నా భర్త చనిపోయినప్పుడు చెప్పకుండా దాచేశారు

0
330

సహజ నటిగా గుర్తింపు పొందిన జయసుధ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటి వరకూ దాదాపు 300 పైగానే చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులను అందుకున్నారు ఆమె. మద్రాస్ లో పుట్టి పెరిగిన ఆమె తన మేనత్త విజయ నిర్మల ప్రోత్సాహంతో బాల్యంలోనే ఇండస్ర్టీలో అడుగు పెట్టింది. ఇక హీరోయిన్ గా ప్రస్థానం మొదలు పెట్టిన జయసుధ రెండు దశాబ్ధాల పాటు తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో చిత్రాల్లో కొనసాగింది. ఆమె నటనకు అందరూ ఫిదా కావాల్సిందే. కోట్లాది మంది ఫ్యాన్స్ ను ఆమె తన ఖాతాలో వేసుకుందంటే సందేహం లేదు.

సహజ నటిగా కీర్తి

ఏ పాత్ర అయినా సరే అందులో పరకాయ ప్రవేశం చేసేది జయసుధ. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే బెటర్ అని భావించింది. తల్లిగా, అక్కగా, అత్తగా, వదినగా ఇలా అనేక పాత్రల్లో నటిస్తూ మెప్పించారు జయసుధ. యువరత్న బాలకృష్ణతో పలు సినిమాల్లో నటించిన జయసుధ. ఆహా వేదికగా ‘అన్ స్టాపబుల్ సీజన్ 2’లో కో స్టార్ జయప్రద, యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నాతో కలిసి పాల్గొన్నారు. ఈ ఎపీసోడ్ ఫన్ తో పాటు ఇంట్రెస్టింగ్, ఎమోషన్ గా కూడా సాగింది.

అన్ స్టాపబుల్ లో కన్నీటి పర్యంతమైన జయసుధ

‘అన్ స్టాపబుల్’ తన జీవితంలోని కొన్ని విషయాలను ఆడియన్స్ తో పంచుకున్నారు జయసుధ. తన భర్త మరణంపై ఆసక్తికరమైన విషయాలను చెప్పింది. జయసుధ భర్త నితిన్ కపూర్ అని అందరికీ తెలిసిందే కదా.. ‘నితిన్ ఐదు సంవత్సరాల క్రితం చనిపోయారు. భార్యగా ఆయన లేడని తెలిస్తే ఎంత బాదుంటుందో అందరికీ తెలుసు. కానీ ఆ విషయాన్ని ఎవరూ నాకు చెప్పలేదు.

నితిన్ చనిపోయాడన్న వార్తను నాదగ్గర దాచారు. నా భర్త చనిపోయాడన్న విషయం బాలకృష్ణకు నాకంటే ముందే తెలిసింది. నా పిల్లలు బాలయ్యకు ఫోన్ చేసి ఈ విషయం అమ్మకు చెప్పద్దు అన్నారట. ఆ సమయంలో నేను ఒక చిత్రం షూటింగ్ లో ఉన్నాను. నితిన్ కపూర్, బాలకృష్ణ యంగ్ ఏజ్ నుంచి మంచి ఫ్రెండ్స్.

ఆ సమయంలో పక్కనుంది బాలకృష్ణ, జయప్రద

నితిన్ మృతి చెందిన టైంలో బాల(బాలకృష్ణ) నాకు సపోర్ట్ గా నిలిచారు. జయప్రద కూడా ఉన్నారు. నా పెళ్లి సమయంలో ఉన్న జయప్రద, నా భర్త చనిపోయిన సమయంలో కూడా నా పక్కన ఉంది.’ అని చెప్తూ కన్నీటి పర్యంతమైంది జయసుధ. ఒక్కసారి సెట్ అంతా ఎమోషన్ కు గురైంది. బాలీవుడ్ హీరో జితేంద్ర తమ్ముడే జయసుధ భర్త నితిన్ కపూర్. 1985లో వీరి వివాహం జరిగింది. 2017 మార్చిలో నితిన్ ముంబైలోని తన నివాసంలో చనిపోయారు. ఇది ఆత్మహత్య అంటూ అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.