రాజమౌళితో సినిమాపై బాలకృష్ణ స్పందన

0
752

‘అఖండ’ సినిమా విజయోత్సహంలో ఉన్న బాలయ్య, తిరుమల లో స్వామివారిని దర్శించుకున్నారు. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా తెలుగు సినీ ఇండ్రస్ట్రీకి మంచి ఊపు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ సభ్యులు తిరుమల స్వామి వారిని దర్శించుకున్నారు. గురువారం వీఐపీ బ్రేక్ లో స్వామి వారిని దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తరువాత రంగనాయకుల మంటపంలో అఖండ హీరో కి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుమల ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలను బాలయ్య బాబుకి అందించారు. అంతకు ముందు బాలయ్య అభిమానులతో ఫోటోలు దిగారు. బాలకృష్ణ తో టిక్ టాక్ స్టార్ స్వాతి కూడా ఫోటో దిగారు.

ఇక ఆ తరువాత బయటకి వచ్చిన అక్కడే ఉన్న మీడియాతో మాట్లాడారు. ‘అఖండ’ సినిమాకి ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్ళకు అభినందనలు తెలిపారు. ప్రేక్షకులు కుల మతాలు, పార్టీ లకు అతీతంగా సినిమాని ఆదరించారని చెప్పారు. కరోనా మహమ్మారి పరిస్థితుల్లో సినిమా విడుదలకు కొంచం అనుమానించినా, తమ అనుమాలు పటాపంచలు చేస్తూ ప్రేక్షకులు తరలి వస్తున్నారని బాలయ్య అన్నారు. ఇదిలా ఉండగా బాలయ్య అభిమానాలు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న రాజమౌళితో సినిమా ఎప్పుడని మీడియా బాలయ్యని అడగడం జరిగింది, అందుకు బాలయ్య సమాధానంగా చిరునవ్వు నవ్వారు. అప్పుడు మౌనం అర్ధాంగీకామా? అని ప్రశించగా.. ‘అప్రస్తుతము’ అని నవ్వి ఊరుకున్నారు.