చేపల పులుసు బిజినెస్ లో దూసుకుపోతున్న ఆర్పీ

0
432

కామెడీ షోలనే కాకుండా వ్యాపారంలోనూ రాణిస్తున్నారు కిరాక్ ఆర్పీ. ఈ మధ్య ఆయన పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది. జబర్దస్త్ ద్వారా బుల్లితెరకు వచ్చిన ఆర్పీ మొదటి టీంలో కంటెస్టెంట్ గా చేశారు. తనదైన పర్ఫార్మెన్స్ చూపి తర్వాత టీం లీడర్ అయ్యాడు. జబర్ధస్త్ మానేసిన తర్వాత స్టార్ మాలో కామెడీ స్టార్స్ లో తర్వాత మరికొన్ని సినిమాలలో కూడా కనిపించాడు. ఇలా ఆయన ప్రస్తానం కొనసాగిస్తూ ఇప్పుడు బిజినెస్ వైపు మళ్లాడు. అక్కడ కూడా ఆయన బాగానే రాణిస్తున్నారనే చెప్పాలి. ఇటీవల ఆయన కూకట్ పల్లిలో ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ పేరుతో ఒక కర్రీ పాయింట్ ఓపెన్ చేశాడు. ఆయనకు ఉన్న గుర్తింపు కూడా తోడై బాగానే సంపాదిస్తున్నారు.

నెల్లూరు నుంచి చేపలు

కిరాక్ ఆర్పీ స్వస్థలం నెల్లూరు. నెల్లూరు చేపల పులుసుకు ప్రసిద్ధి తన బిజినెస్ ను కూడా అలాగే ప్రారంభించాలనుకున్నాడు ఆర్పీ. ఈ నేపథ్యంలోనే ఈ కర్రీ పాయింట్ ప్రారంభించాడు. నెల్లూరు నుంచే చేపలను తెప్పించి నెల్లూరు స్టయిల్ లో కర్రీలను వండించి సర్వ్ చేస్తున్నాడు. మంచి రుచి కూడా ఉండడంతో భోజన ప్రియులు ఎగబడుతున్నారు. దీంతో ఆయన బిజినెస్ మూడు చేపలు-ఆరు పైసలు చందంగా మారింది.

ఇటీవల ఆయన కర్రీ పాయింట్ వద్ద ట్రాఫిక్ ఎక్కువైందని కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్రీ పాయింట్ పెట్టి నెల రోజుల్లోనే బాగా పాపులర్ అయ్యింది. భోజన ప్రియుల తాకిడి తట్టుకోలేక ఆయన కొన్ని రోజులు కర్రీపాయింట్ ను కూడా మూసి వేశారట. తర్వాత ఏం చేశారో తెలుసుకుందాం..

మ్యాన్ పవర్ పెంచిన ఆర్పీ

ఇటీవల కస్టమర్ల తాకిడి పెరిగిందని భావించి ఆర్పీ మూడు రోజులు షాపు మూసివేశారు. ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ బిజినెస్ ను మరింత పెంచేందుకు మూడు రోజులు మ్యాన్ పవర్ కోసం తిరిగారట. తన సొంత ఊరు వెళ్లి అక్కడ పులుసు పెట్టడంలో బాగా చేయి తిరిగిన వారిని తీసుకచ్చారట. తిరిగి ఈ మధ్యనే మళ్లీ కర్రీ పాయింట్ ఓపెన్ చేశాడు. గతంలో కంటే ఎక్కువ మొత్తంలో తయారు చేయిస్తూ వ్యాపారాన్ని మరింత విస్తృతం చేస్తున్నాడు. ఆయన ఒక్క రోజు సంపాదన తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. బిజినెస్ మ్యాన్లు కూడా ఆశ్చర్యపోతున్నారట.

నెలకు రూ. 3కోట్ల వరకూ

తన కర్రీ పాయింట్ లో చేపలతో పాటు బొమ్మిడాల పులుపు, రవ్వ పులుసు, కొరమీను పులుసు ఇలా చాలా వెరైటీలు వండిస్తున్నారు కిరాక్ ఆర్పీ. ఈ బిజినెస్ లో ఆయన ఒక్క రోజు రూ. 10 లక్షల వరకూ సంపాదిస్తున్నట్లు తెలుస్తుంది. అంటే నెలకు సుమారు రూ. 3 కోట్లు. ఖర్చులన్నీ తీసేసినా దాదాపు కోటికి పైగానే సంపాదిస్తున్నారట. ఏదేమైనా చేపల పులుపు బిజినెస్ లో ఆయన బాగా గడిస్తున్నారని తెలుస్తోంది. తన కర్రీ పాయింట్ తో పాటు ఇతర కర్రీ పాయింట్లకు కూడా ఆయన పంపిస్తున్నారట. ఇక ఆ ఆదాయం కూడా ఆయనకు అదనంగా కలిసి వస్తుంది. ఇప్పుడు నగరంలో కిరాక్ ఆర్పీ చేపల పులుసుకు బాగానే గిరాకీ ఉంది.