చలపతి రావు కు ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలుసా..

0
533

జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న నటుడు తమ్మారెడ్డి చలపతి రావు. ఆయన దాదాపు 1200 పైగా చిత్రాల్లో నటించారు. విలన్ పాత్రలతో పాటు కామెడీ పాత్రలను కూడా వేసిన ఆయన అన్నింట్లో ఒదిగిపోయేవారు. కృష్ణా జిల్లా, పామర్రు మండలం, బల్లిపుర్రు గ్రామంలో 8 మే, 1944న వియ్యమ్మ-మణయ్య దంపతులకు జన్మించారు.

1966లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా చేసిన ‘గూఢచారి 116’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు చలపతిరావు. అప్పటి నుంచి ఆయన చిత్రాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన చివరి చిత్రం ‘బంగార్రాజు’. ఆయన కొన్ని చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఆదివారం (డిసెంబర్ 25)న హైదరాబాద్ లోని ఆయన నివాసంలో తెల్లవారు జామున గుండెపోటుతో మరణించారు.

మూడు తరాలతో నటించిన ఘనత

చలపతి రావు ఆయన ఎంచుకున్న రంగంలో రాణించేందుకు ఎంతో కష్టపడ్డారు. ఆయన నటించిన ఒక్కో సినిమాలో ఒక్కో వైవిధ్యమైన పాత్రలో కనిపించేవారు వందలాది చిత్రాలలో నటించి మెప్పించారాయన. విలన్ గానే కాకుండా కమెడియన్ గా కూడా ఆయన నటనంటే అభిమానించే తెలుగు వారు కోకోళ్లలనే చెప్పాలి. చిన్నతనం నుంచి ఆయనకు నటన అంటే విపరీతమైన ఆసక్తి ఉండేది.

ఈ నేపథ్యంలో వీధి నాటకాలు వేసేవారు. ఆ తర్వాత మెల్లమెల్లగా చిత్ర సీమవైపు అడుగులే వేశారు. కృష్ణ తో కలిసి గూఢచారి 116 తర్వాత నందమూరి తారక రామారావు తో కలిసి 1969లో ‘కథానాయకుడి’లో కీలక పాత్రలో నటించారు.

నిర్మాతగా కూడా

దాదాపు ఐదున్నర దశాబ్దాలు చిత్ర సమీలో ఒక వెలుగు వెలిగిన చలపతి రావు 1200 కు పైగా చిత్రాల్లో నటించడంతో పాటు కొన్ని చిత్రాలకు ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించారు. దాదాపు మూడు తరాల నటులతో నటించిన ఘనత బహూశా ఆయనకే దక్కింది అనుకోవాలి. ఆయన కొడుకు రవిబాబు కూడా మంచి నటుడు, దీంతో పాటు ఆయన పలు చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు. ఇన్ని చిత్రాల్లో నటించడం, కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించినా చలపతిరావు ఆస్తులను మాత్రం ఎక్కువగా కూడబెట్టలేకపోయారు.

ఆయన ఆస్తుల విలువ రూ. 20కోట్లు

చలపతి రావు ఆస్తుల విలువ రూ. 20 కోట్లు మాత్రమే నట. అది కూడా ఆయన పేరుమీదున్న రెండు ఇండ్లకు సంబంధించినవిగా తెలుస్తోంది. ఇవి తప్ప ఏ ఇతర ఆస్తులు కూడా ఆయన సంపాదించకపోవడం గమనార్హమే. ఆయనకు ఇద్దరు కూతుళ్లు కాగా, ఒక కొడుకు ఉన్నారు. కూతుళ్లు యూఎస్ లో సెటిల్ అయ్యారు. ఇక కొడుకు రవిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఉన్న రవిబాబు నివాసంలోనే ప్రస్తుతం చలపతి రావు ఉంటున్నారు. ఆయన మరణ వార్త విన్న ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.