రష్మికను బ్యాన్ చేసిన శాండల్ వుడ్.. అసలు ఏం జరిగింది

0
225

ఫిల్మ్ ఇండస్ర్టీకి వచ్చిన అతి కొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు నటి రష్మికా మందనా. ఆ తర్వాత ‘ఫుష్ప’తో ఆమెకు పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ పెరిగింది. కన్నడలో రిషబ్ శెట్టి డైరెక్షన్ లో వచ్చిన ‘కిరిక్ పార్టీ’తో వెండితెర అరంగేట్రం చేశారు రష్మికా. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమెకు అవకాశాలు కొదువ లేకుండా పోయాయి. తెలుగు చిత్ర పరిశ్రమ టాలీవుడ్ లో నాగశౌర్య హీరోగా నటించిన ‘చలో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఆ చిత్రం కూడా మంచి హిట్ తెచ్చిపెట్టడంతో అవకాశాలు వెల్లువలా రావడం ప్రారంభించాయి.

చలోతో టాలీవుడ్ లోకి

ఆమె తర్వాతి చిత్రం రౌడీబాయ్ విజయ్ దేవరకొండతో కలిసి ‘గీత గోవిందం’ చేశారు. ఇది తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో రష్మిక పర్ఫార్మెన్స్ కు ఆడియన్స్ ప్రశంసలు కురిపించారు. తర్వాత ఆయనతోనే ‘డియర్ కామ్రేడ్’ తీశారు. ఇది అంత పెద్ద హిట్ సాధించకపోయినా రష్మికా మందన నటన ఆకట్టుకుంది. తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’తో పాన్ ఇండియా లెవల్ లో దూసుకుపోయారు మందన. ఈ చిత్రం సాధించిన బ్లాక్ బస్టర్ హిట్ తో బాలీవుడ్ కూడా ఆమె వైపు దృష్టి సారించింది. ఇప్పుడు బాలీవుడ్ లో అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి.

‘కాంతారా’పై ఎందుకు నోరు మెదపెలేనందుకే

రిషబ్ శెట్టి తీసిన డెవోషనల్ బ్లాక్ బస్టర్ ‘కాంతారా’. ఇది సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అతిరథ మహారధులు సైతం దీనిపై ప్రశంసల జల్లు కురిపించారు. చిత్ర పరిశ్రమలో పెద్ద హిట్టయితే ఆ సినిమా తీసిన వారిని అభినందించే రష్మిక రిషబ్ శెట్టి తీసిన కాంతారాపై స్పందించలేదట. తనను చిత్ర సీమకు పరిచయం చేసిన డైరెక్టర్ సినిమాపై ఆమె స్పందించకపోవడంతో శాండల్ వుడ్ ప్రేక్షకులు ఆమెపై గుర్రుగా ఉన్నారట. సోసల్ మీడియా వేదికగా ఆమెపై విమర్శలు చేస్తున్నారట. దీనికి తోడు ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కాంతారాపై ఆమెను ప్రశ్నించగా ‘ఆ సినిమా నేను ’చూడలేదు అని చెప్పిందట.

బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించిందట

తర్వాత ఈ సినిమాపై మరికొన్ని ప్రశ్నల వర్షం కురిపించగా మాటదాటేసిందట. దీంతో కన్నడ అభిమానుల్లో కోపం కట్టలు తెంచుకుంది. శాండల్ వుడ్ అంటే అంత చిన్నచూపా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ నే మరిచిపోయావా అంటూ మండిపడుతున్నారు. దీనిపై కన్నడ ఇండస్ర్టీకి స్పందించిందట.. ఆమెను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించిందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ఇంత వరకూ ఎవరూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.