నన్నెవడ్రా నిషేధించేది అంటున్న సురేష్‌ కొండేటి

0
442
suresh kondeti

సురేష్‌ కొండేటి… ఈ పేరు తెలియని తెలుగు సినిమా వ్యక్తి ఉండరంటే అతిశయోక్తి కాదు.. అలాగే తెలుగు ప్రేక్షకులు కూడా ఉండరని కూడా చెప్పుకోవచ్చు. సినిమాల మీద పిచ్చితో పాలకొల్లు నుంచి హైదరాబాద్‌ వచ్చి.. కృష్ణాపత్రికలో ఆఫీస్‌బాయ్‌గా జీవితాన్ని ప్రారంభించి.. అక్కడే సినిమా జర్నలిస్ట్‌గా మారాడు.

అక్కడి నుంచి వార్తలో సినిమా పేజీలో రిపోర్టర్‌గా చేరి.. ఆపై జర్నలిస్ట్‌గా, సంతోషం పత్రిక అధినేతగా, పంపిణీదారుడిగా, నిర్మాతగా ఎదిగిన వ్యక్తి. ప్రారంభంలో సూపర్‌స్టార్‌ కృష్ణకు వీరాభిమాని అయిన సురేష్‌ కొండేటి ఆ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవికి బాగా దగ్గరయ్యారు.

అయినప్పటికృష్ణ గారంటే అతనికి ఇప్పటికీ ఎలేని అభిమానం. అలాగే సినిమా పరిశ్రమలోని అందరితోనూ సురేష్‌కు మంచి రిలేషన్‌ ఉంది. గత 22 సంవత్సరాలుగా సంతోషం ఫిల్మ్‌ అవార్డ్స్‌ నిర్వహిస్తూ తనను తాను మరింత ఎత్తుకు పెంచుకున్నాడు. సురేష్‌ అంటే మెగా క్యాంప్‌ వ్యక్తి అనేది బహిరంగమే.

మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు కూడా సురేష్‌ పట్ల అభిమానం చూపుతూనే ఉంటారు.
తాజాగా గోవాలో జరిగిన సంతోషం అవార్డ్స్‌ వివాదాలకు వేదికగా మారింది. దీంతో పలువురు కన్నడ, తమిళ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు అల్లు అరవిందుకు ఫోన్‌ చేసి తమకు జరిగిన అవమానాన్ని చెప్పుకున్నారట.

ఆ వేడుకలో అల్లు అరవింద్‌కు సైతం అవమానం జరగడం వేరే విషయం అనుకోండి. ఈ రభసతో మెగా ఫ్యామిలీకి చిర్రెత్తుకొచ్చింది. ఆ ఫంక్షన్‌ మెగా ఫ్యామిలీ నిర్వహించింది కాదని, సురేష్‌ వ్యక్తిగతం చేసుకున్న ఫంక్షన్‌ అని అల్లు అరవింద్‌ మీడియా సమావేశంలో చెప్పడం వివాదం మరింత ముదిరింది.

ఈ విషయంలో కలగజేసుకున్న తెలుగు ఫిలిం ఛాంబర్‌ సురేష్‌ మెంబర్‌గా ఉన్న పలు సెక్టార్‌లకు అతని మీద చర్యలు తీసుకోవాలని లేఖలు రాసింది. ఇందులో భాగంగా తెలుగు సినిమా జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ఓ మీటింగ్‌ కూడా పెట్టింది.

suresh kondeti

చాణక్యుడి నీతి: విజయం సాధించాలంటే ఇలా చేయాలి

అయితే ఇక్కడ తెలుగు సినిమా జర్నలిస్ట్‌లకు సంబంధించి 3, 4 అసోసియేషన్స్‌ ఉండటంతో ఎవరు ఇనీషియేట్‌ తీసుకోవాలో అర్ధం కాలేదు. ఆ తర్వాత తెలుగు సినీ పీఆర్వోలు ఓ మీటింగ్‌ పెట్టుకున్నారని, అందులో సురేష్‌పై నిషేధం విధించాలని నిర్ణయించారని వార్తలు వచ్చాయి.

దీనిపై సురేష్‌ కొండేటి కూడా తీవ్రంగానే స్పందించారు. గోవా ఈవెంట్‌ అనేది నా వ్యక్తిగతం.. నేను ఎవరికి సమాధానం చెప్పాలో వారికి చెప్పాను. ఎవరికి సర్దిచెప్పుకోవాలో వారికి సర్ధిచెప్పుకున్నాను.

30 ఏళ్లు కష్టపడి, సినిమానే నమ్ముకుని ఈ స్థాయికి చేరుకున్నాను. అయినా నన్ను నిషేధించటానికి ఎవరికీ హక్కులేదు. ఏ బెదిరింపులకు భయపడేది లేదు అంటూ గట్టిగా సమాధానం ఇచ్చాడు.