రికార్డులు సృష్టిస్తున్న రీ-రిలీజ్ మూవీ.. అప్పుడు ఆడంది.. ఇప్పుడు ఎలా?

0
231

ఇప్పుడు చిత్ర రంగం నూతన ఒరవడితో సాగుతోంది. గతంలో డిజాస్టర్లు గా మారిన చిత్రాలను ఒక్కక్కటిగా విడుదల చేస్తున్నారు. ఈ సంప్రదాయం టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ సినిమా జల్సాతో ప్రారంభమైంది. మొదటి సారి రిలీజ్ అయిన జల్సా ఆకట్టకుకోలేక పోయింది. తర్వాత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు జల్సా స్పెషల్ షో వేసుకున్నారు దీని ద్వారానే దాదాపు రూ. 3.20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. పైగా అందులో పెద్దగా మార్పులు కూడా లేకపోవడం గమనార్హం.

అయితే ఇలాంటిదే ఇటీవల కేరళలో కూడా జరిగింది. అయితే అది పాత చిత్రం కాదు. నూతనంగా రిలీజై రికార్డులు సృష్టించిన పుష్ప. పుష్ప క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అయితే కేరళలో ఈ సినిమాను మళ్లీ రిలీజ్ చేయాలని అది కూడా ఫస్ట్ రిలీజ్ డేట్ తోనే కావాలని అభిమానులు పట్టుబట్టారు. దీంతో ఈ మధ్యే రిలీజైన పుష్ప మళ్లీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

డ్రీమ్ ప్రాజెక్టుగా మలిచిన ‘బాబా’

సూపర్ స్టార్ రజినీకాంత్ ‘నరసింహా’ కలెక్షన్ల వర్షం కురిపించింది. దాని తర్వాత (1999 కాలంలో) ఆయన కలల ప్రాజెక్టు ‘బాబా’ను వెండితెరకు ఎక్కించాలనుకున్నాడు. కథ, నిర్మాణం, స్ర్కీన్ ప్లే సైతం ఆయనే చూసుకున్నారు. ఇక దర్శకత్వం మాత్రం భాషా చిత్రాన్ని తీసిన సురేశ్ కృష్ణకు అప్పగించాడు రజినీకాంత్. 15 ఆగస్టు, 2002లో ఈ చిత్రం భారీగా అంచనాల మధ్య రిలీజ్ చేశారు. కానీ ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాలేదు.

దీంతో ఈ చిత్రం ఆయన కెరీర్ లోనే భారీ డిజస్టర్ గా మిగిలింది. కానీ తన డ్రీమ్ ప్రాజెక్టుపై ఆయన ఆశలు వదులుకోలేదు. సోషల్ మీడియా విపరీతంగా జనాల్లోకి రావడంతో నెటిజన్స్ తీరిక దొరికినప్పుడల్లా ఈ సినిమాను చూడడం మొదటు పెట్టారట. దీంతో రజనీకాంత్ ఈ సినిమాను మళ్లీ రిలీజ్ చేయాలనుకున్నారు.

పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా రిలీజ్

సోషల్ మీడియాలో బాబా చూస్తున్న వారి సంఖ్యను ఇటీవల రాజనీకాంత్ పరిశీలించారట. ఇక దాన్ని రీ రిలీజ్ చేస్తే బాగుంటుందని భావించారు. అయితే రీ రిలీజ్ లో కొన్ని సన్నివేశాలను జోడించాలని కూడా అనుకున్నారట. ఈ మేరకు అప్పడు తొలగించిన సన్నివేశాలను యాడ్ చేసి ఇప్పుడు రీ రిలీజ్ చేశారు. రజనీకాంత్ పుట్టిన రోజు దగ్గరపడుతుండడంతో ఆయన పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఈ చిత్రాన్ని ఇటీవల విడుదల చేశారు.

చెన్నైలోనే వందల షోలు

బాబా సినిమా రీ-రిలీజ్ కూడా భారీగానే ప్లాన్ చేశారు. కేవలం చెన్నై నగరంలోనే దాదాపు 100 కు పైగా షోస్ తో విడుదల చేశారు రజనీకాంత్. అడ్వాన్స్ బుకింగ్ కూడా అదిరిపోయింది. ఓవర్సీస్ లో కూడా మంచి నెంబర్స్ వస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈ తరం ప్రేక్షకుల్లో కూడా బాబా ఫ్యాన్స్ ఇంకా ఉన్నారని తెలుస్తోంది. దీంతో పాటు కొన్ని కొత్త సీన్స్ ఇందులో చేర్చడంతో పాత చిత్రంలో లేనివి ఇందులో ఏమున్నాయని అప్పటి ప్రేక్షకులు కూడా చూసేందుకు ఎగబడుతున్నారు. ఈ చిత్రం టాలీవుడ్ జల్సా రికార్డులను బద్దలు కొడుతుందో లేదో చూడాలి మరి.