40 దాటినా పెళ్లికాని మన ‘తార’లు.. ఎందుకో తెలుసా

0
489

ప్రతి ఒక్కరూ ఒక వయసు వచ్చాక తోడును వెతుక్కోవాలి. ఇది మనుషులకే కాదు.. సమస్త జీవరాశికి కూడా వర్తిస్తుంది. తోడు లేకుంటే చివరి మజిలీని ఊహించడం కష్టమైన పనే. ఇదంతా అక్షర సత్యమైనా కొందరు మాత్రం వాటికి దూరంగా ఉంటారు. వారి జీవితంలో చూసిన సంఘటనలు కొంత ప్రభావం చూపితే.. మరిన్ని బాధలు తెచ్చుకోవడం ఎందుకని మరికొందరు అనుకుంటారు.. ఇంకొందరు మొదటి నుంచే ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు.

40 సంవత్సరాల వయస్సు వచ్చినా

ఇక ఇండస్ర్టీ గురించి చూసుకుంటే ఇక్కడ గాసిప్ లే రాజ్యమేలుతుంటాయి. వారి మధ్యా, వీరి మధ్యా అంటూ చాలా గాసిప్ లు వస్తుంటాయి. 40 సంవత్సరాల వయస్సు వచ్చినా పెళ్లికి దూరంగా ఉన్న మన హీరోయిన్ల గురించి ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

టబు

‘నిన్నే పెళ్లాడుతా’ సినిమాలో పండుగా అలరించి ఆకట్టుకుంది టబు. ఈ చిత్రంతో ఆమె చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. కానీ ఆమె ఇప్పటి వరకూ పెళ్లి చేసుకోలేదు. నాగార్జునను ప్రేమించిందని ఆయన అమలను పెళ్లి చేసుకోవడంతో సింగిల్ గా ఉండాలని డిసైడ్ అయి పెళ్లికి దూరంగా ఉందని అప్పట్లో చాలా రూమర్లు వచ్చాయి. దీనిపై ఇప్పటికీ టబు క్లారిటీ ఇవ్వలేదు.

కౌసల్యా

కౌసల్య అసలు పేరు నందిని. 1979లో బెంగళూర్ లో జన్మించింది. 1996లో బాలచంద్ర మీనన్ దర్శకత్వంలో వచ్చిన మలయాళ చిత్రంతో వెండితెరపై అరంగేట్రం చేసింది. తర్వాత చాలా వరకు తెలుగు, తమిళం, మలయాలం చిత్రాలను నటించింది. ‘అల్లుడు గారు వచ్చారు’ సినిమాలో జగపతి బాబుతో కలిసి నటించింది. కానీ శ్రీకాంత్ తో కలిసి చేసిన ‘పంచదార చిలుక’తో ఆమె గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతుంది. ఇప్పటికీ ఆమె పెళ్లికి దూరంగానే ఉంది.

శోభన

శాస్ర్తీయ నృత్య కుటుంబం నుంచి వచ్చింది శోభన. ఆమె చైల్డ్ ఆర్టిస్టుగా తెరంగేట్రం చేసింది. 1979లో కృష్ణన్-పంజు దర్శకత్వం వహించిన తమిళ సినిమా ‘మంగళ నాయకి’లో ప్రధాన పాత్ర పోషించింది. ఇక తెలుగులో 1982 నుంచి నటిస్తూ వస్తుంది. అయితే అప్పట్లో ఆమె పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వచ్చినా తను సింగిల్ గానే ఉంటానని క్లారిటీ ఇచ్చింది. అయితే ఆమె ఒక బాలికను దత్తత తీసుకుంది.

నగ్మా

నగ్మా ఇండస్ర్టీలో చాలా మంది హీరోలతో సన్నిహితంగా ఉంటోందని అందులో ఒకరిని పెళ్లి కూడా చేసుకోబోతోందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ గాసిప్స్ మాత్రమే. ప్రస్తుతం ఆమె పాలిటిక్స్ లో కొనసాగుతున్నారు. ఇప్పటికీ ఆమె పెళ్లి చేసుకోలేదు.

సితార

సినిమాలలో ఒక తారగా వెలిగారు సితార. ఆమె అందం అ సమయంలో అందరినీ కట్టిపడేసేది. సితార కూడా పెళ్లికి దూరంగా ఉన్నారు. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ కూడా ఇచ్చారు. తన తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్లడం ఇష్టం లేకనే పెళ్లి చేసుకోలేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తల్లిగా, అత్తగా పాత్రలు పోషిస్తూ ఇప్పటికీ ఇండస్ర్టీలో కొనసాగుతున్నారు.

బాలీవుడ్ బామలు

బాలీవుడ్ లో కూడా సీనియర్ స్టార్ హీరోయిన్లు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తున్నారు. అందులో అమీషా పటేల్ ఉన్నారు. ఆమెతో పాటు బాలీవుడ్ బ్యూటీ, మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ కూడా పెళ్లి చేసుకోలేదు. కానీ సుస్మితా సేన్ తనకంటే చిన్నవాడైన రోమన్ అనే మోడల్ తో రిలేషన్ లో కొనసాగుతున్నారు.