పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్..! ఆ ముగ్గురి కోసమేనట ఆ నిర్ణయం..!

0
320

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఎవరంటే ఇప్పుడు ఠక్కున గుర్తుకచ్చే పేరు ప్రభాస్. 43 సంవత్సరాలు నిండిన ప్రభాస్ ఎప్పుడు.. ఎవరిని పెళ్లి చేసుకుంటారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆయన పెదనాన్న, గాడ్ ఫాదర్ కృష్ణం రాజు కూడా ప్రభాస్ పెళ్లి చూడాలని తహ తహలారేవారట. ఆయన చాలా సార్లు పెళ్లి విషయం తీసుకచ్చినా ప్రభాస్ దాటవేసేవారట. ఇక కృష్ణంరాజు దంపతులు ఎక్కడికి వెళ్లినా వారికి ఎదురయ్యే మొదటి ప్రశ్న ప్రభాస్ పెళ్లి ఎప్పుడు..? వాళ్ల నోళ్లు మూయించేందుకైనా పెళ్లి చేసుకోవాలని పెద్దమ్మ, పెదనాన్న ప్రభాస్ కు సూచించేవారు.

ప్రభాస్ సమాకాలీకులు అందరినీ పెళ్లి

ఇక ప్రభాస్ తో పాటు వచ్చిన వారు ఆయన జూనియర్ స్టార్లకు చాలా మందికి పెళ్లిళ్లయి పిల్లు కూడా ఉన్నారు. ఎన్టీఆర్, రాం చరణ్, అల్లు అర్జున్, వారి కంటే ముందచ్చిన పవన్, మహేశ్ కు కూడా వివాహాలు జరిగాయి. కానీ ఇప్పటి వరకూ ప్రభాస్ పెళ్లి చేసుకోలేదు. వయస్సు మీదపడుతున్నా వివాహం ఎప్పుడు చేసుకుంటారు అని అభిమానులు కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రభాస్ లెగసీని ముందుకు తీసుకెళ్లే వారసుడు కావాలని అభిమానులు కోరుకోవడంలో తప్పులేదు కదా..

ప్రభాస్ ప్రేమాయణంపై గాసిప్స్

రాం చరణ్ ను మినహాయిస్తే దాదాపు యంగ్ స్టార్స్ అందరికీ వారసులు ఉన్నారు. అప్పట్లో ప్రభాస్ ప్రేమలో పడ్డారంటూ రూమర్లు బాగా వ్యాపించాయి. ఆయన కాజల్ పై మనసు పారేసుకున్నారని వార్తలు కూడా సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టగా. కొన్ని రోజుల్లో అనుష్క శెట్టితో ప్రభాస్ పెళ్లి అని కూడా వార్తలు బాగా ట్రోల్ అయ్యాయి. అయితే తాము మంచి మిత్రులమని పెళ్లి చేసుకునే ఆలోచన లేదని వారు కొట్టిపారేశారు. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ కృతీ సనన్ కు ప్రభాస్ ప్రపోజ్ చేసినట్లు పుకార్లు చెక్కర్లు కొడుతున్నాయి.

పుకార్లను ఖండించిన కృతీ సనన్

ఈ పుకార్లను కృతీ సనన్ ఖండించారు. అయితే ఆయనకు పెళ్లి చేసుకోవాలనే ఉద్ధేశ్యం మాత్రం లేదట. సినిమాపైనే నా ఇంట్రస్ట్, వివాహం అనేది తన జీవితంలో లేదని తేల్చి పారేశారట. ఈ విషయాన్ని కూడా పెద్దమ్మ వద్ద చెప్పాడని టాక్. తన ఫ్యాన్స్ కోసం జీవితాంతం సినిమాలు తీస్తూ బతుకుతానని చెప్పాడట. అభిమానులు అనే కుటుంబం నా జీవితంలో ముడివేసుకుందని ఎవరినీ నేను పెళ్లి చేసుకోనని చెప్పారట ప్రభాస్. దీనికి తోడు కృష్ణం రాజు మగ్గురు కూతుళ్ల బాధ్యత కూడా తనపై ఉందని చెప్పాడట. ఈ వార్తల్లో ఎంత వరకూ నిజం ఉందనేది తెలియాలి.