మోహన్ బాబు నా కాలర్ పట్టుకున్నాడు

0
189

సీనియర్ నటులుగా ఇండస్ట్రీలో మంచి గౌరవం అందుకుంటున్న వారు మోహన్ బాబూ, మురళీ మోహన్. ఇద్దరూ దాదాపుగా సమకాలీన నటులే ఒకరంటే ఒకరికి విపరీతమైన గౌరవం కూడా ఉంది. అయితే ఒక సందర్భంలో ఒకరిపై ఒకరు వాగ్వాదం చేసుకున్నారట ఈ విషయాలను మురళీ మోహన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మోహన్ బాబూ నేను ఒకరికొకరం గల్లాలు పట్టుకునే దాకా వెళ్లాం కానీ తర్వాత ఒక విషయం జరిగింది. అసలు వీరికి ఎక్కడ గొడవ మొదలైందో తెలిస్తే ఆశ్చర్యపోతారు మరి.

ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న మురళీ మోహన్

స్వయంగా బిజినెస్ మ్యాన్ గా ఎదుగుతున్న సమయంలో నటనపై ఇంట్రస్ట్ తో ఇండస్ట్రీలోకి వచ్చారు మురళీ మోహన్. అట్లూరి పూర్ణ చందర్ రావు డైరెక్షన్ లో 1973లో వచ్చిన ‘జగమే మాయ’ చిత్రంతో మురళీ మోహన్ వెండితెరపై అడుగు పెట్టాడు. అప్పట్లో ఆయనకు శోభన్ బాబు లాగా భారీగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మురళీ మోహన్. మా అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఆయన పని చేశారు. తర్వాత మెల్లమెల్లగా పాలిటిక్స్ వైపు మళ్లారు. టీడీపీ అభ్యర్థిగా రాజమండ్రి నుంచి గెలిచి పాలిటిక్స్ లో కూడా అడుగుపెట్టారు. ‘జయభేరి ఆర్ట్స్’ అనే బ్యానర్ స్థాపించి ఎన్నో మంచి చిత్రాలను నిర్మించారు మురళీ మోహన్.

మోహన్ బాబుతో

ఇక మోహన్ బాబు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆయన మొదట్లో ఇండస్ట్రీలోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘అసెంబ్లీ రౌడీ’ లాంటి సినిమాల్లో ఆయన నటనకు మంచి ప్రశంసలు దక్కాయనే చెప్పాలి. మురళీ మోహన్ మా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఒక ఘటన జరిగింది. ఇది ఇటు మురళీ మోహన్, మోహన్ బాబును తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. మా అధ్యక్షుడిగా మురళీ మోహన్ వ్యవహరిస్తున్న సమయంలో సౌత్ ఇండస్ట్రీ మొత్తం క్రికెట్ టోర్నీ నిర్వహించాలని అందరూ భావించారు.

దీనికి సంబంధించి తెలుగు నుంచి మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్ లతో నాలుగు జట్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ సమయంలో మోహన్ బాబు మురళీ మోహన్ ను సంప్రదించి తన కొడుకు మంచు విష్ణు కూడా క్రికెట్ ఆడుతాడని చెప్పాడు. అప్పటికీ విష్ణు సినిమాల్లో లేడు. దీంతో కుదరదు అని చెప్పాను. నా మాటకే ఎదురు చెప్తావా అంటూ ప్రశ్నించాడు. ఎంత పెద్ద వారైనా రూల్ ఈజ్ రూల్ కదా అన్నారు మురళీ మోహన్ దీంతో ఒకరి కాలర్ ఒకరు పట్టుకున్నారు. చిన్నపాటి వాగ్వాదం కూడా జరిగింది.

మూడు రోజులకు మాట్లాడిన మోహన్ బాబు

ఈ విషయంపై ఇటీవల చెప్పుకచ్చిన మురళీ మోహన్. మోహన్ బాబు ఉన్నతమైన వ్యక్తి అని చెప్పారు. ఆ ఘటన జరిగిన తర్వాత ఇక తనతో మాట్లాడరు కావచ్చు అనుకున్నా. కానీ మూండు రోజుల తర్వాత ఆయనే స్వయంగా వచ్చిన నన్ను పలకరించి స్వామీ చెప్పారు. ఒక సమయంలో ఆవేశానికి గురైనా తప్పు తెలుసుకున్నారు కాబట్టి సంతోషం అని పించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎప్పుడూ గొడవ పడలేదు.