విడాకుల పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టినట్లే..!

0
1396

సెలబ్రెటీల విడాకుల పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి. ఇందులో చాలా వరకు పుకార్లుగానే మిగిలిపోతుంటాయి. తమ అభిమాన హీరో, హీరోయిన్లు విడిపోతున్నారన్న వార్త ఫ్యాన్స్ ను కొంతమేరకు కలవరపరుస్తూనే ఉంటాయి. ఈ పుకార్లు ఇప్పుడు వర్ధమాన హీరో నిఖిల్ సిద్ధార్థ, పల్లవి వర్మ చుట్టూ తిరుగుతున్నాయి. వీటన్నింటికీ నిఖిల్ జంట ఒక్క ఫొటో ఫుల్ స్టాప్ పెట్టారు. ప్రస్తుతం నిఖిల్, పల్లవిలు గోవా ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నారు.

‘కార్తికేయ-2’తో భారీ బ్లాక్ బస్టర్

యంగ్ హీరో నిఖిల్ ఈ ఏడాది ‘కార్తికేయ-2’తో భారీ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఈ మూవీతో ఆయన కూడా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. కార్తికేయ-2 హిందీలో బాక్సీఫీస్ వద్ద భారీ వసూళ్లను దక్కించుకుంది. కార్తికేయ షూటింగ్ లో నిఖిల్ బిజీగా ఉంటే రూమర్ రాయుళ్లు నిఖిల్ జంట విడాకులు తీసుకుంటున్నారంటూ పుకార్లు సృష్టించే పనిలో పడ్డారు. నిఖిల్, పల్లవిలు డైవర్స్ తీసుకోబోతున్నారంటూ గాసిప్ క్రియేట్ చేశారు. పుకార్లకు నిఖిల్ చెక్ పెట్టారు.

భార్యతో తీసుకున్న సెల్ఫీ

ప్రస్తుతం ఈ యువజంట గోవా వెకేషన్ లో సందడి చేస్తుంది. తన భార్యతో తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియా వేదికగా ఇన్ స్టాలో షేర్ చేసి తామెప్పుడు కలిసే ఉంటాం.. విడిపోము.. ‘మేము కలిసున్న ప్రతి సారీ ఎంతో బాగుంటుందని’ క్యాప్షన్ కూడా పెట్టాడు. వైరల్ రాయుళ్లకు తమ విడాకుల విషయాన్ని చెప్పకనే చెప్పారు నిఖిల్.

టీజర్ కూడా ఇటీవలే

నిఖిల్ ప్రస్తుతం గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ అయిన జీఏ-2 పిక్చర్స్ బ్యానర్ లో అనుపమా పరమేశ్వర్ తో కలిసి రొమాంటిక్ మూవీ ‘18 పేజెస్’ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని బన్నీ వాసు ప్రొడ్యూస్ చేస్తుండగా అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ అందించగా కుమారి 21ఎఫ్ దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేస్తున్నాడు. టీజర్ కూడా ఇటీవలే బయటకు వచ్చింది. ఈ చిత్రంలోని ఒక పాటను 22న విడుదల చేయనున్నట్లు గీతా ఆర్ట్స్ శుక్రవారం (నవంబర్ 18) ప్రకటించింది. సంగీతం గోపీ సుందర్, ఎడిటర్ గా నవీన్ నూలి, సినిమాటోగ్రఫీ వసంత్, రచయితగా విస్సా ఉన్నారు.