‘గుంటూరు కారం’ లో త్రివిక్రమ్ ‘అతడు’ మ్యాజిక్ ని రిపీట్ చేశాడా..?

0
274
Did Trivikram repeat his magic in Guntur Karam

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ‘గుంటూరు కారం’ చిత్రం పది రోజుల లోపే విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.

‘అతడు’ మరియు ‘ఖలేజా’ లాంటి కల్ట్ క్లాసిక్స్ తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇది. అందుకే ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అభిమానులు మహేష్ ని మాస్ యాంగిల్ లో చూపించడం లేదని ఒక కంప్లైంట్ ఉండేది. కానీ అభిమానుల మాస్ ఆకలి ని ‘గుంటూరు కారం’ తీరుస్తుందని ఆ చిత్ర నిర్మాత నాగవంశీ రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

పోకిరి తర్వాత మహేష్ లో ఆ రేంజ్ మాస్ యాంగిల్ ని ఎవ్వరూ బయటకి తీసుకొని రాలేదని, కానీ ‘గుంటూరు కారం’ చిత్రం మాత్రం ఆ యాంగిల్ ని తీసుకొచ్చిందని చెప్పుకొచ్చాడు వంశీ.

అంతే కాకుండా ఈ సినిమాలో తల్లి సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యిందని. ఫస్ట్ హాఫ్ మొత్తం మాస్ ఆడియన్స్ కి, సెకండ్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ కోసం అన్నట్టుగా ఈ చిత్రం ఉంటుందని.

Trivikram Bunnies couldnt do it

మొత్తానికి సంక్రాంతికి ఆడియన్స్ కి ఈ చిత్రం ఫుల్ మీల్స్ లాంటిది అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ సినిమాలో ఒక మాస్ సన్నివేశం లో మహేష్ బాబు తో పాటుగా సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తాడా.

‘యమదొంగ’ సినిమాలో లాగా గ్రాఫిక్స్ ఎన్టీఆర్ ని తీసుకొచ్చినట్టు ఇందులో గ్రాఫిక్స్ కృష్ణ ని తీసుకొచ్చారా అనే సందేహాలు అభిమానుల్లో మొదలైంది.

అయితే క్లైమాక్స్ సన్నివేశం లో మాత్రం ఫైట్స్ ఉండవ్ అని అంటున్నారు, ఇది ఎంత వరకు నిజమో చూడాలి. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా విడుదలైన ‘కుర్చీ మడతపెట్టి’ అనే లిరికల్ వీడియో సాంగ్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో మన అందరికీ తెలిసిందే.

బీ సి సెంటర్స్ లో మాస్ ఆడియన్స్ ఈ పాటకి ఊగిపోతారు అనే చెప్పాలి. ఇక మహేష్ బాబు డ్యాన్స్ మూవ్మెంట్స్ కూడా అంతులేని ఎనర్జీ తో ఉన్నాయి. ఈ వయస్సులో శ్రీలీల తో సమానమైన ఎనర్జీ తో డ్యాన్స్ వెయ్యడం అనేది మామూలు విషయం కాదు.