పూరీతో సినిమాకు చిరంజీవి ఓకే.. కథ ఏంటంటే..?

0
1390

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ప్రతీ డైరెక్టర్ కూడా తహతహ లాడుతాడు. బాస్ కనిపిస్తే నే సగం సినిమా హిట్.. ఇక కథ బాగుంటే చెప్పక్కర్లేదు. చాలా మంది దర్శకులకు మంచి బ్రేక్ ఈవెన్ ఇచ్చారు చిరంజీవి. దాదాపు పదేళ్లు ఇండస్ర్టీకి దూరమైనా ఆయన ప్రభ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. వస్తూ వస్తూనే బాక్సాఫీస్ హిట్ ఇవ్వడంతో పాటు ఇప్పుడు వరుస చిత్రాలను తీస్తూ మళ్లీ పాత రోజుల్లోకి వెళ్లిపోతున్నారు చిరంజీవి.

పూరికి చాలా మంది ఫ్యాన్స్

పూరీ జగన్నాథ్ టాలీవుడ్ ఇండస్ర్టీలో వన్ ఆఫ్ ద స్టార్ డైరెక్టర్. ఆయన సినిమాలకు రాజమౌళి తండ్రి రాజేంద్ర ప్రసాదే ఫిదా అవుతాడంటే పూరీ లెవలేంటో అర్థమవుతుంది. వర్మ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన పూరీ వైవిధ్య భరితమైన సినిమాలు తీసి మెప్పించారు. ఆయన డైరెక్షన్ లో సినిమాలు చేయాలని సీనియర్ హీరోలతో పాటు యంగ్ స్టార్ హీరోలు కూడా కోరుకుంటారు. అయితే ఆయన ప్రస్తుతం కష్టకాలం ఎదుర్కొంటున్నారు. ఆయన ఇటీవల తీసిన ‘లైగర్’ భారీ డిజస్టర్ ఎదుర్కొంది.

ఆయన కూడా ఓకే

దీంతో పాటు అప్పులు, డిస్ర్టిబ్యూటర్ల బెదిరింపులు, ఈడీ ప్రశ్నలు ఇలా చాలా డీప్రెషన్ లోకి వెళ్లిన పూరీ జగన్నాథ్ కొంచెం కొంచెంగా బయట పడుతున్నాడు. తన నెక్ట్స్ ప్రాజెక్టుపై కసరత్తు చేస్తున్నాడు. తను ఎంపిక చేసుకున్న ఒక ఇంట్రస్టింగ్ కథపై వర్క్ చేస్తున్నాడు పూరి. ఇందులో చిరంజీవిని హీరోగా పెట్టాలని అనుకున్నాడట. కథను కూడా చిరంజీవికి చెప్పగా.. ఆయన కూడా ఓకే చెప్పాడు. దీంతో పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో పడ్డారట జగన్నాథ్.

పూరి డైరెక్షర్ అంటేనే క్రేజ్

ఇప్పటి వరకూ ఇండస్ర్టీలో ఉన్న దర్శకుల్లో హీరో చుట్టే కథను నడిపించడంలో పూరీ బిగ్ సక్సెస్ సాధిస్తున్నాడనే చెప్పాలి. ఆయన సినిమాల్లో హీరోలు అల్లరి చిల్లరిగా తిరుగుతూ సొసైటీ పట్ల కొంత ప్రేమ, బాధ్యతతో ఉండేలా తీర్చిదిద్దుతాడు పూరి. ఈ కథలతోనే చాలా మంది హీరోలకు స్టార్ డమ్ లభించింది. కెరీర్ స్ర్టాటింగ్ ప్రేమ కథలు చేసిన పూరి. ఆ తర్వాత గ్యాంగ్ స్టర్, అండర్ వరల్డ్ కథలతో ఇండస్ర్టీ హిట్లను వెనకేసుకున్నాడు. ఆయన ఇప్పటి వరకూ మెగాస్టార్ తో ఒక్క సినిమా కూడా తీయలేదు.

వరుస పెట్టి సినిమాలు

ఆయన కొడుకు రాం చరణ్ ను ఇండస్ర్టీకి పరిచయం చేశాడు కానీ చిరంజీవితో తన డైరెక్షన్ లో మూవీ తీసే ఛాన్స్ ఇప్పటికీ ఆయనకు దక్కలేదు. గతంలో ఒకసారి చిరంజీవి, పూరి కాంబోలు ‘ఆటో జానీ’ సెట్స్ మీదకు వెళ్తుందని పుకార్లు వచ్చినా అది సాధ్యం కాలేదు. ఈ మధ్య చిరు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా కొత్త దర్శకులకే ఛాన్స్ ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే పూరికి కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇటీవల ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో పూరి చిన్న పాత్రలో చిరంజీవితో కలిసి నటించారు.

‘లైగర్’ నుంచి బయటపడుతున్న పూరి

ఈ మూవీ ప్రమోషన్ కోసం ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి, పూరి జగన్నాథ్ కలిసి పాల్గొన్నారు. మెగాస్టర్ అభిమానినైనా ఆయనతో నాకింత వరకూ సినిమా తీసే అవకాశం లేదని చెప్పుకచ్చాడు పూరి. విజయ్ దేవరకొండ, పూరి కాంబోలో వచ్చిన ‘లైగర్’ ఆయనను అన్నవిధాలుగా కోలుకోలేని దెబ్బ తీసింది. ప్రొడ్యూసర్ గా వచ్చిన నటి ఛార్మి కూడా ఈ మూవీతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. పూరి కెరీర్ లో ఇవన్నీ మామూలనే చెప్పాలి. ఇండస్ర్టీలో సక్సెస్ ఒక్కటే మనలను నిలబెడుతుందని ఆయన బాగా నమ్ముతారు. లైగర్ డిజస్టర్ నుంచి త్వరగా బయట పడతానని విశ్వసిస్తున్నాడు.

న్యూ ఎంటర్ టైనర్ గా

ఇందులో భాగంగానే చిరంజీవికి స్టోరీ లైన్ వివరించానని, ఆయన కూడా స్ర్కిప్ట్ వర్క్ పూర్తి చెయ్ సినిమా తీద్దాం అని చెప్పడంతో పూరి మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడని ఇండస్ర్టీ వర్గాలు చెప్తున్నాయి. అభిమానులు ఈ కాంబోను ఎప్పటి నుంచో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. వారు కోరుకుంటున్నట్లుగానే పూరి, చిరు కాంబినేషన్ లో ఒక మూవీ త్వరలోనే పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఈ సినిమా పూర్తిగా అవుట్ అంట్ అవుట్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని, హీరో క్యారెక్టర్ ను కూడా కొత్తగా చూపబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.