ఈ ఏడాది సమంత టార్గెట్ ఏమిటి..? తెలుగు లో ఒక్క సినిమా కూడా లేదా!

0
247

సౌత్ ఇండియా లో ఒక స్టార్ హీరో కి ఉన్నంత క్రేజ్ మరియు ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో సమంత కచ్చితంగా ఉంటుంది. ఈమె కంటూ ఒక సెపెరేట్ మార్కెట్ అనేది కచ్చితంగా ఉంది.

ఒక హీరో సినిమాలో ఈమె నటిస్తే కచ్చితంగా ఈమె వల్ల ఆ చిత్రానికి ఎక్కువ బిజినెస్ జరుగుతుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఆ రేంజ్ బ్రాండ్ ఇమేజి ఆమె సొంతం. కేవలం తెలుగు లో మాత్రమే కాదు, హిందీ, తమిళం భాషల్లో కూడా ఈమె అందరి స్టార్ హీరోల సరసన నటిస్తూ వచ్చింది.

అలా దూకుడు మీద వెళ్తున్న సమంత కి నాగ చైతన్య తో విడాకులు జరగడం ఆమె జీవితం లో అతి పెద్ద స్పీడ్ బ్రేకర్ అని చెప్పొచ్చు.

విడాకులు తర్వాత మానసికంగా ఎంతో కృంగిపోయిన సమంత ‘మయోసిటిస్’ అనే ప్రాణాంతక వ్యాధి సోకి ప్రాణాలతో పోరాడు చివరికి సురక్షితంగా బయటపడింది.

Did Trivikram repeat his magic in Guntur Karam

అయితే సినిమాల పరంగా మాత్రం సమంత కి ఒకప్పుడు ఉన్న ఊపు లేదు. గత ఏడాది ఆమె హీరోయిన్ గా నటించిన ‘ఖుషి’ చిత్రం, అలాగే ప్రధాన పాత్రలో కనిపించిన ‘శాకుంతలం’ చిత్రాలు కమర్షియల్ గా ఫ్లాప్స్ అయ్యాయి.

మరి ఈ ఏడాది ఆమె ఎలాంటి సినిమాలు చేయబోతుంది, ఆమె గోల్ ఏమిటి? అనేది అభిమానుల్లో మెలుగుతున్న ప్రశ్న. రీసెంట్ గానే ఆమె అమెజాన్ ప్రైమ్ కోసం ‘సిటాడెల్’ అనే యాక్షన్ వెబ్ సిరీస్ చేసింది.

అతి త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతున్న ఈ వెబ్ సిరీస్ కోసం సమంత ప్రొమోషన్స్ చెయ్యడానికి సిద్ధమైంది. ఈ సిరీస్ కి రాజ్ & డీకే దర్శకత్వం వహించారు.

గతం లో వీళ్ళు దర్శకత్వం వహించిన ‘ఫ్యామిలీ మెన్ 2 ‘ వెబ్ సిరీస్ లో సమంత విలన్ రోల్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పాత్రతో ఆమె నేషనల్ వైడ్ ఫేమ్ ని సంపాదించింది.

దీని తర్వాత ఆమె బాలీవుడ్ సల్మాన్ ఖాన్ హీరో గా నటిస్తున్న ‘ది బుల్’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించబోతున్నట్టు టాక్.

కరణ్ జోహాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి ‘పంజా’ డైరెక్టర్ విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించబోతున్నాడు. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక సమంత చెయ్యబొయ్యే తెలుగు ప్రాజెక్ట్స్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు.