‘ప్రాజెక్ట్ కే’ గురించి స్పందించిన నాగ్ అశ్విన్

0
209

వైవిద్యమైన చిత్రాలను అందించడంలో వైజయంతీ మూవీస్ ఎప్పుడూ ముందుంటుంది. ఈ నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ప్రాజెక్ట్ కే’ ఈ మూవీ ప్రకటించి ఇప్పటికి దాదాపు రెండేళ్లు పూర్తయినా ఎలాంటి అప్టేడ్స్ లేవు. ఈ మూవీ లేట్ కావడంపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించారు. ఇది సాధారణ సినిమాలాంటిది కాదని, హైప్రొడక్షన్ వ్యాల్యూస్ తో కూడుకున్నదని, ఈ మూవీ ఎలా తీయాలో అని ఆలోచనకే చాలా సమయం పడుతుందని చెప్పాడు.

దీనిపై స్పందించిన నాగ్ అశ్విన్

ఇండియన్ మూవీ ఇండస్ర్టీలోనే క్రేజీ మూవీగా ‘ప్రాజెక్ట్ కే’ నిలుస్తుందని, నాగ్ అశ్విన్ డైరెక్షన్ గురించి వేరేగా చెప్పాలా అని సినీ అభిమానులు అంటున్నారు. ప్రభాస్ ఇందులో హీరోగా చేస్తున్నారని ప్రకటించడంతో ఈ చిత్రంపై విపరీతమైన హైప్ మొదలైంది. అసలు ఈ సినిమా కథ ఏంటి.. ఎలా ఉంటుంది..? అనే విషయాలపై ఎవ్వరికీ స్పష్టత లేదు. దీనిపై నాగ్ అశ్విన్ ఇటీవల స్పందించారు. ఇప్పటి వరకూ సిల్వర్ స్ర్కీన్ కు ఇలాంటి సినిమా రాలేదని, ఇది చాలా కొత్త పంతాలో సాగుతుంది. స్క్రిప్ట్, టెక్నీషియన్స్, విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ కొత్తగా ప్రపంచంలోకి తీసుకెళ్తాయని చెప్పాడు. ‘మహానటి’ కోసం కొన్ని సెట్స్ వేశాం, కార్లు, వ్యాన్లు అద్దెకు తీసుకున్నాం. కానీ దీనికి అలా కాదు.. మీమే దగ్గరుండి తయారు చేయించాలి అని చెప్పారు.

నాగ్ అశ్విన్ సినిమా ప్రపంచం వేరు

నాగ్ అశ్విన్ చెప్పిన విషయాలు సినిమాపై హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి. ప్రతీ ఒక్కటి సొంతంగా రూపొందించుకోవడం మామూలు విషయం కాదు. ఇందులో కొన్ని సన్నివేశాలపై కెమికల్ ఇంజినీర్ల సలహాలు తీసుకోవడంతో పాటు వారిని కూడా షూట్ లో వాడుకోవాలని చూస్తున్నారట. ప్రీ ప్రొడక్షన్ పనులే భారీ స్థాయిలో ఉన్నాయి. దీన్ని 2024 వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు నాగ్. నాగ్ అశ్విన్ సినిమా ప్రపంచం వేరు. సాధారణ దర్శకులుగా కాకుండా విభిన్నమైన కోణాన్ని ఎంచుకొని సక్సెస్ సాధించడంలో ఆయన ఇప్పటి వరకూ ముందు వరుసలోనే ఉన్నారు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’ సినిమాలను సినీ అభిమానులు కళ్లకు అద్దుకునేట్లు తీశారు.

రూ. 500 కోట్లు బడ్జెట్ తో

కరోనా టైంలో ఆయన ప్రొడ్యూస్ చేసిన ‘జాతి రత్నాలు’ కామెడీ హిట్ గా ఇండస్ర్టీని కుదిపేసింది. ఆ తర్వాత చేపట్టిన మెగా ప్రాజెక్టు ‘ప్రాజెక్ట్ కే’ ఇది భారీ తారాగణంతో రూపొందుతోంది. ప్రభాస్ సరసన దీపికా పదుకొనె చేస్తుండగా, అమితాబ్ బచ్చన్, మహేష్ బాబు, సూర్య, దుల్కర్ సల్మాన్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాస్ పుట్టిన రోజు (అక్టోబర్ 23)న వైజయంతీ మూవీస్ పోస్టర్ ను విడుదల చేసింది. హీరోలు పుట్టరు, వాళ్లు ఎదుగుతారు (Heroes are not born, the Rice) అనే మాటలతో ప్రభాస్ పాత్ర ఏ మేరకు ఉండబోతోందో చెప్తుంది. దీన్ని సుమారు రూ. 500 కోట్లు బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు నాగ్ అశ్విన్ చెప్పారు.