ఎన్టీఆర్ రెమ్యునరేషన్ బ్రేక్ చేసిన కృష్ణంరాజు.. ఏ చిత్రంతో తెలుసా

0
1388

19వ దశకంలో హీరోలంటే ముఖ్యంగా ఎన్టీఆర్, నాగేశ్వర్ రావు, కృష్ణం రాజు, కృష్ణ ఇలా ఉండేవారు. వీరు చేసిన సినిమాలు ఇప్పటికీ సినీ ఇండస్ర్టీలో కలికితురాళ్లే అని చెప్పాలి. వారి నటనను అభిమానించే విమర్శకుడు లేడంటే అతిశయోక్తి కాదు. అప్పటి వారి రెమ్యునరేషన్ కూడా అప్పటి రూపాయి విలువను బట్టి ఉండేది. కొన్ని చిత్రాలను ప్రేక్షకుల కోసం, మరికొన్ని చిత్రాలను దాన ధర్మాల కోసం, ఇందులో కొందరైతే ధీనావస్థలో ఉన్న ప్రొడ్యూసర్ల కోసం కూడా చేసేవారు. అందుకే అంతటి కీర్తి తెచ్చుకున్నారు.

కథను సిద్ధం చేసిన ‘బ్రదర్స్’

1983 కాలంలో రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇండస్ర్టీలో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక కృష్ణం రాజుతో రాఘవేందర్ రావు కాంబో అంటే అభిమానులకు మరో పండుగే అని చెప్పాలి. అప్పుడే వచ్చిన అడవి సింహాలు వీరికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ సమయంలో రాఘవేందర్ రావు కృష్ణం రాజుతో మరో సినిమా చేయాలని అనుకున్నాడు. దీనికి రచయితలుగా పరుచూరి బ్రదర్స్ ను ఎంచుకొని, వారి వద్దకు వెళ్లి తనకు మంచి కథ కావాలని చెప్పాడు. థీమ్ ను కూడా వివరించాడు. ‘ఒక ఊరిలో ఊరి పెద్ద ఉంటాడు. అతడు ఆరడుగులు ఉంటాడు.

బాక్సాఫీస్ హిట్ ఇచ్చిన బొబ్బిలి బ్రహ్మన్న

చాలా అందగాడు’ అని రాఘవేందర్ రావు చెప్పాడు. దీంతో పరుచూరి బ్రదర్స్ కథను సిద్ధం చేశారు. ఈ కథను మహాభారతంలోని ఓ అంశాన్ని బేస్ చేసుకొని రాసి ఇచ్చారు. బ్రదర్స్ కథ కూడా రాఘవేందర్ రావుకు బాగా నచ్చింది. పరుచూరి బ్రదర్స్ రాసిన కథను రాఘవేందర్ రావు కృష్ణంరాజుకు వినిపించారు. నచ్చడంతో ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక సినిమా పట్టాలెక్కింది. ఇందులో హీరోయిన్లుగా శారదా, జయసుధను తీసుకున్నారు. ఆ సినిమా పేరే ‘బొబ్బిలి బ్రహ్మన్న’. బ్రహ్మన్న పాత్రలో కృష్ణంరాజు బాగా ఒదిగిపోయారు. ఈ మూవీ 25 మే, 1984లో రిలీజ్ అయ్యింది.

రికార్డు బ్రేక్ చేసిన కృష్ణం రాజు

స్టార్ డం హీరో, దర్శకేంద్రుడి కాంబోలో వచ్చిన ఈ చిత్రం అనుకున్నదాని కంటే ఎక్కువగా వసూళ్లు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ‘బొబ్బిలి బ్రహ్మన్న’ చిత్రం తర్వాత కృష్ణంరాజుకు మరింత క్రేజ్ పెరిగింది. ఆ సమయంలో ఎన్టీఆర్ ఇండస్ర్టీని ఏలుతున్నాడు. ఈ చిత్రం తర్వాత మీడియా కృష్ణంరాజును ఎన్టీఆర్ కు పోటీగా అంటూ కీర్తించింది. కృష్ణం రాజుకు అవకాశాలు పెరగసాగాయి. బొబ్బిలి బ్రహ్మన్న తర్వాతి చిత్రం ‘భారతంలో శంఖారావం’ చిత్రం చేశాడు కృష్ణంరాజు. అయితే ఈ సినిమాకు ఆయన ఏకంగా రూ. 25 లక్షలు రెమ్యునరేషన్ గా తీసుకున్నారు.

ఎన్టీఆర్ మొదటి స్థానంలో

అప్పట్లో ఇదే పెద్ద అమౌంట్. అదే సమయంలో ఎన్టీఆర్ ‘నాదేశం’ సినిమాను చేస్తున్నారు. దీనికి ఆయన రూ. 18 లక్షలు తీసుకున్నారు. అప్పటి వరకూ రెమ్యునరేషన్ విషయంలో ఎన్టీఆర్ మొదటి స్థానంలో ఉండగా. ‘భారతంలో శంఖారావం’ సినిమా నుంచి ఆయన కంటే ఎక్కువ తీసుకొని కృష్ణం రాజు మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఎన్టీఆర్ రెమ్యునరేషన్ బ్రేక్ చేసిన కృష్ణం రాజు రికార్డు సృష్టించారనే చెప్పాలి.