నిన్న సమంత.. నేడు అల్లు అర్జున్

0
1591

ప్రస్తుతం మోనోసైటిస్ వ్యాధితో బాధ పడుతున్న హీరోయిన్ సమంత ఒకప్పుడు పేద విద్యార్థులకు సాయం చేయడంలో ముందు వరుస ఉంటుందన్న సంగతి తెలిసిందే. పేద విద్యార్థులకు చదువులకు, పౌష్టికాహారం కోసం కోట్ల రూపాయలు సాయం చేసేది. ఇలాంటి విషయంలో తాజాగా అల్లు అర్జున్ కూడా ముందుకు వచ్చాడు. కేరళలో భారీ వర్షాల నేపథ్యంలో అనేక మంది నిరాశ్రయులు అయిన సంగతి తెలిసిందే. అలాంటి వారిలో తండ్రిని కొల్పోయిన ఓ మెడికల్‌ విద్యార్థినికి అల్లు అర్జున్ సాయం చేసాడు. తన చదువు పూర్తి అయ్యాయేదాకా ఖర్చులు భరించి.. ఆ విద్యార్థినిని దత్తత తీసుకుంటానని చెప్పడం విశేషం.

డ్రైవర్‌‌ ఇల్లు కట్టుకుంటున్నాడని.. స్వయంగా వెళ్లి

అల్లు అర్జున్ సాయం చేయడంలో ముందు వరుసలో ఉంటాడన్న సంగతి తెలిసిందే. గతంలో ఎంతో మంది పేద విద్యార్థులకు సాయం చేసిన హీరో అల్లు అర్జున్.. తాజాగా మరో సారి వార్తలలోకి ఎక్కాడు. తన వద్ద డ్రైవర్ గా పదేళ్ల నుండి పని చేస్తున్న బోరబండ వాసి మహిపాల్ కి 15 లక్షలు సాయం అందించాడు. మహిపాల్ స్వస్థలం వరంగల్ కాగా.. అతడు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాడు. ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ బోరబండకి వెళ్లి.. డ్రైవర్ కు రూ.15 లక్షలు ఇచ్చాడు. దీనితో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

అద్భుతం చేసి చూపించిన డాక్టర్లు

ఫ్రాన్స్ డాక్టర్లు అద్భుతం చేసి చూపించారు. ముక్కు క్యాన్సర్ తో చాలా కాలంగా బాధ పడుతున్న ఓ మహిళకి థెరపీలో భాగంగా ముక్కు కొంత భాగం దెబ్బతినింది. దీనితో ఆమెకి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో పాటు.. చూడడానికి వికారంలో ఉంది. దీనితో బాధితురాలి ముంజేతిపై బెల్జియం కంపెనీ సాయంతో కృత్రిమ ముక్కును సృష్టించారు. రెండు నెలల పాటు ముక్కుని ఎదగనిచ్చి.. ఆపై మొహానికి అతికించారు. ఇప్పుడు ఆమె శ్వాస బాగా తీసుకోవడంతో పాటు.. మొహంలో ముక్కు కలసి పోయింది. కొన్ని రోజులు చూసి. ఆ తరువాత ఇంటికి పంపిస్తామని డాక్టర్లు చెప్పారు.