ఆ అమ్మాయి కోసం గొడవపడిన ప్రభాస్, గోపీచంద్

0
306

‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతున్న ‘అన్ స్టాపబుల్’ క్రియేట్ చేస్తున్న రికార్డులు అంతా ఇంతా కావు. సీజన్ 1 భారీ సక్సెస్ సాధించడంతో సీజన్ 2ను మరింత వైవిధ్యంగా తీర్చిదిద్దారు నిర్వహకులు. బాలకృష్ణ కూడా పొలిటీషియన్ల నుంచి సీనియర్, జూనియర్ నటులను తీసుకువస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. ఇటీవల ప్రభాస్ ఎపీసోడ్ ను రెండు భాగాలుగా రిలీజ్ చేశారు.

ఆహా రెండో ఎపీసోడ్

మొదటి ఎపీసోడ్ 30 డిసెంబర్, 2022లో ప్రసారం కాగా రెండో ఎపీసోడ్ 6 జనవరి, 2023న స్ర్టీమింగ్ లోకి వచ్చింది. మొదటి ఎపీసోడ్ మొత్తాన్ని ఒక్క ప్రభాస్ మాత్రమే కనిపించేలా డిజైన్ చేసిన ఆహా రెండో ఎపీసోడ్ లో ఆయన స్నేహితుడు, కో నటుడు గోపీచంద్ ను తీసుచ్చింది. దీంతో ఇద్దరితో కలిసి బాలకృష్ణ చేసిన సందడి అంతా ఇంతా కాదనే చెప్పాలి.

అమ్మాయి గురించి ప్రశ్నించిన బాలయ్య

గెస్ట్ జీవితంలోని పాత విషయాలను కూడా నవ్వుకుంటూ బయట పెట్టిస్తున్నారు బాలకృష్ణ. ఇటీవల రిలీజైన సెకండ్ ఎపీసోడ్ ప్రోమో ఒకటి విడుదల చేశారు నిర్వాహకులు. ఇందులో ఆసక్తి కరమైన చర్చ జరిగింది. బాలయ్య బాబు ప్రభాస్, గోపీచంద్ ను ఒక ప్రశ్న అడిగాడు. 2008లో ఒక హీరోయిన్ కోసం ఇద్దరూ గొడవ పడ్డారట. ఆమె ఎవరూ..? అంటూ బాలయ్య అడిగాడు. ప్రభాస్ వెంటనే కలిపించుకొని నాకెలాంటి సంబంధం లేదు గోపీనే అడగండి అంటూ సమాధానం చెప్పాడు. అప్పుడు గోపీచంద్ కవర్ చేస్తూ 2008లో కాదు 2004 జరిగిందని చెప్పాడు. మరి ఎవరా హీరోయిన్ అని అడుగగా త్రిష అని చెప్పాడు గోపీ.

సినిమా గురించి గోపీచంద్

ఈ ఆన్సర్ తో ప్రభాస్ తో పాటు బాలయ్య కూడా షాక్ కు గురయ్యాడు. తన గురించి మనం ఎప్పుడు కొట్టకున్నాం అంటూ గోపీచంద్ వైపు చూశాడు ప్రభాస్. అప్పుడు గోపీచంద్ ‘వర్షం’ మూవీ గురించి చెప్పాడు. వర్షంలో త్రిష కోసం ఇద్దరం కొట్టుకున్నాం అంటూ చెప్పాడు. ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా, గోపీచంద్ విలన్ గా నటించారు. వెంటనే బాలయ్య కలుగజేసుకొని నీ ఒంగోలు తెలివితేటలు చూపించకు. అసలు విషయం చెప్పు అంటూ కోరాడు. ప్రోమోలో వచ్చిన ఈ సన్నివేశం వీక్షకుల్లో చాలా క్యూరియాసిటీని కలిగించింది. ప్రస్తుతం ప్రభాస్ రెండో ఎపీసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ లో ఉంది.