బాలయ్య నోట ‘ఆదిత్య 369’ మాట.. వచ్చే ఏడాదే సీక్వెల్

0
1411

నందమూరి నటసింహం బాలయ్య బాబు కెరీర్ లో ఓ మైలురాయిగా ‘ఆదిత్య 369’ను చెప్పుకోవచ్చు. సింగీతం శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ తెలుగునాట ప్రతి ఒక్కరినీ అలరించింది. టైమ్ ట్రావెల్ జానర్ నేపథ్యంలో సాగిన ఈ సినిమాపై ప్రస్తుత దర్శకులు రీసెర్చ్ చేస్తూనే ఉన్నారంటే సందేహం లేదు. ఒక మూసలో సాగిపోతున్న సినిమాలకు సైన్స్ ఫిక్షన్ జోడింగ్ సింగీతం మంచి హిట్ ఇచ్చారు. ఇది సమకాలంలో అనేక అవార్డులను కూడా సొంతం చేసుకుంది.

కొత్త వింతలు, వీఎఫ్ఎక్స్

ఈ సినిమాపై సీక్వెల్ చేయాలని బాలయ్య ఎప్పటి నుంచో చెప్పుకస్తున్నారు. ఫ్యాన్స్ నాడీని పట్టడంలో ఆయన తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. ప్రస్తుతం సినీ ప్రపంచంలో వస్తున్న కొత్త వింతలు, వీఎఫ్ఎక్స్ మాయాజాలాన్ని పూర్తిగా వాడుకొని మంచి కమర్షియల్ హిట్ ఇవ్వాలని కలలు కంటున్నాడు నందమూరి వారసుడు. అవసరమైతే తనే డైరెక్షన్ కూడా చేస్తానని చెప్పుకస్తున్నాడు. అందుకు సన్నాహాలు కూడా మొదలు పెట్టానని మరింత త్వరలో విషయాలు చెప్తానని చెప్పాడు.

వచ్చే ఏడాదిలో షెట్స్ పైకి

విశ్వక్ సేన్ హీరోగా చేసిన లెటెస్ట్ మూవీ ‘ధమ్కీ’. విశ్వక్ సేన్ నటుడిగా చేస్తూనే దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలను కూడా చూసుకున్నారు. మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు బాలయ్య బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. చిన్న వయసులోనే విశ్వక్ ఇన్ని బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. తాను కూడా ‘ఆదిత్యా 369’కు సీక్వెల్ ‘ఆదిత్యా 999’ చేస్తున్నానని దర్శకత్వం కూడా తానే చేస్తున్నట్లు బాలయ్య వివరించారు. వచ్చే ఏడాదిలో ఈ మూవీ షెట్స్ పైకి వెళ్తుందని చెప్పారు. ‘ధమ్కీ’పై మాట్లాడుతూ ట్రైలర్ అద్భుతంగా ఉంది. సినిమా మంచి విజయం సాధిచాలని, తమ్ముడు విశ్వక్ సేన్ లో చాలా ప్రతిభ ఉందని పొగడ్తల వర్షం కురిపించారు.