నా కూతుర్లు ఎవర్నయినా ప్రేమిస్తే.. నేను హ్యాపీగా ఫీలవుతా

0
600

అదేంటి కూతుర్లు ఎవర్నయినా ప్రేమిస్తే తెగ టెన్షన్‌ పడిపోయి, వారిని ఆ ప్రేమ మైకం నుంచి ఎలా బయటకు తీసుకురావాలా అని ఆలోచించే తల్లి దండ్రులు ఉన్నారు గానీ.. కూతుర్లు ప్రేమలో పడితే హ్యాపీగా ఫీలయ్యే తండ్రి కూడా ఉంటారా అనుకుంటున్నారా. ఖచ్చితంగా ఉంటారు. అందులోనూ భారతదేశం గర్వించే నటుడు కమల్‌హాసన్‌ వంటి తండ్రి ఉంటే ఇక ఆ పిల్లల స్వేచ్ఛకు హద్దేముంటుంది. నటుడిగా కమల్‌కు ఎలా హద్దు లేవో.. పిల్లల పెంపకం విషయంలో కూడా ఆయన ఎలాంటి హద్దు పెట్టలేదు.

మొదటి భార్య సారికతో విడిపోయినప్పటికీ కూతుర్లు శృతిహాసన్‌, అక్షర హాసన్‌లు కమల్‌తోనే ఉంటారు. నటుడిగా కమల్‌ బిజీ అయినా.. కూతుర్ల చదవులు, ఇతర విషయాపట్ల ఎప్పటికప్పుడు శ్రద్ధ వహిస్తూనే ఉంటారు. వారు కూడా తల్లి కంటే తండ్రితోనే ఎక్కువ చనువుగా ఉంటారు.

తాజాగా శృతిహాసన్‌ పుట్టిన రోజు సందర్భంగా కమల్‌ మాట్లాడుతూ.. ‘‘శృతిహాసన్‌ హీరోయిన్‌గా మంచి స్థాయికి చేరుకోవడం తండ్రిగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఆమె ఎప్పుడూ నా మీద ఆధారపడలేదు. తనకు తానుగా స్వశక్తితో ఎదిగింది. ఆమె పెళ్లి విషయం గురించి మీరు ఎప్పుడూ అడుగుతూ ఉంటారు. నా పిల్లల పెళ్లి విషయంలో నా జోక్యం పెద్దగా ఉండదు. వారు ఎవర్ని ఇష్టపడితే వారితో పెళ్లి జరిపిస్తా. నా కూతుర్లు ఎవర్నయినా ఇష్టపడితే నేను హ్యాపీగా ఫీలవుతా.

వారు అడిగితేనే సినిమాకు సంబంధించిన సహాలు ఇస్తూ ఉంటా కానీ, నాకు నేనుగా వారికి సహాలు ఇవ్వను. వారేమీ చిన్నవారు కాదు. నేను నా కూతుర్లను సైంటిస్ట్‌ను చేయాలని అనుకున్నా. కానీ వారు సినిమా రంగం వైపు మొగ్గు చూపారు. వారి నిర్ణయాన్ని నేను ఎలా కాదంటాను. శృతి కెరీర్‌ ఈ సంవత్సరం మంచి పీక్స్‌కు వెళుతుంది. ఆమెకు శృతి అనే పేరు ఏ క్షణాన ఫిక్స్‌ చేశానో గానీ.. 7 సంవత్సరాల వయస్సు నుంచే సంగీతం నేర్చుకుంది. కొన్ని సినిమాలకు పని చేసింది కూడా అన్నారు కమల్‌.