కీర్తి సురేశ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. ఇంత తక్కువ టైంలో ఇంతనా

0
273

సినిమా వారసత్వంతో ఇండస్ర్టీలోకి అడుగు పెట్టారు కీర్తి సురేశ్. ఆమె చేసిన చిత్రాల్లో ది బెస్ట్ ‘మహానటి’. ఇలాంటి చిత్రం ఆమె కెరీర్ లో మళ్లీ ఒకటి రావడం దాదాపు కష్టమే. తల్లిదండ్రలు ఇద్దరు కూడా ఇండస్ర్టీలో ఉన్నవారు కావడంతో బాల్యంలోనే ఆమె వెండితెరపై పాదం మోపింది. బాలనటిగా కూడా కీర్తి సురేశ్ రాణించారు.

వారసత్వంగా ఇండస్ర్టీలోకి

కీర్తి సురేశ్ తల్లి మేనక ఆమె కూడా హీరోయిన్. ఇక తండ్రి సురేశ్ కుమార్ డైరెక్టర్. సౌత్ లో మంచి గుర్తింపు పొందారు మేనక. వందల సంఖ్యలో చిత్రాల్లో నటించారు మేనక. కానీ తెలుగులో మాత్రం తక్కువే ఉన్నాయి. వీరికి మలయాళం, తమిళ్ ఇండస్ర్టీలో బాగా పలుకుబడి ఉంది. దాంతో వారు చైల్డ్ ఆర్టిస్టుగా కీర్తి సురేశ్ ను తీసుకువచ్చారు. 3 మలయాళ చిత్రాల్లో బాలనటిగా నటించింది కీర్తి సురేశ్. హీరోయిన్ 2013లో ‘గీతాంజలి’ చిత్రంతో వచ్చింది.

మాతృభాషతో పాటు మరో రెండు

అటు మలయాళం సినిమాలు చేస్తూనే తెలుగు, తమిళ్ భాషల్లో కూడా చేయడం మొదలుపెట్టారు కీర్తి. కీర్తి సురేశ్ టాలీవుడ్ జర్నీని ఒక్కసారి పరిశీలిస్తే. 2016లో రాం పోతినేనితో కలిసి ‘శైలజ’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ర్టీకి పరిచయం అయ్యారు కీర్తి సురేశ్. తర్వాత నానితో కలిసి ‘నేను లోకల్’ తీశారు. ఈ చిత్రం మంచి హిట్ ఇచ్చింది. తర్వాత సాగిన ఆమె కెరీల్ లో ‘మహానటి’ వచ్చి చేరింది.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వినీదత్ కూతుళ్లు నిర్మించిన చిత్రం ఇది. ఆమె కెరీర్ లో చాలా గొప్ప చిత్రంగా చెప్పవచ్చు. ఆమెకు ఈ మూవీతో విపరీతమైన స్టార్ డం కలిసి వచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటనకు నూటికి నూరు మార్కలు పడ్డాయి. ఈ చిత్రంతోనే ఆమెను జాతీయ అవార్డు వరించింది.

మహానటితో స్టార్ డం

‘మహానటి’ విజయంతో ఆమెను వెతుక్కుంటా భారీగానే ఆఫర్లు వచ్చాయి. అందులో లేడీ ఓరియంటెడ్ సినిమాలు అరడజను పైగా తీసింది. అందులో ‘మిస్ ఇండియా’ ఒకటి. యంగ్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి ‘సర్కారు వారి పాట’లో నటించింది కీర్తి. ఈ చిత్రం కూడా విజయం సాధించింది. ప్రస్తుతం ఆమె చేతిలో చిరంజీవితో కలిసి చేస్తున్న ‘భోళా శంకర్’, నానితో కలిసి ‘దసరా’ ప్రాజెక్టులు ఉన్నాయి. మహానటి నుంచి కీర్తి సురేశ్ రెమ్యునరేషన్ పెంచింది. దీంతో చాలా ఆస్తులను పోగేసుకుంది ఈ చిన్నది.

రూ. 50 కోట్ల నుంచి రూ. 70 కోట్ల వరకూ

ప్రస్తుతం కీర్తి సురేశ్ సినిమాకు రూ. 2.5 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటుందట. ఏడాదికి 5 సినిమాలు చేస్తూ రూ. 10 కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకూ సంపాదిస్తుంది. ఇక యాడ్స్ నుంచి మరి కొంత. ఇలా ఆమె సోలోగానే రూ. 50 కోట్ల నుంచి రూ. 70 కోట్ల వరకూ కూడబెట్టిందట.