‘ఆదిత్య 369’ వెనుక ఇంట్రస్టింగ్ స్టోరీ

0
291

టాలీవుడ్ ఇండస్ర్టీలో ‘ఆదిత్యా 369’ గురించి తెలియని వారు ఉండరంటే సందేహం లేదు. ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి టాలీవుడ్ లో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. కానీ ఇంతకు దాదాపు మూడు దశాబ్ధాల క్రితమే డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ రావు ప్రయోగం చేశారు.

1991లో సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రత్యేకంగా అభిమానులే ఉన్నారంటే అతిశయోక్తి లేదు. ఎలాంటి సాంకేతికత లేని సమయంలోనే సింగీతం అద్భుతమే సృష్టించారని చెప్పాలి. నందమూరి వారసుడు యువరత్న బాలకృష్ణ హీరోగా నటించగా, మోహిని హీరోయిన్ గా నటించింది.

భారీగా కసత్తు చేసిన సింగీతం

కేవీ రెడ్డి లాంటి టాప్ డైరెక్టర్ల వద్ద సహాయకుడిగా పని చేసిన సింగీతం తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తెరకెక్కించేందుకు సింగీతం చాలానే కసరత్తు చేశారట. ఈ కథను తన విద్యార్థి దశలోనే ఎంచుకున్నారట. అతను హెచ్‌జీ వేల్స్ నవల ‘ది టైమ్ మిషన్’ నుంచి స్ర్కిప్ట్ తయారు చేసుకున్నారట. అయితే ఇందులో ఆయన కాలంలో ముందుకు వెళ్లకుండా వెనక్కు వెళ్లి శ్రీకృష్ణ దేవరాయులు కాలంలో తెలుగు నేల సంపద, సౌభాగ్యాన్ని చూపించారు.

తెలుగులో మొదటి టై ట్రావెల్ మూవీ

తెలుగులో వచ్చిన మొదటి టైం ట్రావెల్ మూవీ ఇదే కావడం విశేషం. ఈ స్ర్కిప్ట్ ను మొదట సింగీతం శ్రీనివాస్ రావు గాయకుడు బాలసుబ్రహ్మణ్యంకు విమాన ప్రయాణంలో వివరించారట. ఆయన కూడా ఇది తప్పకుండా సినిమాగా చేయాలని సింగీతంకు సూచించారు. శ్రీకృష్ణ దేవరాయలు పాత్రకు ఎవరిని తీసుకోవాలని అనుకుంటున్న సందర్భంలో. ఈ చిత్రానికి మాటలు రాసిన జంధ్యాల బాలయ్య బాబును తీసుకోవాలని. ఆయనలోని ఆహార్యం దేవరాయులు పాత్రకు బాగా నప్పుతుందని సూచించడంతో బాలకృష్ణను ఎంచుకున్నారు.

తెనాలి రామకృష్ణుడి పాత్రను కూడా చంద్రమోహన్ తో వేయిస్తే నవ్వులు పూయిస్తాడని కూడా జంధ్యాల చెప్పడంతో ఆయన కూడా ఫైనల్ అయ్యారు. ఇక ఇందులో భారీ తారాగణం నటించారు. విలన్ గా అమ్రిష్ పురి, సిల్క్ స్మిత కూడా దేవరాయులి ఆస్థాన నర్తకిగా నటించారు.

కృష్ణ కుమార్ పాత్రకు నో చెప్పిన కమల్ హాసన్

అయితే ఇదే కథలో హీరోగా కృష్ణకుమార్ పాత్రకు మొదట కమల్ హాసన్ ను తీసుకోవాలని సింగీతం అనుకున్నారట. కథను కూడా కమల్ కు వివరించారట. కమల్ హాసన్ డేట్లు కుదరకపోడంతో ఈ సినిమాకు నో చెప్పారు. ఆ తర్వాత కృష్ణ కుమార్ పాత్ర కోసం అన్వేషిస్తున్న సమయంలో బాల సుబ్రహ్మణ్యం అక్కడ కూడా బాలయ్యనే తీసుకుంటే బాగుంటుందని సూచించడంతో డ్యూయల్ రోల్ లో ఆయన నటించారు. ఈ సినిమా టాలీవుడ్ ప్రపంచంలో ఎంతటి సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. తర్వాత కొన్ని సందర్భాల్లో ‘ఆదిత్య 369’లో అవకాశం కోల్పోవడం చాలా బాధ అనిపించిందని కమల్ హాసన్ చాలా సందర్భాల్లో చెప్పారు కూడా.