బాలకృష్ణపై బోయపాటి సంచలన వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న కామెంట్లు..!

0
739

దర్శకుడు బోయపాటి శ్రీను, హీరో బాలకృష్ణ మధ్య విడదీయలేని అనుబంధం ఉంది. బాలయ్య బాబుకు మంచి హిట్లు కట్టబెట్టారు దర్శకుడు బోయపాటి. వీరి కాంబో అంటే మాస్ ఎంటర్ టైనర్ గా ఉంటుంది. థియేటర్లు సైతం ఫ్యాన్ ఈలలు గోలలతో దద్దరిల్లాల్సిందే. బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ హిట్లుగానే రికార్డులను తిరగ రాశాయి.

వీరి కాంబోపై ఫ్యాన్స్ కూడా మరింత ఉత్సాహం చూపిస్తారు. బాలయ్య ఫ్యాన్సే తన ఫ్యాన్స్ అని బోయపాటి కొన్ని సందర్భాలలో కూడా చెప్పుకచ్చారు. తనకు అంతటి గుర్తింపు తెచ్చిన బాలకృష్ణ క్యారెక్టర్ పై బోయపాటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ర్టీలో చర్చలకు దారి తీశాయి.

బోయపాటి, బాలయ్య కాంబోలో అంటే రికార్డే

బోయపాటి, బాలయ్య బాబు కాంబోలో ఇటీవల వచ్చిన ‘అఖండ’. రికార్డులను తిరగరాసింది. అత్యంత ప్రజాధరణ పొందిన సినిమాల జాబితాలో చేరింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గోవాలో నిర్వహించిన వేడుకల్లోనూ ఈ చిత్రాన్ని ప్రముఖంగా ప్రదర్శించారు. దీనికి సీక్వెల్ కూడా ఉండబోతోందని బోయపాటి ఎప్పుడో చెప్పారు. స్క్రిప్ట్, తదితర అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

బాలయ్యది చిన్న పిల్లల మనస్తత్వం

ఈ నేపథ్యంలో బాలయ్య గురించి, ఆయనతో తనకున్న సాన్నిహిత్యం గురించి బోయపాటి కొన్ని విషయాలు చెప్పారు. ఇప్పుడు ఆ విషయాలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ‘బాలయ్య బాబు గొప్ప వ్యక్తి, ఆయనకున్న డెడికేషన్ చూస్తే వండర్ అనిపిస్తుంది. ఇంతటి మనిషి అయినా సెట్ లో ఎలాంటి క్రమశిక్షణతో మెలగాలో అలాగే ఉంటారు. దీనికి తోడు సెట్ బాయ్స్ తో కూడా క్రమ శిక్షణ గురించి చెప్తూ ఉంటాడు. ఇక తను తీయబోయే సినిమాను పూర్తిగా డైరెక్టర్ చేతిలో పెడతాడు.

దర్శకుడు ఎలా చెబితే అలా నటించడంలో బాలయ్య బాబు తర్వాతే ఎవరైనా, ఆయన ఏమైనా సూచనలు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. దాదాపు ఆయన సూచనలను పాటిస్తాం. కానీ కొన్ని సార్లు పాటించకున్నా ఆయన నొచ్చుకోరు. ఆయనది చిన్న పాల్లవాడి మనస్తత్వం. వివాదాలను దగ్గరికి కూడా రానివ్వరు. అందుకే ఆయనతో ఏ డైరెక్టర్ సినిమా తీసిన సక్సెస్ వస్తుంది. క్యారెక్టర్ విషయంలో బాలకృష్ణ నిజంగా గొప్ప వ్యక్తనే చెప్పాలి’. అంటూ చెప్పారు బోయపాటి శ్రీనివాస్

బాలకృష్ణ ఆ సినిమాలు పోటీ

ఇక బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న ‘వీరసింహారెడ్డి’ జనవరి 12కు విడుదల కాబోతోంది. దీనికి సంబంధించి ప్రమోషన్ పనుల్లో నిమగ్నమయ్యారు చిత్ర యూనిట్. సంక్రాంతి ముంగిట్లోకి సంప్రదాయంగా అడుగు పెడుతున్నారు బాలయ్య. ఈ చిత్రం కోసం ఆయన అభిమానులు సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

బాలయ్య బాబు చిత్రంతో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, విజయ్ ‘వారాసు’ అజిత్ ‘తెగింపు’ పోటీ పడబోతున్నాయి. ఈ సినిమాలకు సంబంధించి టీజర్స్, ట్రైలర్స్, పోస్టర్స్ వ్యూవ్స్ లో దూసుకుపోతున్నాయి. ఇక విడుదల కాబోతున్న ఈ చిత్రాలు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాయో చూడాలి మరి.