ఫ్యామిలీ వీక్ లో సందడిగా బిగ్ బాస్ కంటెస్టెంట్..!

0
240

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 చివరకు వచ్చింది. ఇంకా కొన్ని వారేలే ఉండడంతో కంటెస్టెంట్స్ 9 మంది హౌజ్ లో ఉన్నారు. ఇక ఈ వారం నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారోనని ఉత్కంఠ నెలకొంది. ఫ్యామిలీ వీక్ లో భాగంగా కంటెస్టెంట్లకు సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కక్కరుగా హౌజ్ లోకి వస్తూ వారిని ఉత్సాహ పరుస్తున్నారు. ఆదిరెడ్డి కుటుంబం నుంచి భార్య, కూతురు రాగా, శ్రీహాన్ కోసం సిరి వచ్చింది. రాజ్, శ్రీసత్య, ఫైమా, రోహిత్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా వచ్చి వారిని సర్ ప్రైజ్ చేస్తున్నారు.

శ్రీహాన్ ను డాడీ అంటూ పిలిచిన బాబు ఇంతకీ ఎవరు..?

ఫ్యామిలీ వీక్ లో శ్రీహాన్ కోసం సిరి హౌజ్ కు రాగా వెంట ఒక బాబును కూడా తీసుకచ్చింది. ఆ బాబు శ్రీహాన్ ను డాడీ అంటూ పిలిచి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో పాటు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇక శ్రీహాన్, సిరి లవర్స్ కాగా వారికి పెండ్లి కూడా కాకుండానే బాబు ఏంటా అంటూ సందేహం వ్యక్తం చేశారు. ఐతే ఆ బాబు శ్రీహాన్ వాళ్ల అన్న కొడుకు తండ్రిని నాన్న అని బాబాయిని డాడీ అని పిలవడం చిన్నతనం నుంచి అలవాటుగా ఉందని శ్రీహాన్ క్లారిటీ ఇచ్చాడు. బాబుతో పాటు సిరి కూడా హౌజ్ అంతా సందడి చేసింది. శ్రీహాన్ పేరును తన వీపుపై పచ్చబొట్టు వేయించుకొని సర్ ప్రైజ్ ఇచ్చింది సిరి.

కీర్తి కోసం మహేశ్

హౌజ్ లో మరో కంటెస్టెంట్ కీర్తి కోసం బుల్లితెర నటుడు మహేశ్ వచ్చాడు. పంచులతో ఎంటర్ టైన్ చేశాడు. కీర్తితో డ్యాన్స్ చేస్తూ హగ్గులు ఇస్తూ తెగ సందడి చేశాడు. వంటకం చేసి కీర్తికి తినిపించాడు. ఫైమా ఇంగ్లీష్ పై కామెంట్లు చేస్తూ ఏడిపించాడు. బిగ్ బాస్ కప్ ను తప్పక గెలుచుకోవాలని కీర్తిని ఎంకరేజ్ చేశాడు. వెళ్తుండగా ఇనయాను ముద్దు అడిగి కీర్తిని కుల్లుకునేట్లు చేసి వెళ్లిపోయాడు.

ఇనయా తల్లి ఎంట్రీ

మూడు నెలలుగా తన కూతురును బిగ్ బాస్ లో చూస్తున్న ఇనయా తల్లి హౌజ్ కు వచ్చి ఆమెను హత్తుకుంది. మూడు నెలలుగా టీవీలో తప్ప తన కూతురును తాకలేదంటూ హత్తుకుంటూ మురిసిపోయింది. కప్పు నీకే సొంతం కావాలంటూ.. ఎంకరేజ్ చేసింది. నువ్వే గెలుస్తావంటూ ధైర్యం నూరి పోసింది.

కంటెస్టెంట్స్ సందడి

బిగ్ బాస్ గేమ్ షోలో భాగంగా శ్రీహాన్ ఫ్లట్టింగ్ మాస్టర్ గా హాస్యం పండించాడు. యోగా టీచర్ గా రేవంత్ ప్రయత్నం వృథాగా మారింది. హౌజ్ మేట్స్ రేవంత్ ను ఆడుకున్నారు. రాజ్ ను రాత్రి భయపెట్టాలనే టాస్క్ లో శ్రీహాన్, రేవంత్ సక్సెస్ అయ్యారు.