డేటింగ్ లో ఉన్నప్పుడు మహేశ్ అలా చేసేవాడు

0
352

నమ్రతా శిరోద్కర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. 1993లో మిస్ ఇండియాగా టైటిల్ సొంతం చేసుకున్న ఈ ముంబాయి బ్యూటీ. ఆకట్టుకునే అందంతో మంచి నటనను ప్రదర్శించే నమ్రతా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మళయాల సినిమాల్లో నటించింది. 2005లో మహేశ్ బాబును వివాహం చేసుకున్న నమ్రత తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. టాలీవుడ్ ఇండస్ర్టీలో వీరి జంటను క్యూట్ కపుల్ గా పిలుచుకుంటారు.

‘వంశీ’ సినిమా చేస్తున్న సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే ఈ విషయాన్ని మాత్రం ఇద్దరూ ఎవరికీ తెలియనివ్వకుండా గుట్టుగా ఉంచారు. చాలా రోజులు వీరి మధ్య డేటింగ్ కూడా నడిచింది. ఒకరి గురించి ఒకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ఒక్కటయ్యారు.

మహేశ్ చాలా స్పెషల్ పర్సన్

కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకరంటే మరొకరికి బోర్ ఫీలింగ్ వస్తుంది. కానీ మహేశ్ మాత్రం అస్సలు బోర్ కొట్టించేవాడు కాదట. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ, జోక్స్ వేస్తూ, నవ్విస్తూ, సందడిగా గడుపుతాడు కాబట్టి ఆయనతో ఉండాలని ఎక్కువ ఇంట్రస్ట్ చూపేదాన్ని అంటుది నమ్రత. ఇక ఇండస్ర్టీ పరంగా చూస్తే మహేశ్ టాలీవుడ్ లో ఎక్కువ గుర్తింపు సంపాదిస్తే, నమ్రత బాలీవుడ్ లో ఫేమస్ హీరోయిన్.

సౌత్, నార్త్ అయినా ఇద్దరూ ఎక్కువగా కలసుకునేందుకు ఆసక్తి చూపేవారట. ఇక వీరి డేటింగ్ కొనసాగుతున్న రోజుల్లో మహేశ్ నటించే ప్రతీ సినిమా షూటింగ్ కు నమ్రత వెళ్లేదట. షూటింగ్ పూర్తి కాగానే మహేశ్ బాబు, ఆయన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసే వారట.

మహేశ్ సందడిగా గడుపుతాను: నమ్రత

మహేశ్ కు ఫ్రెండ్స్ ఎక్కువనే చెప్తుంది నమ్రత. అందులో చాలా మంది తనకు కూడా క్లోజ్ అట. ఇక మహేశ్ అక్క మంజుల కూడా బెస్ట్ ఫ్రెండ్ అయ్యారట. ఇలా వీరి మధ్య చాలా విషయాలు కలవడంతో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారట మహేశ్-నమ్రత. తర్వాత పెద్దలకు ఈ విషయం వివరించి పెళ్లికి కూడా ఒప్పటించారు. అతడు సినిమా షూటింగ్ సమయంలో తక్కువ మంది బంధువులు, స్నేహితుల మధ్య వీరి వివాహం జరిగింది.

గొడవలు లేని జంటగా కీర్తి

కుటుంబంలో గొడవలు కామన్ సెలబ్రెటీల విషయంలో చిన్న గొడవనే ఇండస్ర్టీ అంతా గాసిప్ అవుతుంది. కానీ నమ్రత-మహేశ్ కుటుంబ విషయం కానీ, గొడవల విషయం కానీ ఇప్పటి వరకూ ఒక్క గాసిప్ కూడా వచ్చినట్లు కనిపించదు. ఒకరిని ఒకరు అర్థం చేసుకొని సర్ధుకుపోతారట. అప్పుడప్పుడూ కోపాలు, తాపాలు లేకుంటే బంధం నిలబడదని వారికి కూడా తెలుసు కానీ వాటిని హద్దులు మీరనివ్వరంటే వారి మధ్య ఎంత ప్రేమ ఉందో ఇట్లే అర్థమవుతుంది.

ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్ లో మహేశ్

ఇక మహేశ్ ప్రస్తుతం కెరీర్ విషయానికి వస్తే ‘ఎస్ఎస్ఎంబీ 28’ షూటింగ్ లో ఉండగా, మరికొన్ని ప్రాజెక్టులు కూడా త్వరలోనే ప్రారంభిస్తారని తెలుస్తుంది. ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో కొన్ని రోజులు ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్ లో గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ అందించిన కథతో రాజమౌళి మహేశ్ తో ఒక సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే దర్శక ధీరుడు ప్రకటించాడు కూడా. ఈ సినిమాను వేగంగా పూర్తి చేస్తానని రాజమౌళి కూడా ప్రకటించారు.