అల్లు అర్జున్ రజినీకాంత్ కంటే పెద్ద సూపర్ స్టార్ అంటూ బిగ్ బాస్ శివాజీ షాకింగ్ కామెంట్స్!

0
251
Allu Arjun is a bigger superstar than Rajinikanth, says Bigg Boss Sivaji's shocking comments!

సుమారుగా 99 సినిమాల్లో హీరో గా , క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించినా కూడా రానటువంటి క్రేజ్ మరియు ఫేమ్ శివాజీకి బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా వచ్చింది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఈ సీజన్ లో ఆయన మైండ్ గేమ్ తో ఆడిన తీరుకు లక్షలాది మంది అభిమానులు పుట్టుకొచ్చారు. ఆయన్ని టాప్ 3 కంటెస్టెంట్ గా నిలబెట్టి తమ అభిమానం ని చాటుకున్నారు.

ఏ విషయం లో అయినా కచ్చితమైన అభిప్రాయం గల శివాజీ, పల్లవి ప్రశాంత్ ఆట తీరుని చూసి వీడు కచ్చితంగా టైటిల్ విన్నర్ అవుతాడు అని చెప్పాడు.

శివాజీ చెప్పినట్టుగానే పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలుచుకొని సామాన్య రైతు బిడ్డ పవర్ ఏంటో చూపించాడు. ఇదంతా పక్కన పెడితే ప్రశాంత్ విషయం లో చెప్పినట్టుగానే, మూడేళ్ళ క్రితం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విషయం లో కూడా శివాజీ పలు కీలకమైన వ్యాఖ్యలు చేసాడు.

సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత మన సౌత్ లో అల్లు అర్జున్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అవుతాడని శివాజీ మూడేళ్ళ క్రితం చెప్పాడట.Director Naga Ashwin is going to tell interesting things about Prabhas Kalki movie

రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ శివాజీతో మాట్లాడుతూ ‘మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉండగా అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది, దీనిపై మీ స్పందన ఏమిటి?’ అని అడుగుతాడు.

దానికి శివాజీ సమాధానం చెప్తూ ‘అల్లు అర్జున్ నాకు గంగోత్రి సినిమా సమయం నుండే తెలుసు. అతని టాలెంట్ ఏంటో నాకు తెలుసు కాబట్టి భవిష్యత్తులో పెద్ద హీరో అవుతాడు అనుకున్నాను, అయ్యాడు.

రెండు మూడేళ్ళ క్రితం ఇతను సౌత్ లో రజినీకాంత్ రేంజ్ సూపర్ స్టార్ అవుతాడు అన్నాను, ఇప్పుడు రజినీకాంత్ ని దాటిపోయే రేంజ్ స్టార్ స్టేటస్ ని దక్కించుకున్నాడు, అప్పట్లో నేను ఇది చెప్తే నమ్మలేదు, కానీ ఈరోజు నామాట నిజం అయ్యింది.

అల్లు అర్జున్ నటన నచ్చో, లేదా అతని సినిమాలు నచ్చో నాకు తెలియదు కానీ, ఎందుకో నా మనసులో మూడేళ్ళ క్రితమే సౌత్ లో నెంబర్ 1 సూపర్ స్టార్ అవుతాడని అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చాడు శివాజీ.

తమ అభిమాన హీరో గురించి ఇంత గొప్పగా మాట్లాడినందుకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ శివాజీకి కృతఙ్ఞతలు తెలియచేస్తున్నారు.