శేఖర్ కమ్ముల చిత్రానికి ప్రారంభ పూజలు.. హీరో ఎవరంటే

0
236

టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో ధనుష్ హీరోగా ఓ చిత్రం రాబోతుంది. దీనికి సంబంధించి షూటింగ్ ప్రారంభ పూజలు హైదరాబాద్ లో సోమవారం (నవంబర్ 28న) ఘనంగా జరిగాయి. అనంతరం ధనుష్ పై డైరెక్టర్ శేఖర్ కమ్ముల మహూర్తం షాట్ తీశాడు.

శేఖర్ కమ్ములతో

ధనుష్ రీసెంట్ మూవీ ‘నేనే వస్తున్నా’ బాక్సాఫీస్ ముందు ఫల్టీ కొట్టింది. దీంతో తన తర్వాతి ప్రాజెక్టు పై దృష్టి పెట్టాడు యంగ్ హీరో. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో కలిసి ఓ చిత్రం చేయనున్నాడు. దీనికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. హైదరాబాద్ లో షూటింగ్ ప్రారంభం కాగా ధనుష్ లుక్ పలువురిని ఆకట్టుకుంది. గడ్డం, పొడవాటి జుట్టు, సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఆయనపై మహూర్తం షాట్ తీసి షూటింగ్ ను ప్రారంభించింది చిత్ర యూనిట్. దీనిని తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తామని యూనిట్ తెలిపింది. చిత్రానికి సంబంధించి తారాగణం, సాంకేతిక బృందం గురించి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

ఆ బ్యానర్ లోనే

‘అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’తో కలిసి మూవీ మేకింగ్ సంస్థ ‘శ్రీ వేంకటేశ్వర సినిమాస్’తో సునీల్ నారంగ్, పుస్కుర్ రాం మోహన్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారంట. అయితే శేఖర్ కమ్ములతో కలిసి ఓ చిత్రాన్ని తీయాలని ధనుష్ గతంలో అనుకుంటున్నాడంట.

కోరిక నెరవేర్చుకున్న ధనుష్

తాను అభిమానించే దర్శకుల్లో శేఖర్ కమ్ముల కూడా ఒకరని గతంలో చెప్పారు ధనుష్. జూన్ 2021లో ఆయనతో ఒక సినిమా చేస్తానని కూడా ప్రకటించాడు. ఏడాది తర్వాత ఆయన కోరిక నెరవేరబోతోంది. ఈ సినిమా షూటింగ్ కూడా వేగంగా కొనసాగిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ‘ఈ చిత్రంలో నటించేందుకు ఉత్సాహంగా ఉన్నానంటూ’ ఆయన ట్వీట్ కూడా చేశాడట. భారీ నిర్మాణ సంస్థలు, టాప్ ప్రొడ్యూసర్లతో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగానే ఆకట్టుకుంటుందని ధనుష్ సోషల్ మీడియా వేధికగా వివరిస్తున్నాడు.

ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులు

అరుణ్ మాథేశ్వరన్ డైరెక్షన్ లో ధనుష్ ఓ చిత్రంలో బిజీగా ఉన్నారు. 1930 కాలంలో భారతదేశంలో ఉన్న పరిస్థితులపై ఈ చిత్రం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. డార్క్ హ్యూమర్ తో తీసే ఈ చిత్రం వచ్చే ఏడాది (2023)లో ప్రేక్షకులను అలరించబోతోందని తెలుస్తుంది.

‘సర్’ గురించి

ధనుష్ తర్వాతి చిత్రం ‘సర్’ డిసెంబర్ 2న థియేటికల్ రిలీజ్ కాబోతోంది. దీనిపై ఆయన పెద్ద ఎత్తున ఎక్పటేషన్స్ పెట్టుకున్నాడు. దీనికి డైరెక్టర్ గా అట్లూరి వెంకీ వ్యవహరించారు. ధనుష్ సరసన సంయుక్త మీనన్ నటించగా, తనికెళ్ల భరణి, నర్రా శ్రీనివాస్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా సినిమా గురించి భారీ అంచనాలే పెరిగాయి.