అమితాబ్ బచ్చన్ కు చెమటలు పట్టించిన చిరంజీవి

0
429

కొణిదెల శివశంకర వరప్రసాద్ గా బాల్యాన్ని గడిపిన ఆయన మెగాస్టార్ చిరంజీవిగా మారే వరకూ ఎన్నో ఎత్తు పళ్లాలు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. స్వయంకృషితో టాలీవుడ్ ఇండస్ర్టీ చరిత్ర పుటలో చెరగని పేజీని రాసుకున్నారు చిరంజీవి. ఇక ఆయన చేసిన సినిమాలు, అవార్డులు, రివార్డుల గురించి చెప్పుకుంటూ పోతే పేజీలు సరిపోవంటే అతిశయోక్తి కాదేమో. ‘పునాది రాళ్లు’ మొదటి చిత్రమైనా ‘ప్రాణం ఖరీదు’తో అభిమానుల ముందుకు వచ్చారు చిరంజీవి. హీరోగా చేసిన ఆయన కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా చేశారు. చిరంజీవి ఒక ప్రత్యేకమైన నటుడు ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోవడం ఆయన స్పెషల్.

బీ గోపాల్ డైరెక్షన్ లో దమ్మురేపిన మెగాస్టార్

చిరంజీవి కెరీర్ లో 80, 90 దశకం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన ఏ సినిమా చేసినా వసూళ్ల వర్షం కురిసేది. బాలీవుడ్ లో ఆయనకు సక్సెస్ రాకపోయినా బాలీవుడ్ కూడా ఆయనను మరువలేదు. అంతలా ప్రభావం చూపారు ఆయన. 1989లో మెగాస్టార్ నటించిన ‘స్టేట్ రౌడీ’ గుర్తుంది కదా.. అది మార్చిలో విడుదలై ప్రభంజనమే సృష్టించిందని చెప్పవచ్చు. ఈ చిత్రానికి దర్శకుడిగా కోదండ రామిరెడ్డిని అనుకున్నారు. కానీ ఊహించని పరిమాణంలో బీ గోపాల్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఆ సమయంలో కోదండ రామిరెడ్డి మరికొన్ని సినిమాలలో బిజీగా ఉండడంతో గోపాల్ చేయాల్సి వచ్చింది.

భారీ వసూళ్లు రాబట్టిన ‘స్టేట్ రౌడీ’

‘స్టేట్ రౌడీ’ విడుదలైన కొన్ని రోజుల వరకూ యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నా. తర్వాత మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. కోటి షేర్ రాబట్టి రికార్డు సృష్టించింది. ఈ సినిమాకు మరో చరిత్ర కూడా ఉంది. స్టేట్ రౌడీ కంటే ముందు ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ చిత్రం భారీ విజయం సాధించింది.

దీని తర్వాతి చిత్రమే స్టేట్ రౌడీ సంక్రాంతికి దుమ్మురేపిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు క్రేజ్ ను పరిశీలించిన డిస్ర్టిబ్యూటర్లు, బయ్యర్లు స్టేట్ రౌడీ చిత్రం కొనుగోలు చేసేందుకు బ్లాంక్ చెక్కులతో నిర్మాత సుబ్బిరామిరెడ్డి వద్దకు వెళ్లారట. ఈ నేపథ్యంలో భారీ అంచనాలతో స్టేట్ రౌడీ థియేటర్లలోకి వచ్చింది కానీ మొదట్టో ఫ్లాప్ టాక్ రావడంతో కొంత నిరాశకు గురైన బయ్యర్లకు తర్వాత వసూళ్ల వర్షం కురిపించిందట.

బిగ్ బీ సినిమా కంటే ఎక్కువ వసూళ్లు

అప్పట్లో నైజాంలోనే రూ. కోటి వసూళ్లు చేసిన ఈ చిత్రం బాలీవుడ్ వర్గాలను కూడా ఆశ్చర్యంలోకి నెట్టాయట. ఈ వసూళ్లను దృష్టిలో పెట్టుకొని అప్పటి ఒక సినీ మ్యాగజీన్ ‘వేర్ ఈజ్ అమితాబ్’ అంటూ ఒక ఆర్టికల్ ను ప్రచురించింది కూడా. బాలీవుడ్ బిగ్ బీ గుర్తింపు సంపాదించుకున్న అమితాబ్ బచ్చన్ క్రేజ్ చాలా హైప్ లో ఉంది. ఆయన సినిమా కూడా స్టేట్ రౌడీ చిత్రం రిలీజ్ సమయంలోనే విడుదలైంది. కానీ చిరంజీవి సినిమా అమితాబ్ సినిమా కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది. ఆ సమయంలో నిజంగా బాలీవుడ్ బిగ్ బీకి స్టేట్ రౌడీ చెమలు పట్టించిందనే చెప్పాలి.