రూట్ల గురించి చెప్పడం. ఇది ఆ బస్సు డ్రైవర్ ను చాలా ఆకట్టుకుంది.

దీంతో నాటకాలు వేసేందుకు రాజనీకాంత్ ను ఒప్పించాడు రాజ్ బహదూర్. ఆయన నాటకాలు వేస్తూనే కండక్టర్ డ్యూటీ చేయడం ప్రారంభించాడు. నాటకాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తున్న రజనీ కాంత్ స్టయిల్ ను చూసి ప్రేక్షకులు ఈలలు వేస్తూ గోల చేసేవారు. ఇవన్నీ గమనించిన డ్రైవర్ ఆయనను మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కు పంపించారు. కావాల్సిన ఖర్చులు కూడా ఆయనే చూసుకునేవారు.

బాలచందర్ దృష్టిలో రజనీ కాంత్

ఒకానొక సమయంలో మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కు ఎగ్జామినర్ గా వెళ్లారు ప్రముఖ దర్శకుడు బాల చందర్. బాల చందర్ ను తొలిచూపులోనే ఆకర్షించారు శివాజీ గైక్వాడ్ (అప్పటికి ఆయన పేరు ఇంకా రజనీ కాంత్ గా మారలేదు). తను తీయబోయే చిత్రం ‘అపూర్వ రాగంగళ్’లో రజనీ కాంత్ కు అవకాశం ఇచ్చారు. ఇది ఆయన వెండితెరపై చేసిన మొదటి చిత్రం. తర్వాత బాలచందరే ఆయన పేరును వెండితెరపై రాజనీ కాంత్ గా మార్చారు. ఇలా తమిళంలో సినిమాలు చేస్తున్న క్రమంలోనే టాలీవుడ్ కు వచ్చారు రజనీ కాంత్.

తెలుగు ఇండస్ర్టీలో ఆయన మొదటి చిత్రం ‘అంతులేని కథ(1975)’. టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఆయన ఇక్కడా రికార్డులను తిరగరాశారు. ఆయన తిమిళ్ డబ్ చిత్రాలు టాలీవుడ్ లో విడుదలై బాక్సాఫీస్ హిట్లను తిరిగరాశాయి. దీంతో రెండు ఇండస్ర్టీలతో ఆయన బంధం పెనవేసుుకుంది. డైరెక్టుగా తెలుగు హీరోలతో కూడా ఆయన చాలా చిత్రాల్లో నటించారు. కెరీర్ మొదట్లో విలన్ గా చేసినా తర్వాత సోలో చిత్రాల్లో బాగా రాణించారు.

దైవభక్తి మెండుగా ఉండేది

రజనీ కాంత్ కు దైవభక్తి చాలా ఎక్కువ. ఆయన చేసే సినిమాల్లో కూడా కనిపిస్తూనే ఉంటుంది. ‘బాబా’ సినిమా చేసిన ఆయన తన జీవిత పయనానికి ఈ చిత్రం సరిగ్గా సరిపోతుందని చాలా సార్లు చెప్పాడు కూడా. కానీ ‘బాబా’ ఇండస్ర్టీలో డిజాస్టర్ గా మిగిలిపోయింది. దాదాపు రజనీ కాంత్ కథ ముగిసిందని చాలా మంది అనుకున్నారు. కానీ ఆయన మాత్రం అలా భావించలేదు. బాబా డైరెక్టర్, ప్రొడ్యూసర్లను ఆదుకున్నారు.

తర్వాత వచ్చిన ‘చంద్రముఖి’తో ఆయన మరో సారి బాక్సాఫీస్ హిట్ దక్కించుకున్నారు. ఇక అప్రతిహతంగా సాగిన ఆయన సినిమాల పరంపర మామూలే. శివాజీ, రోబో బాగా ఆడినా, తర్వాత వచ్చిన రెండు, మూడు సినిమాలు నిరాశపరిచాయి. ప్రస్తుతం ఆయన ‘జైలర్’ ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు.

చేతికి ఎముకలేని మహరాజు

రజనీకాంత్ గురించి పరిచయం గురించి మాత్రమే వివరించారు. ఇంకా ఆయన గురించి చెప్పుకుంటే పోతే పేజీలు కూడా చాలవేమో. ఆయన చేసిన ఎన్నో గొప్ప దానాలు, ధర్మాల గురించి చెప్పనవసరం లేదు. ఇండస్ర్టీలో స్టార్ నటుడిగా కోట్లాది రూపాయలు ఆర్జించిన రజనీకాంత్ అదే స్థాయిలో దాన ధర్మాలు కూడా చేశారు. మనుషులకు, విలువలకు కట్టుబడేవారు రజనీకాంత్.