త్రివిక్రమ్‌ బన్నీలకు కుదిరేలాలేదు…

0
216
Trivikram Bunnies couldnt do it

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు నటిస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’ ఈ సినిమా ఈనెల 12న థియేటర్స్‌లో సంది చేయనుంది. గతంలో త్రివిక్రమ్‌`మహేష్‌ల కాంబోలో ‘అతడు’, ఖలేజా వచ్చాయి.

ఇది వీరిద్దరికీ హ్యాట్రిక్‌ మూవీ. ఈ సంక్రాంతికి సందడి మొత్తం గుంటూరు కారందే అన్నట్టుంది వ్యవహారం. ఇక పోతే ఈ సినిమా తర్వాత అసలైతే త్రివిక్రమ్‌ బన్నీతో ఒక సినిమా చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన కథ కూడా ఓకే అయిపోయంది.

అయితే ప్రస్తుతం బన్నీ పుష్పా2లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా నుంచి బన్నీ బయటకు రావాలంటే దాదాపు 7 నుంచి 8 నెలలు పట్టవచ్చు అంటున్నారు.

అయితే లెక్కల మాస్టారు సుకుమార్‌ క్వాలిటీ విషయంలో రాజీపడడు. కాబట్టి ఈ ఎనిమిది కాస్తా ఇంకా పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇదిలాఉంటే బన్నీ డేట్స్‌ దొక్కపోతే త్రివిక్రమ్‌ పరిస్థితి ఏంటి? ఈ ఎనిమిది నెలలు ఖాళీగా ఉండలేడు. కాబట్టి మరో సినిమా పట్టాలు ఎక్కించేందుకు రెడీ అవుతున్నాడట త్రివిక్రమ్‌.

The effect of Salaar on Pushpa The Rule overseas buyers are trembling

ఎప్పటి నుంచో వెంకటేష్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. అలాగే రామ్‌తో కూడా స్రవంతి మూవీస్‌లో ఓ సినిమా చేయాల్సిన కమిట్‌మెంట్‌ ఉంది. ఇక హీరో నానీతో కూడా ఓ సినిమా చేయాలి.

అంతా గందరగోళంగా ఉంది. దీంతో ఒక మల్టీస్టారర్‌ చేయటానికి త్రివిక్రమ్‌ కథను సిద్ధం చేస్తున్నాడట. ఇది వెంకీ, రామ్‌లతో అయ్యే అవకాశం ఉంది.

లేదా వెంకీ నానీలతో చేసే ఛాన్స్‌ కూడా ఉంది. నాని, రామ్‌లు మారవచ్చు గానీ వెంకీ కామన్‌ అంట.

అంటే ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అన్నమాట. ప్రస్తుతం ఈ కథమీదే త్రివిక్రమ్‌ కసరత్తు చేస్తున్నారట. సంక్రాంతికి గుంటూరు కారం ఎలాగూ విడుదలౌతోంది కాబట్టి.

వీలైనంత త్వరగా కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించి స్పీడ్‌గా కంప్లీట్‌ చేయాలనేది ప్లాన్‌. అప్పటికి ఎలాగూ బన్నీ కూడా ఫ్రీ అవుతాడు. తాజాగా రూపొందించబోయే సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని తెలుస్తోంది.

అంటే వెంకీ, రామ్‌లు ఫిక్స్‌ అయినట్లే. గతంలో కూడా ‘మసాలా’ అనే సినిమా చేశారు. సో బన్నీ వచ్చే గ్యాప్‌లో గురూజీ ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌ వదలబోతున్నారన్న మాట.