దిల్ రాజు వ్యూహంలో చిక్కుకున్న మైత్రీ మూవీ మేకర్స్

0
351

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు దెబ్బకు మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు చిరంజీవి, బాలయ్య విలవిలాడుతున్నారని ఇండస్ర్టీలో టాక్ నడుస్తోంది. డిస్ర్టిబ్యూషన్ రంగంలోకి దిగిన మైత్రీ మూవీ మేకర్స్ కు ఆదిలోనే ఊహించని షాక్ తగిలింది. సంక్రాంతికి బాలయ్య బాబు చిత్రం ‘వీరసింహారెడ్డి’, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలకు దిల్ రాజు భారీగా షాక్ ఇస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

దీనికి ఆయన ప్లాన్ కూడా చేసుకున్నారంటూ గాసిప్స్ గుప్పుమంటున్నాయి. తననే కాదని డిస్ర్టిబ్యూషన్ రంగంలోకి దిగిన మైత్రీ దిల్ రాజు చక్రబంధంలో కూరుకుపోవడం ఖాయం అంటున్నాయి చిత్ర వర్గాలు.

ఆదిలోనే అడ్డుకోవాలనుకుంటున్న దిల్ రాజు

సినీ పరిశ్రమపై దిల్ రాజు ఆధిపత్యాన్ని ఇండస్ర్టీలోని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. హేమా హేమీలను పక్కన పెట్టి దిల్ రాజు తన గుప్పిట్లోకి చిత్ర పరిశ్రమను పెట్టుకోవడం ఎవరూ ఊహించందే. చిత్ర పరిశ్రమకు సంబంధించిన కీలక ఏరియాలు ఇప్పటికీ దిల్ రాజు చేతిలో ఉంది. అందుకే అతడు ఏం చేసినా చెల్లుతుంది.

ఆయనను కట్టడి చేయాలనే టాలీవుడ్ లో సంక్రాంతికి ఆయన బ్యానర్ లో విడుదల చేస్తున్న వారసుడిని అడ్డుకునేందుకు ప్రొడ్యూసర్ మండలి అడ్డుకోవాలని చూసింది. కానీ దిల్ రాజు మాత్రం వారి పాచికలు పారకుండా చేశాడు.

దిల్ రాజు పాచికలు పారాయి

ఇక్కడ వారసుడును అడ్డుకుంటే తమిళ ఇండస్ర్టీలో టాలీవుడ్ చిత్రాలు విడుదల కాకుండా ఉంటాయన్న విషయాన్ని అక్కడి ప్రొడ్యూసర్ తో చెప్పించాడు అని కూడా టాక్ ఉంది. దీన్ని గమనించిన టాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ డిస్ర్టిబ్యూషన్ రంగంలోకి అడుగు పెట్టింది. వారి సొంత బ్యానర్ లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ని తమ డిస్ర్టిబ్యూషన్ సంస్థ నుంచే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు కూడా చేశారు.

అయితే దిల్ రాజు కూడా వారికి ఆదిలోనే అడ్డుకట్ట వేస్తే మంచిదని భావిస్తున్నారట. ఈ సంక్రాంతికి థియేటర్ల పంపకంలో దీన్ని అమలు చేయాలనుకుంటున్నాడట. దాదాపు 100కు పైగా థియేటర్లలో వారసుడు రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాడు.

వారసుడుతో పంచుకోనున్న స్టార్ చిత్రాలు

దిల్ రాజు దెబ్బకు సింగల్ స్ర్కీన్, డబుల్ స్క్రీన్ ఉన్న కేంద్రాల్లో వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలకు దెబ్బపడనుంది. సింగిల్ స్ర్కీన్ ఉన్న సెంటర్లలో వారసుడు మాత్రమే ఉంటుంది. ఇక డబుల్ స్ర్కీన్ ఉన్న సెంటర్లలో వారసుడితో పాటు వాల్తేరు వీరయ్య లేదా వీరసింహారెడ్డి ఆడుతాయి. ఇక్కడ వారసుడు అనేది కామన్ అన్నమాట. ఒక వేళ వారసుడు సినిమాకు ఫ్లాప్ టాక్ వస్తే జనవరి 14న విడుదల కానున్న ‘కళ్యాణం కమనీయం’ తో వారసుడి ప్లేస్ ను ఫిల్ చేయాలని చూస్తున్నారు.

ఒక వేళ చిరు, బాలయ్య బాబు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అయినా థియేటర్స్ మాత్రం కొత్తవి దొరకవు. దిల్ రాజు ఇలాంటి స్కెచ్ తో ఉన్నట్లు ఇండస్ర్టీలో ఇప్పుడు వినిపిస్తుంది. దీనిపై ఇప్పటి వరకూ ఎవరూ స్పందించలేదు. సాధారణంగా సంక్రాంతి బరిలో తెలుగు చిత్రాలను మాత్రమే చూసేందుకు అలవాటు పడిన సినీ అభిమానులు ఏ సినిమాకు మద్దతిస్తారో వేచి చూడాలి మరి.